బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానె నీ పాదము ||

P Madhav Kumar

 బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానె నీ పాదము ||


చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలి తల మోపిన పాదము తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము ||


కామిని పాపము కడిగిన పాదము పాముతల నిడిన పాదము ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము పామిడి తురగపు పాదము ||


పరమ యోగులకు పరి పరి విధముల పరమొసగెడి నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము ||🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat