*సృష్టి కర్మలో మునిగియున్న ప్రజాపతి బ్రహ్మనుండి తమోగుణం* 🌷
*సృష్టి వర్ణనం*
🌺 శంకరదేవా! ఇక దేవాదుల సృష్టి యొక్క వర్ణనను సంక్షిప్తంగా తెలియజేస్తాను.అన్నిటికన్న ముందు ఆ పరమాత్మనుండి మహత్తత్త్వం సృష్టించబడుతుంది.
🌺 రెండవ సర్గలో పంచతన్మాత్రలు అనగా రూప, రస, గంధ, స్పర్శ, శబ్దముల ఉత్పత్తి జరుగుతుంది. దీన్నే భూతసర్గ అంటారు. వీటి ద్వారానే పంచమహాభూతములైన నేల, నీరు, నిప్పు, గాలి, నింగి సృష్టింపబడతాయి.
🌺మూడవ సర్గలో కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రియాలూ ఈ దశలోనే పుడతాయి . దీనిని ఇంద్రిక సర్గయన్ని ,బుద్ధి దశ అంటారు. కాబట్టి దీన్ని ప్రాకృత సర్గయని కూడా అంటారు.
🌺 నాలుగవది ముఖ్య సర్గ పర్వతాలూ, వృక్షాలూ మానవ జీవనంలో ముఖ్య పాత్రను పోషించాలి. అవి సృష్టించబడే సర్గ కాబట్టి దీనికా పేరు వచ్చింది. అయిదవది తిర్యక్ సర్గ పశుపక్ష్యాదులు ఈ సర్గలో పుడతాయి. తరువాత ఆరవ సర్గలో దేవతలూ, ఏడవ సర్గలో మానవులూ సృష్టింపబడతారు. వీటిని క్రమముగా ఊర్ధ్వ ప్రోతా, అర్వాక్ ప్రోతా సర్గలంటారు.
🌺 దేవతల కడుపులో పడిన ఆహారం పైకీ, మానవులది క్రిందికీ చరిస్తాయి. ఏడవ సర్గ మానుష సర్గ. ఎనిమిదవది అనుగ్రహ నామకమైన సర్గ. ఇది సాత్విక తామసిక గుణ సంయుక్తం. ఈ యెనిమిది సర్గలలో అయిదు వైకృతాలనీ, మూడు ప్రాకృత సర్గలనీ చెప్పబడుతున్నాయి. అయితే, తొమ్మిదవ సర్గలో ప్రాకృత, వైకృత సృష్టి రెండూ చేయబడతాయి.
🌺 సృష్టి కర్మలో మునిగియున్న ప్రజాపతి బ్రహ్మనుండి తమోగుణం పుట్టుకొచ్చింది. కాబట్టి ఆయన జంఘల నుండి రాక్షసులు. పుట్టుకొచ్చారు. శంకరా! అప్పుడాయన తమోగుణ యుక్తమైన శరీరాన్ని విడచిపెట్టగా ఆ తమోగుణపు ముద్ద రాత్రిగా మారి నిలబడిపోయింది. యక్షులకీ రాక్షసులకీ అందుకే రాత్రి అంటే చాలా ప్రీతి.
🌺అలాగే పితృగణాలవారు ఏడుగురు అనగా బర్షిపద, అగ్నిష్వాత్త, క్రవ్యాద, ఆజ్యప, సుకాలిన, ఉపహూత, దీష్య నామకులు కూడ ఉద్భవించారు. వీరిలో మొదటి ముగ్గురూ అమూర్త రూపులు, చివరి నలుగురూ మూర్త రూపులు, అంటే కళ్ళకు కనిపిస్తారు.
🌺కమల గర్భుడైన బ్రహ్మ దక్షిణ అంగుష్ఠం (కుడి బోటనవ్రేలు) నుండి ఐశ్వర్య సంపన్నడుడైన దక్ష ప్రజాపతీ, ఎడమ బొటనవ్రేలి నుండి ఆయన భార్యా పుట్టారు. వీరికి శుభ లక్షణలైన ఎందరో కన్యలు పుట్టగా వారిని బ్రహ్మమానస పుత్రులకు దక్ష ప్రజాపతి సమర్పించాడు. సతీదేవియను పుత్రికను రుద్రునికిచ్చి పెండ్లి చేయగా వారికి పెద్ద సంఖ్యలో మహాపరాక్రమశాలురైన పుత్రులు పుట్టారు.