శ్రీ మహాలక్ష్మీ దేవి క్షీర సాగరము నుండి ఆవిర్భవించినది. చంద్రుడు కూడా శ్రీ మహాలక్ష్మీ దేవితో పాటు క్షీర సాగరము నుండి ఆవిర్భవించాడు. చంద్రుడు శ్రీ మహాలక్ష్మీ దేవికి సోదరుడు. పౌర్ణమి ముందు చంద్రుడు సంపూర్ణమైన కాంతితో పూర్ణ చంద్రుడిలా ప్రకాశిస్తుంటాడు. ఆ పూర్ణ చంద్రుని చూచి శ్రీ మహాలక్ష్మీ దేవి ఆ సమయమున ఎంతో సంతోషముగా ఉంటుంది . శ్రీ మహాలక్ష్మీ దేవి సంతోషముగా ఉండటానికి మరో ముఖ్య కారణం. శ్రావణ మాసం శ్రవణా నక్షత్రయుక్త మాసము. ఇది తన భర్త అయిన శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం. సాధారణంగా పౌర్ణమి శ్రవణా నక్షత్రం ఈ శ్రావణ మాసంలో ఇంచుమించుగా కలిసే వస్తాయి. అందువలన శ్రీ మహాలక్ష్మీ దేవి మరింత ప్రసన్నంగా ఉంటుంది. అలా శ్రీ మహాలక్ష్మీ దేవి సంతోషముగా ఉన్న పున్నమి ముందు శ్రావణ శుక్రవారం రోజున, ముత్తయిదువులు ఈ వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తే, వారి సమస్త కోరికలు నేరవేరడమే కాకుండా, వారి సౌభాగ్యం నిండు నూరేళ్ళు సుఖ శాంతులతో వర్ధిల్లుతుందని మన పెద్దలు శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతమును చేసుకోవాలని చెప్పారు. ఆ రోజున ముత్తయిదువులకు వీలుకాని పక్షంలో మాత్రమే మూడవ శ్రావణ శుక్రవారం కూడా నోచుకోనవచ్చు.
*🚩 డైలీ విష్ 🚩*