మీకు తెలుసా …!!🌸 అలిపిరి నడక మార్గాన ఉండే ఈ గుండుకు మోకాళ్లు ఆనిస్తే చాలు మోకాళ్ళనొప్పులు హంఫట్..*

P Madhav Kumar

🌸అలిపిరి పాదాల మండపం దాటగానే 100 మీటర్ల తర్వాత కుడివైపున ఒక పెద్ద గుండు కనిపిస్తుంది. దానిపై అంజలి ఘటిస్తూ ఆంజనేయస్వామి మిగతా భాగం అంతా గుంతలతో వింతగా ఉంటుంది. అదే తలఏరు గుండు.*


🌸చూడటానికి వింతగా ఉన్న దీని అంతరార్థం మాత్రం చాలా విచిత్రమైనది.. ఈ గుండుకు మోకాళ్ళను ఆనించి, ఆంజనేయ స్వామి వారికి నమస్కరించి తిరుమలకు నడిచి వెళ్తే కాళ్ల నొప్పులు ఉండవని భక్తుల నమ్మకం*. దానికి ఆనవాళ్లుగా ఉన్నవే ఈ గుంతలు.


🌸 శ్రీకృష్ణదేవరాయలు సైతం ఈ తలయేరు గుండు వద్ద తలవాల్చి కొంతసేపు సేదతీరి వెళ్లారని చరిత్ర చెబుతోంది. పూర్వం అలిపిరి మార్గంలో మెట్లు నిర్మించక ముందు ఈ ప్రాంతంలో ఒక సెలయేరు, దాని పక్కనే ఒక గుండు కూడా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. 


🌸అయితే అలిపిరి మెట్ల మార్గాన్ని నిర్మించే క్రమంలో తలయేరు గుండు కొట్టి పక్కకు జరపడం వల్ల తలయేరు మార్గాన్ని మార్చినట్టు తెలుస్తుంది, అయితే నేటికీ భక్తులు ఈ గుండు వద్ద మోకాళ్లు ఆనించి, తలవాల్చి ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించి తిరుమలకు ప్రయాణం సాగిస్తుంటారు...


🌸మీరు కూడా ఈసారి అలిపిరి నడక మార్గాన తిరుమల వెళితే తలయేరు గుండును దర్శించండి.

🚩జై శ్రీరామ్🚩

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat