అయ్యప్ప చాట్ చక్రాలు (8)

P Madhav Kumar

 

4. అనాహత చక్రం

అనాహత అనేది అస్పష్టమైన ధ్వనిని సూచిస్తుంది. అంటే, రెండు వస్తువులను గణించడం ద్వారా ఉత్పత్తి చేయని ధ్వని. స్థానం: ఇది గుండె ప్రాంతంలో ఉంది. గ్రంథి: థైమస్ గ్రంధి మూలకం: వాయు (గాలి)


ప్లెక్సస్: అనాహత చక్రం కార్డియాక్ ప్లెక్సస్‌కు అనుగుణంగా ఉంటుంది.


దోషం: వ్యాన వాయు


ప్రభావం: అనాహత చక్రాన్ని శక్తివంతం చేయడం వల్ల వ్యక్తి భౌతికంగా మాత్రమే కాకుండా మరింత దయగల మరియు కలుపుకొని జీవన విధానం వైపుకు తీసుకువెళుతుంది. ఇది భయాన్ని పోగొట్టడంలో కూడా సహాయపడుతుంది. ఈ చక్రం చురుకుగా ఉన్నప్పుడు, దయ మరియు కరుణను వెదజల్లుతుంది

అప్రయత్నంగా. అనాహత చక్రం రక్త ప్రసరణను నిర్వహించడానికి మరియు శరీరంలోని ఇతర వాయువులను సమతుల్యం చేయడానికి బాధ్యత వహించే వ్యానా వాయును ప్రభావితం చేస్తుంది


ఆలయాలు: అనాహత చక్రానికి శక్తినిచ్చే ఆలయాలు భయాన్ని అధిగమించడానికి మరియు కోరికలను నెరవేర్చడానికి శక్తివంతమైన కేంద్రాలు. అనేక భద్రకాళి మరియు దుర్గా దేవాలయాలు అనాహత చక్రాన్ని ప్రేరేపిస్తాయి, భయానికి కారణాన్ని తొలగిస్తాయి 


అనాహత చక్రం సాధారణంగా రెండు త్రిభుజాల కలయికగా ఆరు-బిందువుల నక్షత్రం గుర్తులా, కేంద్రంలో ఒక చుక్కతో ఉంటుంది. ఇది క్రింది మూడు చక్రాలు, పైన మూడుచక్రాలు ఒక విధంగా  విలీనమవ్వడానికి ప్రతీక. అంటే అనాహత ఒకదానిలోనే ఆరు లక్షణాలు ఉన్నట్లు అర్ధం. అనేక సంస్కృతులు వివిధ గుణాలను నిర్ధేశిస్తూ ఈ గుర్తుని ఉపయోగిస్తాయి, కానీ అది ముఖ్యంగా ఊర్ధ్వగమన త్రిభుజం  అధోముఖమైన త్రిభుజం కలయికతో వచ్చింది. ప్రతీజీవిలో ఎదుగుదల గురించి అవగాహన ఎలాగున్నా, మౌలికంగా ఏదోవిధంగా ఎదగాలని ప్రయత్నించడాన్ని, ఊర్ధ్వగమన త్రిభుజం సూచిస్తుంది. 


ఎదుగుదలకై సహజ ప్రేరణ


ఒక చిన్న క్రిమి చెట్టును ఎక్కాలని కోరుకోవచ్చు. ఒక పక్షి ఆకాశంలో ఎగరాలని కోరుకోవచ్చు. ఒక మనిషి ధనవంతుడుగా, కీర్తివంతుడుగా ఇంకా బలవంతుడుగా లేదా జ్ఞానిగా కావాలని కోరుకోవచ్చు. ఈ ప్రయత్నాలన్నీ ఎదగడానికే. ఇదంతా సృష్టి యొక్క సహజ లక్షణం – ప్రతీ జీవి తన పూర్తి సామర్ధ్యానికి చేరాలని ప్రయత్నించడం సహజం. కొందరు ఎరుకతో చేస్తారు, చాలామంది ఎరుక లేకుండానే చేస్తారు, ఏదేమైనా ప్రతివారు ఎదుగుదలకు ప్రయత్నం చేస్తారు.


ధనార్జనకై ఒకరు పెట్టే పరుగులు మంచిది కాదని మీరు అనుకోవచ్చు. కానీ అదికాదు, అతను కూడా తనకు దొరికిన సోపాన మార్గం ఆసరాతో ఎదగాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతానికి అతని సోపాన మార్గం ధనమే. మీ సోపాన మార్గం మీ శక్తిఅనో, అనుభవమనో, మరొకటనో మీరు అనుకోవచ్చు. మరొకరికి ఎదుగుదల అంటే వారి భావోద్వేగాలనుకోవచ్చు. ఒక్కొకరు ఒక్కో విధంగా భావించవచ్చు లేదా అనుసరించవచ్చు, కానీ ప్రతీజీవిలోను - అది మనిషిలోనైనా మరొకదానిలోనైనా ఎదుగుదలకై ప్రయత్నం ఉంటుంది. జీవ స్వభావం ఇంకా  సృష్టి స్వభావం ఇదే.


ఇలా ఎదగాలనే కాంక్షకు కారణం మీరు భూతలంపై ఒకచోట ఉండడం, అంటే ఒకే ప్రదేశంలో అతుక్కుపోయి ఉన్నట్లు కలిగే భావన. మీరు ఇక్కడ ఉంటే, అక్కడ ఉండలేరు. మీరు భూతలంపైనే ఒక చోట స్థిరపడ్డారు కనుక, ఇక్కడ ఉన్నదిశల్లో వెళ్ళడంకంటే పైకి వెళ్ళడం మెరుగు అనుకుంటారు. 


మూలం అంతటా వ్యాపించి ఉంది


మేము ప్రస్తావిస్తున్న, సర్వం లభించే మూలం, ఒకే ప్రదేశానికి పరిమితం కాదు. అది అన్నిచోట్లకూ చలిస్తూ అన్నిటిలోకి ప్రవహిస్తుంది. దానికి ఒక దిశ అని, ఒక ప్రాంతం అని ఉండదు. మీరు ఒకేచోట అతుక్కుని ఉంటే, మీకు వెళ్ళేందుకు ఒక దిశ ఉంటుంది. మీరు భూతలంపై ఒకచోటే అతుక్కుని లేకపోతే మీరు ప్రతీచోటా ఉన్నట్లే. ఎటువైపు వెళ్ళేది ఉండదు, అంటే అక్కడ (అంతటా) ఉన్నవాటినన్నిటిని గ్రహించగలరు.


ఈ సందర్భంలో యోగపదజాలం ఈ రెండు త్రిభుజాలని వాడింది. జీవి, పైదిశగా చలించడానికి ప్రయత్నిస్తోంది. మూలం క్రిందివైపుకి రావడం గాని పైవైపుకి పోవడం గాని చేయటంలేదు – అది అన్నిటిలోకి స్రవిస్తోంది. అంటే గాలిలాగ అన్నమాట. గాలి కేవలం ముక్కు రంధ్రాలలోకే కాదు చెవులలోకి, చర్మ రంధ్రాలలోకి, తెరిచి ఉంటే నోట్లోకి కూడా ప్రవేశిస్తుంది. ఆ విషయంలో దానికి ఎంపిక ఉండదు – ఎక్కడ చోటు ఉంటే అక్కడ ప్రవేశిస్తుంది.


అలాంటిదే - ఇది కేవలం ఒక పోలిక – ఏదైతై అన్నిటికీ మూలంగా మనం భావిస్తున్నామో అది సర్వత్రా వ్యాపించి ఉంటోంది. కానీ మీ దృష్టికోణం నుంచి చూస్తే, ప్రస్తుతం ఇక్కడ మీరు కూర్చుండగా, మంచిగాలి వాయు మార్గం ద్వారా క్రిందికి చేరుతోంటే, చెడుగాలి పైకిచేరి అదే మార్గంనుండి బయటకు వస్తోంది. “మనకి ఏది మంచిదో” అదే మంచిది అన్నది, మంచికి మనమిచ్చే నిర్వచనం. మన గ్రహవాసులే అయినా ఇతర జీవులు దానిని మంచి అని సమ్మతించక పోవచ్చు. ఇది సందర్భానుసారం అర్ధం చేసుకోవాలి. యదార్ధానికి గాలి మీ చర్మరంధ్రాల ద్వారా కూడా పోతుంటుంది, కానీ దాని వాయు మార్గమే ప్రధాన మూలం. మీరు శ్వాసను నిరాకరిస్తే, మీరు మరణిస్తారు, కనుక శ్వాస తప్పనిసరి అనేది మీకు తెలుసు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat