దశరథరామా గోవిందా - శ్రీరామదాసు కీర్తన

P Madhav Kumar


దశరథరామా గోవిందా మము

దయజూడు పాహిముకుందా                               // పల్లవి //


దశముఖ సంహార ధరణిజపతిరామ

శశిధరపూజిత శంఖుచక్రధర                              // దశరథ //


మీపాదములే గతిమాకు

మమ్మేలుకో స్వామి పరాకు

మాపాలగల్గిన శ్రీపతి యీప్రొద్దు

కాపాడి రక్షించు కనకాంబరధర                     // దశరథ //


నారాయణ వాసుదేవ నిన్ను

నమ్మితి మహానుభావా

గరుడగమన హరి గజరాజ రక్షక

పరమపురుష భక్త పాప సంహరణ              // దశరథ //


ధరణి తారకనామమంత్రము

రామదాసులకెల్ల స్వతంత్రము

ఇరవుగ కృపనేలు మెపుడు భద్రాద్రిని

స్థిరముగ నెలకొన్న సీతా మనోహర         // దశరథ //🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat