Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

*గరుడ పురాణము* 🌺 *నాలుగవ అధ్యాయం - తృతీయ భాగం*

P Madhav Kumar

 *బ్రహ్మ యొక్క రజోమయ శరీరం నుండి మానవులు పుట్టారు* 🌹

 *సృష్టి వర్ణనం* 


🌺తరువాత బ్రహ్మయొక్క సత్త్వగుణము వల్ల ఆయన ముఖంనుండి దేవతలుద్భవించారు. తరువాత ఆయన సత్యగుణ యుక్తమైన శరీరాన్ని కూడా విడనాడగా దానినుండి పగలు పుట్టింది. దేవతలకు పగలు ప్రీతి పాత్రం, బ్రహ్మయొక్క సాత్విక శరీరం నుండి పితృగణాలుద్భవించాయి. బ్రహ్మ ఆ సాత్విక శరీరాన్ని వదలిపోయినపుడు అది సంధ్యగా మారింది. ఈ సంధ్య పగటికి రాత్రికీ మధ్య వచ్చే సమయం.


🌺తదనంతరం బ్రహ్మ యొక్క రజోమయ శరీరం నుండి మానవులు పుట్టారు. ఆయన ఆ శరీరాన్ని పరిత్యజించిన జ్యోత్స్న అనగా ప్రభాత కాలంగా మారింది. అదే ఉదయ సంధ్య ఈ రకంగా జ్యోత్స్న, పగలు, సంధ్య, రాత్రి అనేవి బ్రహ్మ శరీర సంభూతాలు


🌺తరువాత బ్రహ్మ రజోగుణమయ శరీరం నుండి క్షుద్ర, క్రోధం జనించాయి, పిమ్మట బ్రహ్మ నుండియే ఆకలి దప్పులు అతిగా కలవారు మరియు రక్త మాంస సేవనులు నగు రాక్షసులు, యక్షులు పుట్టుకొచ్చారు. యక్ష శబ్దానికి అర్ధము తినుటయని , యక్షులు ధనదేవతలు ధనం కోసం వీరిని పూజిస్తారు.


🌺 ఈ పూజలో భక్షణ కూడా ఒక భాగం. ఈ భక్షణ వల్ల వీరిని యక్షు లంటారు. అటుపిమ్మట బ్రహ్మకేశాల నుండి సర్పాలు, క్రోధం నుండి భూతాలు పుట్టినవి. తరువాత బ్రహ్మలో కలిగిన క్రోధ గుణ వాసన పాములకు తగిలింది. అందుకే వాటికి క్రోధ మెక్కువ, తరువాత బ్రహ్మనుండి పాటపాడుతూ, నాట్యమాడుతూ గంధర్వులుగా పుట్టారు .తరువాత ప్రజాపతియైన బ్రహ్మవక్షస్థలం నుండి స్వర్గము పుట్టింది.


🌺ఆయన ముఖము నుండి అజము (మేక), ఉదరమునుండి గోవు, పార్శ్వాలనుండి ఏనుగు, గుఱ్ఱము, మహిషము, ఒంటె, తోడేలు జాతులు పుట్టినవి. ఆయన రోమాలనుండి ఫల, పుష్ప, ఔషధ జాతి వృక్షాలు తరువాత ఏడు రకాల జంతువులు ఉద్భవించాయి.అవి క్రమంగా పులివంటి మృగాలు (ఇది ఒకదశ), రెండు గోళ్ళ (గిట్టలు), జంతువులు, నీటిక్షీరదాలు, కోతి జాతి, పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు,బ్రహ్మయొక్క పూర్వాది నాల్గు ముఖాల నుండి క్రమంగా వేదాలు జనించాయి.


🌺ఆయన కంఠం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, ఊరువులు నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులూ ఉత్పన్నులైనారు. వెంటనే బ్రహ్మవారిలో ఉత్తములైన బ్రాహ్మణులకు బ్రహ్మలోకాన్నీ, క్షత్రియులకు ఇంద్రలోకాన్ని, వైశ్యులకు వాయులోకాన్నీ శూద్రులకు గంధర్వలోకాన్నీ నివాసాలుగా నిర్ధారణ చేశాడు.


🌺 ఆయనే బ్రహ్మచారులకు బ్రహ్మలోకాన్ని , స్వధర్మనిరతులై గృహస్థాశ్రమాన్ని నిర్వహించిన వారికి ప్రాజాపత్యలోకాన్ని, వానప్రస్థులకు సప్తర్షిలోకాన్ని సన్యాసులకూ పరమ తపో నిధులకూ ,అక్షయలోకాన్ని ప్రాప్త్యలోకాలుగా నిర్ధారణ చేశాడు.


🌺శంకరా! ప్రజాపతి బ్రహ్మ పరలోకంలో నివసించే మానస , ప్రజాసృష్టి తరువాత నరలోక సృష్టి విస్తారాన్ని గావించే మానసపుత్రులవైపు దృష్టి సారించాడు. ఆయన నుండియ యములు, రుద్రులు, మనువులు, సనకుడు, సనాతనుడు, భృగువు, సనత్కుమారుడు, రుచి, శ్రద్ధ, మరీచి, అత్రి,అంగిరుడు, పులస్త్ముడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు, నారదుడు జనించారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Type text to search
📢 Follow