🙏 *మరణం సృష్టిధర్మం*🙏

P Madhav Kumar

🌻🌻🌻🌻🌻🌻

🍁'అనుదినం తన కళ్లముందే ఇంతమంది చనిపోవడం మనిషి చూస్తూనే ఉంటాడు. తనకు మాత్రం మరణం లేదని భ్రమపడుతూ ఉంటాడు. ఇది అన్నింటి కన్నా ఆశ్చర్యకరమైన విషయం' అంది మహాభారతం.


🍁 'ఆ ఏమరిపాటే మృత్యువు' అంటుంది వేదాంతం. 'పుట్టినవారికి మరణం తప్పదు' అని హెచ్చరించింది. భగవద్గీత చూస్తుండగానే ఆయువు క్షీణించిపోతుంది అని ఏనాడో గుర్తు చేసింది. ఆది శంకరుల ఉపదేశం. 


🍁'కన్ను తెరిస్తే జననం, మూస్తే మరణం... రెప్పపాటే జీవితం' అని చెబుతోంది ఆధునిక కవిత్వం ఈ ఉపదేశాలు, ఉదాహరణలు మనకు ఏం తేల్చి చెబుతున్నాయి. ఈ హెచ్చరికల అంతరార్ధం ఏమిటి? ఈ ఉపదేశాలు వాస్తవానికి కర్తవ్య నిర్దేశాలు. బెదరగొట్టడం కాదు, మేలుకొల్పడం వాటి భగవద్గీతలక్ష్యం. 


🍁మనిషికి లభించే సమయం చాలా స్వల్పమైనది. కాబట్టి సోమరితనాన్ని విడిచిపెట్టి, కాలాన్ని సద్వినియోగం చేసుకొమ్మని. కర్తవ్యాన్ని చేపట్టమని చెప్పడానికే మన పెద్దలు మరణాన్ని గురించి ఇన్ని రకాలుగా వ్యాఖ్యానించారు. 'మేలుకోండి. జాగరూకులు కండి.మీకు లభించిన మానవజన్మ ఎంత విలువైనదో, కాలం అమూల్యమైనదో గ్రహించండి. జన్మను సార్ధకం చేసుకోండి... అని కఠోపనిషత్తు బోధించింది.


🍁 'క్షణం క్షణం విద్యను, కణం కణంగా డబ్బునూ సంపాదిస్తూనే ఉండు. ఏమాత్రం ఏమరిపాటు లేకుండా కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉండు' అంటూ చక్కని మార్గాన్ని సూచించింది భారతీయ సారస్వతం కర్తవ్యాన్నే తప్ప కర్మత్యాగాన్ని అది ఏనాడూ బోధించలేదు. పనినే తప్ప పలాయనవాదాన్ని ఎక్కడా ప్రోత్సహించలేదు. 'మృత్యువు నీ వాకిట పొంచి ఉన్నదన్న ఎరుకతోనే ఉంటూ నీ ధర్మాన్ని నీవు చక్కగానిర్వర్తించు' అనేది భారతీయ ధర్మశాస్త్రాల సందేశం. మన విద్యల సారాంశం.


🍁 మృత్యువు సంగతి దృష్టిలో పెట్టుకొని, మన పని మనం చేసుకుంటూనే పోవాలి. అది మనం గ్రహించవలసిన సత్యం. ఆచరించవలసిన ధర్మం. 'ధర్మం ఏమిటో నాకు స్పష్టంగా తెలుసు... కాని అది నా స్వభావంగా స్థిరపడటం లేదు. ఆదర్శం గురించీ నేను బాగా ఎరుగుదును... అయినా అది నా నుంచి దూరం కావడం లేదు' అన్నాడు మహాభారతంలో సుయోధనుడు. 


🍁మనలో చాలామంది పరిస్థితినిజంగా అదే. దుర్యోధనుడు చెప్పాడు. మనం చెప్పడం లేదు. అంతే తేడా! కురుక్షేత్ర సంగ్రామానికి ముందు ఎన్నో సందేహాలు చుట్టుముట్టాయి. అర్జునుణ్ని. దుఃఖం ఆవరించింది. కృష్ణుడు కనికరించాడు. స్వధర్మాన్ని గుర్తుచేశాడు. కర్తవ్యాన్ని వివరించాడు. మన జీవితమూ ఒక యుద్ధమే. సందేహాల విషయంలో మనమూ అర్జునులమే. 

🍁అప్పట్లో సుయోధనులకు రుషులు, అర్జునులకు అవతారపురుషులు ఏం చెప్పారో... వాటినే మనం ఇప్పుడు ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా వింటున్నాం. తెలుసుకుంటున్నాం. ఆచరిస్తే అర్జునులమవుతాం. పెడచెవిన పెడితే దుర్యోధనులం అవుతాం.


🍁 'ఇక ఏడు రోజులే బతుకుతావు'' అన్నప్పుడు- పరీక్షిత్తు భయంతో ఏడుస్తూ కూర్చోలేదు.

🍁 భాగవతాన్ని వినడం ద్వారా చనిపోతున్నాననే స్థితి నుంచి తేరుకొని తానే శరీరాన్ని విడిచి పెడుతున్నాననే నిశ్చింతను సాధించాడు. 

🍁పరీక్షిత్తు కన్నా చాలా ఎక్కువ సమయమే మనకు లభించింది- అర్ధం చేసుకోగలిగితే!


*సర్వేజనాసుఖినోభవంతు*🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat