నరసింహా స్వామిని అష్ట ముఖ గండభేరుండ నరసింహా స్వామి అని ఎందుకు పిలుస్తారు..?

P Madhav Kumar

 


*నరసింహా స్వామిని అష్ట ముఖ గండభేరుండ నరసింహా స్వామి అని ఎందుకు పిలుస్తారు..??అసలు నరసింహా స్వామికి ఆ పేరు ఎలా వచ్చింది..??* 🌺


 *అష్ట ముఖ గండభేరుండ నరసింహ రూపం* 


🌹గండ భేరుండ నరసింహ రూపం - ఆధ్యాత్మిక, మంత్ర శాస్త్ర విశ్లేషణ.........!!


🌹ఇది అష్ట ముఖ గండభేరుండ నరసింహాకారం. దీనిని "గండభేరుంఢ పక్షి నృసింహ స్వామి" అని అంటారు.


🌹హిరణ్య కశ్యపుడితో, యుద్ధం చివరి దశలో ....ఆ దైవం చివరికి ఈ రూపాన్ని ప్రకటించాడు.


🌹మంత్ర రాజ పద మూల మంత్రంలో "సర్వతో ముఖం" అనే పదం ఉంది. 


🌹హిరణ్య కశ్యపుడు, నృసింహుని చూసినపుడు , అతనికి నృసింహుడు అనేక రూపాలతో కనిపించాడు. 


* సింహం 


* పులి 


* కోతి 


* ఎలుగుబంటి 


* అడవి పంది


* గరుడ 


* గుఱ్ఱం 


* మొసలి. 


🌹8 తలలు, 32 చేతుల అనుష్టుప్ మూల మంత్రం / మంత్ర రాజ పద మూల మంత్రం లోని 32 అక్షరాలను సూచిస్తాయి ఒక్కో అక్షరం/ఒక్కో బీజాక్షరం, 1,00,008 ఉపాక్షరాలను సూచిస్తుందో. 


🌹ఇక్కడ హిరణ్య కశ్యపుడు, దైవాన్ని తన హృదయంలోనూ, బాహ్యం లోనూ, చూడగలిగాడు గనుక (అంతర బహిశ్చ తత్సర్వ వ్యాప్య నారాయణ స్థితః....), రెండుతలల పక్షి రూపం , ఇందుకు సూచనగా కనిపిస్తుంది. అహం స్థితికి, నిజ స్థితికి ఇది ప్రతీక.


🌹ఈ రూపంలో ఉన్న దైవం "అఘోర మూర్తి". అద్భుతాన్ని మించే అందం, గహన గంభీరం, మానసాతీతం. 


🌹హిరణ్య కశ్యపుని చంపేటపుడు ఈ రూపంలో దైవం దర్శన మివ్వగానే, అతడు ఈ రూపం చూసి ఆత్మజ్ఞానం పొందాడట. అతను సరిగ్గా చనిపోయేముందు, గరుత్మంతుడు దయతో, హిరణ్య కశ్యపుడి చెవిలో, "నరసింహుడి చరమ శ్లోకం" చెప్పాడు. 


🌹అందుకే మనం, హిరణ్య కశ్యపుడి తల వద్ద "శ్వేత గరుడిని"చూడవచ్చు. ఈ "గండభేరుండ నరసింహ రూపం" , నృసింహుని యొక్క అరుదైన రూపం.


" *గండభేరుండ నృసింహం భావయామి* "

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat