గరుడ పురాణము అధ్యాయం 3-తృతీయ భాగం - గరుడునికి పురాణసంహిత వరదానం*

P Madhav Kumar

 *యక్షి ఓం తం స్వాహా అనే మంత్ర జపనం వల్ల ఒక కాలిపోయిన చెట్టునుతిరిగి* 🌷

 *గరుడునికి పురాణసంహిత వరదానం* 


🌺ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుత్మంతుడు గొప్పతపస్సు ద్వారా నన్ను ఆరాధించాడు. అతని తపస్సువల్ల సంతుష్టుడనై సాక్షాత్కరించి నీకేం కావాలో కోరుకో అన్నాను.దేవదేవా! నాగులు నా తల్లిని దాసిగా చేసుకున్నారు. ఆమెను ఆ దాసీత్వగ్రహణం. నుండి విడిపించడానికి అమృతం కావాలి. మీరు నాకు వరమిస్తే నేను వారిని గెలిచి నా తల్లికి దాస్య విముక్తిని గావించి వచ్చి మీ వాహనంగా శాశ్వతంగా నిలచిపోతాను.


🌺 మీరు వరమిస్తే పురాణ సంహిత రచనాకారునిగా మీ సన్నిధిలోనే వుంటూ మిమ్మల్ని సేవించుకుంటూ ప్రపంచానికి మేలు చేయగలుగుతాను ఇదే నా ప్రార్థన అని వరంకోరుకున్నాడు గరుత్మంతుడు.అప్పుడు నేను ఇలా ఆశీర్వదించాను. ఓ పక్షిరాజా! నీవడిగిన వరం నీకు సంపూర్ణంగా లభిస్తుంది. నాగదాస్యం నుండి నీ తల్లి వినతకు విముక్తి లభిస్తుంది. దేవతల నందరినీ ఓడించి అమృతాన్ని అవలీలగా సాధించి , నా వాహనానివి కాగలవు. అన్ని రకాల విషాలనూ విరిచి వేసే శక్తి కూడా నీకుంటుంది. నా గురించి నీవు ప్రవచించే పురాణ సంహిత నీ పేరిటనే 'గరుడ పురాణ' మను పేరుతో లోకంలో ప్రసిద్ధమవుతుంది.


🌺ఓయి వినతాసుతా! దేవగణాలలో ఐశ్వర్యానికి శ్రీరూపానికి నాకున్న విఖ్యాతియే పురాణాలలో నీ యీ గరుడపురాణాని కుంటుంది. విశ్వంలో నా సంకీర్తనజరిగేప్రతి చోటా నీ కీర్తన కూడా జరుగుతుంది. ఇక నీవు నన్ను ధ్యానించిన పురాణ ప్రణయనాన్ని గావించు! ఇంతవఱకూ చెప్పి మహావిష్ణువు ఇంకా ఇలా అన్నాడు. పరమశివా! నా ద్వారా గ్రహించిన గరుడ పురాణాన్ని గరుడుడు కశ్యప మహర్షికి వినిపించాడు.


🌺 కశ్యపడీ పురాణాన్ని వినడం వల్ల,అబ్బిన గారుడీవిద్యా బలం వల్ల ఒక కాలిపోయిన చెట్టునుతిరిగి బ్రతికించ గలిగారు, గరుడుడు కూడా ఈ విద్య ద్వారా అనేక ప్రాణులను పునర్జీవితు లను చేశాడు.యక్షి ఓం తం స్వాహా అనే మంత్రాన్ని జపిస్తే గారుడి పరావిద్యను పొందే యోగ్యత లభిస్తుంది. రుద్రదేవా! నా స్వరూపంచే పరిపూర్ణమైన, గరుడుని జ్ఞానముఖంగలిగాడు.గరుడుని జ్ఞానముఖం ద్వారా వెలువడిన గరుడ మహాపురాణాన్ని మీరూ వినండి.


🌺శౌనక మునీంద్రా! సాక్షాత్తు మహావిష్ణువు నుండి శివ, బ్రహ్మ దేవాది దేవులు, బ్రహ్మ ద్వారా మా గురువుగారు వ్యాసమహర్షి, ఆయన అవ్యాజానుగ్రహం వల్ల నేను వినగలిగిన గరుడ పురాణాన్ని నా భాగ్యంగా భావించి ఈ పవిత్ర నైమిషారణ్యంలో మీకు వినిపిస్తున్నాను.


🌺ఇందులోని వివిధ అంశాలేవనగా స్వర్గ వర్ణనం, దేవార్చనం, తీర్థమాహాత్మ్యం, భువన వృత్తాంతము, మన్వంతరం, వర్ణ ధర్మాలు, ఆశ్రమధర్మాలు, దానధర్మం, రాజధర్మం, వ్యవహారము, వంశానుచరితము, వ్రతం, నిదానపూర్వక అష్టాంగ ఆయుర్వేదం, ప్రళయం, ధర్మం, కర్మం, కామం, అర్ధము, ఉత్తమజ్ఞానం, ముఖ్యంగా విష్ణుభగవానుని మాయామయ, సహజలీలల విస్తార వర్ణనం.


🌺వాసుదేవుని కరుణచే గరుత్మంతుడు ఈ గరుడ మహాపురాణోపదేష్టగా అత్యంత సామర్ధ్యాన్ని చూపించాడు. విష్ణు వాహనంగా ఈ సృష్టి, స్థితి, ప్రళయకార్యాలలో కూడా పాలుపంచుకొంటున్నారు. దేవతలను జయించి, అమృతాన్ని తెచ్చి యిచ్చి తన తల్లి దాస్య విముక్తి కార్యాన్ని కూడా సఫలం చేసుకోగలిగాడు.


🌺విష్ణు భగవానుని ఉదరంలోనే అన్ని భువనాలూ ఉంటాయి. అయినా ఆయనకు ఆకలి వేస్తే గరుడుడే దానిని తీర్చాలి, హరి శివాదులకూ, హరిరూపుడైన గరుడుడు కశ్యపమహర్షీకీ చెప్పిన ఈ పవిత్రపురాణం తనను ఆదరంగా చదివే వారికి అన్నిటినీ ప్రసాదించగలదు. వ్యాసదేవునికి మరొక్కమారు నమస్కరించి పురాణాన్ని ప్రారంభిస్తున్నాను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat