కృష్ణుని అందాలు…🙏

P Madhav Kumar

 *కృష్ణుని అందాలు....

మధురాధిపతేరఖిలం మధురమ్!


“మనం మనసులో కృష్ణుడిని నిలుపు కుంటే కృష్ణుడి మనసులో మనం నిలిచి ఉంటాము.


కృష్ణుడి కోసం పరితపిస్తే, కన్నయ్య మనవెంటే ఉంటాడు!“


కృష్ణ లీలలు విన్నా, కృష్ణ భజనలు చేస్తున్నా , చిన్ని కృష్ణుని లీలలు తలచినా, కృష్ణఅష్టమి నాడు  చిన్ని కృష్ణుని వేషంలో బాలలు కనిపించినా కలుగే మధురానుభూతులు , మన జన్మను తరింపజేసే అద్భుతమైన దివ్యానుభవాలు !


కృష్ణుడు దేవుడు కదా, మరి ఈ నల్లని రంగు పులుముకొని ఎందుకు అవతరించినట్టు.?


సకల దేవతలు ప్రకాశంతో తెల్లగా మెరిసిపోతుంటే మన కన్నయ్య, ఇలా నల్లనయ్య గా ఎందుకు   దర్శింప జేస్తున్నాడు.?


కృష్ణుడు అంటేనే మాయా స్వరూపం, అంతా విష్ణుమాయ. ! అతడి నీలం రంగు ఒక మాయ.! అసలు రూప దర్శనం లభించాలంటే ఈ మాయ తొలగాలి. కృష్ణావతారం సందర్భంలో  ఎన్ని అద్భుతాలు బాహాటంగా అందరికీ దర్షింప జేసినా కూడా, కృష్ణుణ్ణి సాధారణ గొల్ల పిల్లవాడిగానే తలచారు.. అదే కృష్ణ మాయ ! 


దేవుడని నమ్మినవారు,తెలిసినవారు భీష్ముడు  ఆక్రూరుడు లాంటి నిజమైన జ్ఞానులు శ్రీకృష్ణ భక్తులు మాత్రమే !  


నిజానికి శ్రీకృష్ణుని… నీలమేఘశ్యామసుందర రూపమే కాదు  అతడి బాల్య లీలలు, క్రీడలు, చేష్టలు చరితల అంతరార్థం, పరమార్థం అర్థం జేసుకోవడం  సామాన్యులకు సాధ్యము కాదు ! 


శుక శౌనకాది మహమునులకు, నారదాది మహా భక్తశిఖామణులకు, అన్నమయ్య మీరాబాయి, జయదేవుని లాంటి కృష్ణభక్తాగ్రేసరులకు కూడా శ్రీకృష్ణుని వర్ణించడానికి, ఊహించడానికి కూడా తరము కాలేదు ! 


బాలకృష్ణుని ముగ్దమోహన స్వరూపాన్ని చూడాలన్న కుతూహలంతో, సాక్షాత్తు పరమశివుడు ఉమా సమేతుడై, రేపల్లెలోని నందగృహం ముందు పడిగాపులుపడుతూ, చివరకు యశోదాదేవి చంకలో ఒడిగిపోతూ, ఏమీ ఎరుగని పసిబాలుని వలె నటిస్తూ, జంగమదేవర వేషంలో ఉన్న హరుని చూస్తూ, బెదిరినట్లు కన్నులు త్రిప్పుతూ, తల్లికొంగు చాటున నుండి దొంగచూపులు చూస్తూ, ఉండే నల్లనయ్య అందచందాలను  ఎంత చూసినా శివయ్యకు తనివితీరడం లేదు.!


ఆ నల్లనయ్య అందాలు అంత మోహనం గా ఆకర్షిస్తూ ఉంటాయి." ఏమి అందమది..!    ఆ నల్లని  నీలమేఘశ్యామవర్ణంలో ఎన్ని కాంతులో.! ఎన్ని సొగసులో! ఎన్ని వర్ణాలో! కలువలవంటి ఆ పెద్ద పెద్ద కన్నుల్లో ఎంత చల్లదనం.! ఎంత వైభవం.!. ఏమా మోహనాకారం.!  చిన్ని కృష్ణునిపై నుండి తన చూపులు త్రిప్పుకోలేకుండా పోతున్నాడు భవానీ శంకరులు. !


ఎంతచూసినా తనివితీరని ఆ నల్లనయ్య అందచందాలు  శివయ్యనే కాదు.,, రేపల్లెలోని   ఆబాల గోపాలం వశీకరణమంత్రం వేసినట్టుగా మంత్రముగ్దు లౌతున్నారు..! 


మహావిష్ణువు  ధరించిన  అవతారాలు శుక్ల పాడ్యమి నుండి పౌర్ణమి వరకు  చంద్రుని లో కనిపించే చంద్రకళలు వంటివి అయితే…, శ్రీకృష్ణ అవతారం మాత్రం  సంపూర్ణ చంద్రుని స్వరూపం.!. షోడషకళా పరిపూర్ణుడు శ్రీకృష్ణుడు.!


“పుంసాం మోహన రూపాయ !" అనినట్లుగా పురుషులకు కూడా మోహాన్ని కలిగించే దివ్యమంగళ ముగ్దమోహన విగ్రహము, అసలు గోపికలకు కూడా అంతుచిక్కని అందచందాలు నల్లనయ్యవి.!


చిన్నికృష్ణుడు మధురకు వెళ్ళేవరకు

వారంతా కృష్ణుని తో కలిసి తిరిగినా  రోజుకొక భంగిమల్లో కృష్ణవైభవాన్ని "ఇది" అంటూ "ఇలా"ఉంటాడు అంటూ చెప్పలేని సోయగాలు  ఆ నల్లనయ్యవి !.. 


కృష్ణునితో కలిసితిరుగుతూ, బృందవనం లో  "నీవే నేనై, నేనే నీవై, నీకు నాకు బేధం అనేదే  లేకుండా,” యమునానదీ ఇసుకతెన్నెలపై, పున్నమి వెన్నెల కాంతుల్లో , తనివితీరని కౌతుకంతో, నల్లనివాని త్రిజగన్మోహన రూపాన్ని కన్నార్పకుండా ఇంతలేసి కన్నులతో  చూస్తూ…. కృష్ణయ్య మ్రోయించే  మురళీనాదంలో, భువనైక సమ్మోహన మధురానుభూతులతో ఆనందామృత పానం చేస్తూ, యశోదాదేవి లోగిళ్ళలో నందగోపుని లాలనలో   ముద్దుగారే యశోద ముంగిట ముత్యములా భాసిస్తూ, తన కృష్ణమాయా జాలంతో సమ్మోహనాకారం తో, అందరి మతులను చెదరగొడుతూ,  అమాయక పసిబాలునివలె తల్లి చెంగు పట్టుకొని తిరిగే "నల్లనయ్య"ను, గురించి లీలగా కూడా భావించ లేకపోయారు గోపికలు ..!


కాలచక్ర భ్రమణంలో రాత్రిపగళ్లు తెలియక తమ అస్తిత్వం మరిచి పోయి,  కృష్ణుణ్ణి ఎప్పుడూ  చూస్తూ కూడా, అతడి రూపగుణ వైభవాలను గూర్చి ఏమాత్రం కూడా చెప్పలేకపోయారు గోపికలు.  !


కృష్ణుని కళ్ళు మాత్రమే ఒక గోపిక చూడగలిగితే.. మరొక గోపిక విశాలమైన ఫాలభాగంలో, ధగధగా మెరిసే కస్తూరీ తిలకాన్ని మాత్రమే చూస్తుంటే., తళతళ మెరిసిపోయే కన్నయ్య  కపోలాలపై నుండి తన దృష్టిని తిప్పుకోలేని స్థితిలో ఇంకో గోపిక..! 

మోహనవంశీ నాదం తో తన్మయత్వం చెందే మరో గోపిక ,

ఎర్రని లేత పెదాల పై చిందే చిరునవ్వు చూస్తూ మరొకరు!. 

శంఖం లా ప్రకాశించే కంఠాన్ని చూస్తూ ఒకరు.! 

విశాల వక్షస్థలాన్ని,  తళుక్కుమంటూ మెరిసే  చెవులస్వర్ణ కుండలాలను చూస్తూ ఒకరు...!

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat