అంబధాతు మాలికాయిల్ శ్రీ అయ్యప్ప దేవాలయం

P Madhav Kumar

 


ఈ దేవాలయంలో స్వయానా అయ్యప్ప స్వామి వారే అంబదాతు వంశీయులకు ముద్రవడి విభూతి సంచి ఇచ్చాడు ఆ చరిత్ర ఏంటో తెలుసుకుందాం

ఎర్నాకులం జిల్లాలోని ప్రకుళము కాలడి అంగమలి నుండి దాదాపు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మంజప్ర అనే పల్లెటూరు శబరిమల లో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి యొక్క చల్లని చూపుతో వర్ధిల్లుతున్నది అంబధాతు అనే పురాతనమైన పేరుగన్న కుటుంబం ప్రకుళము పల్లె చిన్న పల్లెలో నివసిస్తుంది ఆ కుటుంబం వారి దగ్గర స్వయంగా అయ్యప్పస్వామి దీవించి ఇచ్చిన ముద్రదండ (ముద్ర వడి) మరియు  విభూది ఉన్న ఒక సంచి కలవు ఈ ముద్ర దండ మరియు విభూది సుమారు 165 సంవత్సరాల క్రిందటివని అంబదాతు కుటుంబానికి చెందిన శ్రీ కేశవ పిళ్లై పెద్దమనిషి అయ్యప్ప స్వామికి భక్తుడు మకరజ్యోతి సమయంలో ఎరుమేలిలో 

పేటతుళ్ళి ఆడే అలంగాట్టుయోగము వారు పెద్ద

అలంగాట్టుయోగము వారు పందల యువరాజు (ఆర్య కేరళ వర్మకి) అయ్యప్ప స్వామివారికి అంగరక్షకులుగా ఉండేవాడు ఒకసారి అంబదాతు అల్లంగాట్టు యోగం తో కలిసి మలయాళం నెల ధను 19 న శబరిమలకు వెళ్లలేకపోయారు ఆయన తిరువనంతపురంలో పనిమీద ఆగిపోవాల్సి వచ్చింది మకర జ్యోతి ఒకరోజు ముందు అనగా ధను 29 వ రోజున తిరువనంతపురం నుండి వచ్చి శ్రీ కేశవ పిళ్లై ఒక్కరే ఇరుముడితో శ్రీ అయ్యప్ప స్వామి దర్శనం మకరవిళక్కు రోజున చేరుకునేకొరకు బయలుదేరాడు మార్గ మధ్యలో ఒక బ్రాహ్మణుడు కలిశారు శ్రీ కేశవపిళ్లై వారి తోడుకు చాలా ఆనందపడ్డాడు శరణ మంత్రం జపిస్తూ ప్రయాణం సాగించారు చీకటి పడడంతో దగ్గర్లో ఉన్న దేవాలయంలో దర్శనం చేయదలిచారు శ్రీ కేశవపిళ్లై గారికి ఒక రాయి విభూతి కలిగిన సంచి ముద్ర దండమును అప్పజెప్పి బ్రాహ్మణుడు దేవాలయంలోకి ప్రవేశించారు వారి కోసం ఎదురు చూస్తూ శ్రీ కేశవపిళ్లై నిద్ర పోయాడు ఎవరో ఒక వారిని లేపినప్పుడు ఆశ్చర్యకరంగా ఆయన శబరిమలై సన్నిధానంలో మరి కొందరితో పాటు చేతులు జోడించి మకరజ్యోతిని పూజిస్తున్నారు అప్పుడు ఆయనకు ఆ బ్రాహ్మణుడు మరి ఎవరో కాదు సాక్షాత్ అయ్యప్ప స్వామి అని అర్థమయింది ఈ ఆనందమైన సమయములొ పదునెట్టాంబడి ఎక్కి శబరిమలైలోని అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు దర్శనం తర్వాత ఆయన దగ్గర ఉన్న రాయి విభూది సంచి మరియు ముద్ర దండంతో ఏమి చేయవలెనని సంకోషంలో పడ్డాడు ఆ బ్రాహ్మణుడు  శ్రీ కేశవ పిళ్లై గారికి కనిపించి రాయిని అక్కును వద్ద స్థాపించమని విభూతి సంచిని ముద్ర దండమును వారి నివాస స్థలంలో స్థాపించమని చెప్పాడు ఎవరైతే ముద్ర దండమును విభూది దరిస్తారో వారికి శని దోషం ఉండదని శ్రీ కేశవపిళ్లై గారికి ఆదేశించారు ఎక్కడైతే ఆ రాయిని స్థాపించారో ఈనాడు అక్కడ పేరొందిన అక్కును శాస్త్ర దేవాలయం వెలసింది అంబదాతు భవనంలో మూడవ అంతస్తులో విభూది సంచి మరియు ముద్ర దండము స్థాపించబడ్డాయి శ్రీ కేశవపిళ్లై గారు నిర్మాణం పొంది భగవంతునిలో ఐక్యం అయ్యారు అని చెప్పుకుంటారు ఈనాటికి కూడా విభూది సంచి మరియు ముద్ర దండము భవనంలో పూజలు అందుకుంటూనే ఉన్నాయి

ఈ దైవ ప్రసాదాన్ని అంబధాతు కుటుంబీకులు ఇప్పటికీ భక్తితో జాగ్రత్తగా కాపాడుతూ వాటికి వెండి తొడుగు తొడిగి జాగ్రత్త పరుస్తున్నారు ప్రస్తుత

 అల్లంగాట్టు యోగంకి కుటుంబంకి పెద్దయిన ఈ విభూతి సంచి మరియు ముద్ర దంతమును మలయాళం నెలా అనగా ధను 18న పూజలు చేస్తారు శనిదోశం పోగొట్టడానికి అయ్యప్ప భక్తులు ఈ రోజున అంబదాతు భవనం చేరుకొని విభూతి సంచి మరియు ముద్ర దండమును దర్శించుకుంటారు అలంగట్టు యోగం యొక్క పెద్ద ఈ విభూతి సంచిని మరియు ముద్రదండమును శబరిమలైకి తీసుకొని వెళ్తారు ఒకానొక సందర్భంలో లో ఒక వ్యాపారవేత్త అయ్యప్పస్వామి పరమభక్తుడు వీటిని దొంగిలించి అతని ఇంట్లో పెట్టి పూజిస్తూ గొప్ప ధనవంతుడు అయ్యాడు కొన్నాళ్ళకు అన్నీ పోగొట్టుకుని తన దుస్థితికి ఈ దొంగతనం కారణం అని తెలుసుకుని వాటిని మరలా అంబధాతు భవనానికి అప్పచెప్పాడు అలంగాట్ యోగం కుటుంబం పెద్దకు అయ్యప్ప స్వామి వారు కనిపించి ముద్ర దండమును విభూది సంచిని బయటకు తీసుకొని వెళ్లవద్దని ధను 18 న పూజలు జరిపించిన చాలన్నారు అయ్యప్ప స్వామి వారు ఎప్పుడూ అక్కడే ఉంటారని ఎవరైతే ముద్ర దండము ధరిస్తారో వారికి అయ్యప్ప స్వామి యొక్క దీవెనలు లభిస్తాయని చెప్పారు  ముద్ర దండము యొక్క దర్శనం మలయాళం నెలా ప్రతి మొదటి శనివారం నాడు జరుగుతుంది.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat