🌸ఇంద్రాది దేవతలకు గర్వమెందుకువచ్చింది? గర్వం ఏ రకంగా భంగమైంది? తెలుసా ….
దేవదానవ సంగ్రామం అనాదిగా జరుగుతూనే ఉంది. ఆ యుద్ధంలో ముందుగా దేవతలు ఓడిపోతున్నారు.
🌿రాక్షసుల చేతిలో దేవసైన్యము నాశనమైపోతోంది. అందుకని రాక్షసుల సాయంతో క్షీరసాగర మధనం చేశారు దేవతలు. ఉచ్ఛైశ్వరము, ఐరావతము, కామధేనువు, కల్పవృక్షము చివరకు అమృతము పుట్టినాయి.
🌸శ్రీహరి మోహినీ రూపం ధరించి అమృతాన్ని దేవతలకు పంచాడు. ఈ రకంగా దేవతలు మరణాన్ని జయించారు.ఒకసారి దేవదానవ సంగ్రామం జరిగింది. అందులో దేవతలే విజయం సాధించారు.
🌿ఈ విజయం తమ వల్లనే వచ్చింది అని దేవతలలో ప్రతి వారు చెప్పుకోసాగారు. వారికి అహంకారం ప్రబలిపోయింది. దేవతలకు గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు పరమేశ్వర స్వరూపుడయిన పరబ్రహ్మ.
🌸అనుకున్నదే తడవుగా ఒక పెద్ద భూతం దేవతల ముందు ప్రత్యక్షమయ్యింది. దేవతలు ఆ భూతాన్ని చూసి భయపడ్డారు. అది ఏమిటో అర్థం కాలేదు వారికి దేవదానవ యుద్ధంలో దానవులను తన అగ్నికీలలకు ఆహుతి చేశాను అని చెప్పిన అగ్నిదేవుని దగ్గరకు పోయి 'అగ్నిదేవా! ఆ భూతం ఏమిటో తెలుసుకుని రా అన్నారు.
🌿సరేనంటూ బయలుదేరాడు అగ్నిదేవుడు. ఆ భూతం దగ్గరకు వెళ్ళాడు అప్పుడు భూతం అడిగింది.
నువ్వెవరు? అని. నేను అగ్ని దేవుడను. నన్ను జాతవేదుడు అంటారు
నీ శక్తి ఏమిటి?ఎంతటి వస్తువునైనా తృటిలో భస్మం చెయ్యలను" అని అన్నాడు అగ్నిదేవుడు.
🌸ఐతే ఈ గడ్డిపోచను భస్మం చెయ్యి" అంటూ ప్రక్కన ఉన్న గడ్డిపోచను అక్కడ పెట్టింది భూతం. అగ్నిదేవుడు నిప్పుల వాన కురిపించాడు. పెద్ద పెద్ద మంటలు రేపాడు. గడ్డి పోచ కసికందలేదు. చేసేదిలేక అవమాన భారంతో వెనుదిరిగాడు అగ్నిదేవుడు.
🌿ఈసారి దేవతలు వాయుదేవుడి వద్దకు వెళ్ళారు. దేవ దానవ యుద్ధంలో తమ గాలులు వీస్తుంటే దానవులు ఎగిరిపోయారు అని చెప్పాడు వాయువు. అందుచేత దేవతలు వాయువును సమీపించి వాయుదేవా! నువ్వు ఆ భూతం ఏమిటో తెలుసుకుని రా అన్నారు.
🌸బయలుదేరాడు వాయుదేవుడు. భూతాన్ని సమీపించాడు.
నువ్వెవరివి అడిగింది భూతం,
నేను వాయుదేవుడను. ఆకాశంలో సంచరిస్తుంటాను. నన్ను మాతరిక్యుడు అంటారు.సే శక్తి ఏమిటి? అని అడిగింది.
🌿ఎంతటి వస్తువునైనా సరే తృటిలో ఎగరగొట్టి వేయగలను?
ఐతే ఈ గడ్డిపోచను ఎగరగొట్టు' అని ఇందాకటి గడ్డి పరకనే చూపింది భూతం.వాయుదేవుడు చండప్రచండమైన గాలులు వీచాడు. గడ్డిపోచ కదలలేదు. సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయాడు వాయువు..
🌸దేవతలు ఇంద్రుని దగ్గరకు వెళ్ళారు. ఆ భూతం ఏమిటో కనుక్కోమన్నారు. ఇంద్రుడు.భూతాన్ని సమీపించాడు.
నువ్వెవరు! అడిగింది భూతం.
నేను ఇంద్రుడను దేవతలకు రాజును
నీ శక్తి ఏమిటి?నిన్న జరిగిన యుద్ధంలో రాక్షస నాశనం చేశాను?
🌿అలా అయితే ఈ గడ్డిపోచను కదుపు అంటూ అక్కడ ఉన్న గడ్డిపరకను చూపించింది.
ఉపమని ఊదాడు ఇంద్రుడు. గడ్డిపరక కదల్లేదు. గట్టిగా ఊదాడు. లాభం లేకపోయింది. తలెత్తి చూశాడు. అక్కడ భూతం లేదు. ఆ క్షణంలో అశరీరవాణి వినిపించింది.
🌸ఇంద్రాది దేవతలారా ఇప్పటి వరకూ మీరు రాక్షసులను. మీ స్వశక్తితో జయించాము అనుకుంటున్నారు. అది అబద్దం. మీ విజయానికి కారణం పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మమే ఇప్పటిదాకా మీ ముందు నిలబడి ఉన్నది.
🌿దాన్ని మీరు గుర్తించలేకపోయారు. మీ గర్వం అణచటానికే పరబ్రహ్మ అలా చేశాడు. ఇకనైనా అహంకరించకుండా బుద్ధిగా మెలగండి అని పలికింది.
ఆ మాటలు విన్న దేవతలు తమ అజ్ఞానానికి సిగ్గుపడ్డారు. ఈ విధంగా దేవతలకు గర్వభంగం జరిగింది....🙏