*గరుడ పురాణము* 🌺 *అధ్యాయం -2*

P Madhav Kumar


 *విష్ణుభగవానుని అవతార వర్ణనం* 


ఆరవ అవతారం దత్తాత్రేయుడు అత్రి మహర్షి  


🌺శౌనకదేవా! ఇతర మునీంద్రులారా! మీరడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా గరుడ పురాణాన్ని వినిపించి నేనూ ధన్యుడనౌతాను.ఈ గరుడ మహాపురాణము విష్ణుకథా పరిపూర్ణము. మహాత్ముడు, మహానుభావుడు, తన తపోబలంతో భాగ్యవిశేషంతో విష్ణు భగవానుని వాహనమై ఆయన సామీప్యాన్ని పొందినవాడైన గరుత్మంతుడు కశ్యపమహర్షికి ఈ పురాణాన్ని వినిపించాడు.


🌺మా గురుదేవులైన వ్యాసమహర్షి నాకు వినిపించి అనుగ్రహించారు.దేవతా శ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుడే. ఆయనే పరబ్రహ్మ, ఆయనే పరమాత్మ ఆయన ద్వారానే ఈ జగత్తు ఉత్పత్తి, స్థితి, సంహారాలు జరుగుతున్నాయి. ఆయన జరామరణ రహితుడు. భగవంతుడైన ఆ వాసుదేవుడు జన్మ అనగా పుట్టుకలేని వాడైనా జగత్తు రక్షణ కై ఎన్నో రూపాల్లో అవతరిస్తుంటాడు.


🌺మునులారా! ఆ పరమాత్మ మొట్టమొదట కౌమార సద్గులుగా అవతరించాడు. అప్పుడే కఠోర బ్రహ్మచర్య వ్రతాన్నవలంబించి దాని గొప్పదనాన్ని వేదాలతో సహాలోకానికి చాటి చెప్పాడు. రెండవ అవతారంలో యజ్ఞేశ్వరుడైన ఆ శ్రీహరియే వరాహ శరీరాన్ని ధరించి హిరణ్యాక్షునిచే రసాతలంలో ముంచి వేయబడ్డ పృధ్విని ఉద్ధరించి స్థితి కారకుడైనాడు. మూడవ అవతారం ఋషి నారదుడను పేరుతో జన్మించి 'సాత్వతతంత్య్రసనక సనందన సనత్కుమార, సనత్సుజాతులు కొనూరసద్ధులు.(నారద పాంచరాత్ర) బోధనను చేశాడు. ఇందులో నిష్కామకర్మను గూర్చి చెప్పబడింది. 


🌺'నాలుగవది 'సరనారాయణ' అవతారం. ఇందులో శ్రీహరి ధర్మరక్షకోసం కఠోరతపస్సు చేశాడు, దేవతలూ దానవులూ కూడా నరనారాయణ మహర్షులను ఆరాధించారు. అయిదవ అవతారంలో శ్రీహరి కపిలనామంతో సిద్ధులలో సర్వశ్రేష్ఠునిగా జనించి కాలగర్భంలో. కలిసి పోయిందనుకున్న సంఖ్యాశాస్త్రాన్ని సముద్ధరించి ప్రపంచానికి ప్రసాదించాడు.


🌺ఆరవ అవతారం దత్తాత్రేయుడు అత్రి మహర్షి అనసూయ దంపతులకు ఒకప్పుడిచ్చిన వరాన్ని పురస్కరించుకొని శ్రీహరి వారికి పుత్రునిగా జన్మించి కొన్నివందల మందికి జ్ఞానోపదేశాన్నిచ్చాడు. ముఖ్యంగా అలర్యమహారాజుకీ, ప్రహ్లాదునికీ బ్రహ్మ విద్యను ఉపదేశించాడు.


🌺 ఏడవ అవతారం యజ్ఞదేవనామకం. శ్రీమన్నారాయణుడు ప్రజాపతి ఆకూతి దంపతులకు మన స్వాయంభువ మన్వంతరంలోనే జన్మించి ఇంద్రాది దేవగణాలచే అద్భుతమైన యజ్ఞాలను చేయించి, అందరికీ వాటి పద్ధతిని బోధించి యజ్ఞదేవుడను 'పేర పూజలందుకున్నాడు. ఎనిమిదవ అవతారంబుషభదేవుడు కేశవుడే నాభి. మేరుదేవి దంపతుల పుత్రునిగా జనించి స్త్రీలకు పరమాదర్బంగా గృహస్థాశ్రమాన్ని నిర్దేశించి, నియమాల నేర్పణచి సర్వాశ్రమాలచేత నమస్కరింపబడేటంత శ్రేష్ఠంగా గృహస్థాశ్రమన్ని సిద్ధముచేశాడు.


🌺ఋషులు ప్రార్ధించగా లక్ష్మీనాథుడు వృధు మహారాజుగా పుట్టి గోరూపంలో నున్న నుండి దుగ్ధమునువలె అన్నాదికములనూ ఔషధరాశులను పిండి, పితికి మానవ జాతికి ప్రసాదించాడు. ఇది ఆయన తొమ్మిదవ అవతారమయింది.భగవంతుని పదవ అవతారము మత్స్యావతారం. చాక్షుష మన్వంతరం చివర్లో ప్రళయం వచ్చినపుడు విష్ణువాక బ్రహ్మండమైన చేపరూపమును ధరించి భూమినే నావగా మార్చి వైవస్వతమనువును ప్రాతినిధ్య జీవరాశులతో సహా అందులోకి రమ్మని ఆదేశించి ఆ పడవ మునిగిపోకుండా కాపాడి సృష్టిని రక్షించాడు.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat