గరుడ పురాణము 🌺నాలుగవ అధ్యాయం -ప్రధమ భాగం - సృష్టి వర్ణనం

P Madhav Kumar

 *దేవ, అసుర, మనుష్య సహితమైన ఈ సంపూర్ణ జగత్త

సృష్టి వర్ణనం

పరమేశ్వరుడు తో శ్రీహరి ఇలా అన్నాడు ఓ పరమేశ్వరా! సర్గాదులతో బాటు సర్వపాపాలనూ నశింపజేయు సృష్టి, స్థితి, ప్రళయ స్వరూపమైన విష్ణు భగవానుని సనాతన క్రీడను వర్ణిస్తాను, వినండి.


🌺నారాయణ రూపంలో ఉపాసింపబడుతున్న ఆ వాసుదేవుడే ప్రకాశస్వరూపుడైన పరమాత్మ, పరబ్రహ్మ, దేవాధిదేవుడు. సృష్టి ,స్థితి,లయ లకు కర్త ఆయనే. ఈ జగత్తంతా ఆయన స్వరూపమే. ఆయనే కాలరూపుడు, పురుషుడు, బాలురు బొమ్మలతో క్రీడించినట్లాయన లోకంతో క్రీడిస్తాడు. ఆలీలలను వర్ణిస్తాను వినండి. అంటే ఇవన్నీ నా లీలలే. 


🌺జగత్తుని ధరించే పురుషోత్తమునికి ముందుగా అవ్యక్తమైనవి ఏర్పడగ వాటి నుండి ఆత్మ ఉత్పత్తి అవుతుంది. అవ్యక్త ప్రకృతి నుండి బుద్ధి, బుద్ధి నుండి మనస్సు, మనస్సు నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి తేజం, తజం నుండి జలం, జలం నుండి పృధ్వీ పుట్టాయి.


🌺పరమేశ్వరా! దీని తరువాత ఒక బంగారు గుడ్డు పుట్టింది. పరమాత్మ స్వయంగా అందులో ప్రవేశించి సర్వ ప్రథమంగా తానొక శరీరాన్ని ధరిస్తాడు. ఆయనే చతుర్ముఖ బ్రహ్మరూపాన్ని ధరించి రజోగుణ ప్రధానమైన ప్రవృత్తితో బయటికి వచ్చి ఈ చరాచర విశ్వాన్ని సృష్టిచేశాడు.


🌺దేవ, అసుర, మనుష్య సహితమైన ఈ సంపూర్ణ జగత్తు ఆ అందంలోనే వుంటుంది. ఆ పరమాత్మయే బ్రహ్మరూపంలో ప్రపంచాన్ని సృష్టిస్తాడు. విష్ణు రూపంలో దాని ఆలనా, పాలనా చూసుకుంటాడు, కల్పాంత కాలంలో రుద్ర రూపంలో దానిని సంపూర్ణంగా లయింపజేస్తాడు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat