శ్రీ సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైన రోజు ఆడి కృత్తిక..

P Madhav Kumar

🌿🌼🙏తమిళులకు ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజుని ఆడి కృత్తిక అంటారు ... ఇది సుబ్రహ్మణ్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు.ఈ రోజున సుర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచియైన తరువాత చలిమిడితో ( చలిమిడి అంటే బియ్యప్పు పిండిని బెల్లంతో కలిపి ముద్దగా చేయాలి ) ఆవు నేతితో మూడు వత్తుల దీపం శివ కుటుంబం ( శివుడు, పార్వతీ దేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు ) చిత్రపటం ముందు గానీ, శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి చిత్రపటం ముందు గానీ వెలిగించాలి 🙏🌼🌿


🌿🌼🙏ఆషాఢ  (ఆడి)కృతిక ... సుబ్రహ్మణ్యం స్వామి కావడి ఉత్సవం🙏🌼🌿


🌿🌼🙏ఆడికిర్తిక ... ఈ ఆషాడ కృతిక సుబ్రహ్మణ్యం స్వామికి చాలా విశేషం .. కావడి ఉత్సవాలతో  తమిళనాడు లోని పళనిలో, తిరుత్తణిలో భక్తులు పోటెత్తి పోతారు. మురగనుకు హోరోహర వేలునుకు హరో హరో వెల్ వెల్ మురుగు శక్తివేల్ మురగా అంటూ భజనలతో ఆటపాటలతో ఎంతో వైభవంగా ఈ కావడి ఉత్సవాలు ఈ ఆషాడ మాసంలో జరుపుకుంటారు🙏🌼🌿


🌿🌼🙏రేపు ఆషాడ కృతిక మరింత ఉత్సాహంతో పండగ జరుపుకుంటారు.. కావడి ఎత్తుతాము అని ఏదైనా మొక్కు ఉన్న వారికి తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది అని భక్తుల నమ్మకం..🙏🌼🌿


🌿🌼🙏మొక్కు ఉంటేనే కాదు భక్తితో కావడి ఉత్సవం చేసుకునే వారు చాలా మంది ఉంటారు. ఈ కావడి తీసుకుని సుబ్రహ్మణ్యం స్వామి కొండకు వెళ్లే వారికి వివాహ దోషాలు, తరచూ వచ్చే ఆరోగ్యం సమస్యలు, పిల్లలు పుట్టక ఇబ్బంది పడే వారు, తరచూ ఎదో ఒక ఆటంకాలు తో వ్యాపారం లో ఇబ్బందులు ఉన్న వారు ఈ కావడి ఎత్తి దర్శనం కి వెళ్లడం వల్ల వారి సమస్యలు తొలగి సంతోషం గా ఉన్న కుటుంబాలు ఎందరో ఉన్నారు.🙏🌼🌿


🌿🌼🙏ఆడి కృత్తిక ఎలా జరుపుకోవాలి..🙏🌼🌿


🌿🌼🙏ఆడి కృతిక సుబ్రహ్మణ్యం స్వామి పండగ ఆ రోజు కావడి తీసే వారు తీస్తారు అలా కావడి ఉత్సవం చేయలేని వారు. ఉదయం తల స్నానం చేసి సుబ్రహ్మణ్యం స్వామి ఫోటో అలంకరణ చేసి, బియ్యం పిండితో దీపాలు వెలిగించాలి పానకం తో పాటు యధాశక్తిన నైవేద్యం సమర్పించి స్వామికి స్త్రోత్రం అష్టోత్తర పారాయణ చేసి స్కంద షష్ఠి కవచం   పారాయణ చెయ్యవచ్చు. కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి ..అవకాశం ఉన్నవారు ఎవరికైనా ఇంట్లో భోజనం పెడితే మంచిది. 🙏🌼🌿


   🌿🌼🙏కావడి ఎత్తడం ఎలా 🙏🌼🌿


🌿🌼🙏ఇందులో పాల కావడి పళ్ళ కావడి అని ఉంటుంది ముందుగా కావడి కి కావాల్సిన కర్రలు, (తెల్లజిల్లేడు కర్ర, నేరేడు కర్ర, పాల కర్ర ) ఇలా రకరకాలుగా కర్రలు కంటలు కట్టి అమ్ముతుంటారు ఏదైనా కర్ర తీసుకోవాలి కావడి కట్టే బట్టలు ఒక పక్క బుట్టలో స్వామి గుడిలో ఇవ్వాల్సిన పూజ సామానులు నింపుతారు ఇంకో వైపు మూడు రకాల పండ్లు నింపుతారు , పసుపు రంగు వస్త్రాలు ధరిస్తారు, ఇంట్లో పిండి దీపాలు పెట్టి సుబ్రహ్మణ్యం స్వామి కి పూజ చేశాక కావడి అందంగా అలంకారం చేసి పూజ చేస్తారు ఇంట్లో భోజనాలు పెట్టుకుని కావడి భుజాన పెట్టుకుని హరో హర అని భజనలు చేస్తూ తిరుత్తణికి గాని పళణికి గాని వెళ్లి కావడి సమర్పించి వస్తారు. ఈ కావడి కోసం తెచ్చిన కర్ర బట్టలు ముందుగానే నీటితో శుభ్రం చేసి ఆరబెట్టుకోవాలి ... ఇందులో మాల వేయడం ఉండదు..🙏🌼🌿


🌿🌼🙏ఆడి కృత్తిక రోజున చిమ్మిలి ( తెల్ల నువ్వులు బెల్లం కలిపి చేస్తారు ), పచ్చి పాలు, వడపప్పు ( నానబెట్టిన పెసరప్పు ), అరటి పండ్లు, తాంబూలం ఇవన్నీ నివేదించి, సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు, సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం చదువుకుని, సాయంత్రం వరకూ ఉపవసించి, సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ప్రసాదముగా పిండి దీపము, చిమ్మిలి, వడపప్పు, అరటి పండ్లు స్వీకరించాలి. 🙏🌼🌿


🌿🌼🙏ముందు రోజు రాత్రి మరియూ ఆ రోజు రాత్రి కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామి వారి విశేష అనుగ్రహం కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మందమతులు, జడులు, మతి స్థిమితం సరిగ్గా లేని పిల్లలకు ఈ పూజ అమృత తుల్యంగా పనిచేస్తుంది. అందరికీ జ్ఞానం కలుగుతుంది. సుబ్రహ్మణ్యుడు ఉత్తమమైన జ్ఞానం కలిగిస్తాడు. ఇది తమిళ నాట ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ. మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యం లేదు. 🙏🌼🌿


🌿🌼🙏తమిళనాడుకు సమీపంలో ఉన్న ఊర్లలో మాత్రమే జరుపుతుంటారు. మా పూర్వీకులు చిత్తూరులో ఉండేవారు కనుక మేము కూడా ఇది తరతరాలుగా ఆచరిస్తున్నాం ... 🙏🌼🌿


🌿🌼🙏అసలు ఎందుకు ఈ కృత్తికకు అంత ప్రత్యేకతో తెలుసుకుందాం🙏🌼🌿


🌿🌼🙏 తమిళులకు ఏ మాసమైన పౌర్ణమి రోజుతో మొదలవుతుంది, కనుక ఆషాడ పౌర్ణమి నుండీ వారికి ఆషాడ మాసం ప్రారంభమయ్యిందన్నమాట. అయితే ఈసారి మనకు అధిక శ్రావణమాస పౌర్ణమి నుండీ వారికి ఆషాడ మాసం ప్రారంభం. మనకు ఆషాడ మాసంలో బహుళ ఏకాదశి నుండీ దక్షిణాయనం ప్రారంభమవుతుంది, అదే తమిళులకు తొలి శుద్ధ ఏకాదశి అన్నమాట. అంతేకాదు దక్షిణాయనం ముఖ్యంగా పితృ దేవతల ఆరాధనకు ప్రీతికరమైనది. 🙏🌼🌿


🌿🌼🙏పార్వతీ దేవి సుబ్రహ్మణ్యుని మాతృకలైన కృత్తికలకు ఏ మాసంలోనైనా కృత్తికా నక్షత్రం రోజున ఎవరైతే  సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్యుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదించిందట. అందులోనూ దక్షిణాయనానికి ముందు వచ్చే కృత్తిక గనుక దీనిని ఆది కృత్తిక అనీ, ఆషాడ మాసంలో వచ్చేది కనుక ఆడి కృత్తిక అనీ కూడా అంటుంటారు. అందుకే ఆషాడ ఆడి కృత్తిక సుబ్రహ్మణ్యుని ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది. 🙏🌼🌿


🌿🌼🙏వీలైతే రేపు ఎవరైనా వేదవిధునికి కుదిరితే ( బాల బ్రహ్మచారి అయినా వేదవిధునికి ) షడ్రసోపేతమైన భోజనం పెట్టి, ఎర్రటి పంచ, పైపంచ, శక్తిమేరకు దక్షిణ, తాంబూలం, అరటి పండ్లు, గొడుగు, పాదరక్షలు, రాగి చెంబు( లేదా పంచపాత్ర ఉద్దరిణ, అర్ఘ్య పాత్ర ) సమర్పించి, తానే సుబ్రహ్మణ్యుని భావించి ఆశీర్వచనం తీసుకుంటే కలిగే ఫలితం మాటల్లో వర్ణించలేము ... 🙏🌼🌿


🌿🌼🙏ఒకవేళ బాల బ్రహ్మచారియైన వెధవిధుడు లేక గృహస్తు అయిన వెధవిధుడు లభించకపోతే మధ్యాహ్న సమయంలో ఎవరికైన ఆకలితో ఉన్నవారికి కడుపు నిండుగా ఆహరం పెట్టినా మంచిదే ... 🙏🌼🌿


🌿🌼🙏ఒకవేళ అటువంటి వ్యక్తి కూడా లభించకపోతే పశు పక్షాదులకు ఆహరం సమర్పించి సుబ్రహ్మణ్యుని ప్రార్ధించినా ఉత్తమ ఫలితం ఉంటుంది.🙏🌼🌿 


🙏🌼ఓమ్ శరవణభవ🌼🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat