*శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః*
నూరు దివ్య వర్షములు పార్వతీ దేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానమునుండి కదిలిపోయిన పరమపవిత్రమయిన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు.
సరిగ్గా తనకు రేతఃపతనం జరుగుతూన్న సమయంలో, బైటకు వచ్చేసినందున, అంతా సక్రమంగా జరిగే అవకాశం లేకపోయిందనీ; ఇక దేవతలకోరికలు సత్వరమే తీరాలంటే, తన రేతాన్ని వారే స్వీకరించాల్సి వుంటుందనీ తెలిపాడు పరమేశ్వరుడు.
ఇప్పుడు వాళ్ళు ‘భూమి భరిస్తుంది’ అని చెప్పారు.
శివతేజస్సును గ్రహించదానికి భూమి అంగీకరించింది.
అపుడు శివుని తేజస్సు భూమి మీద పడింది.
అది సామాన్యమయినది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను, అరణ్యములను అన్నింటిని ఆక్రమించేసింది.
అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు.
అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేడు.దేవతలందరి తొందరింపువల్ల, పావురం రూపంలో అగ్నిదేవుడు శివరేతాన్ని స్వీకరించేశాడు తప్ప, అది పార్వతీదేవి ఆగ్రహకారణ మవుతుందనీ - శాపంగా పరిణమిస్తుందనీ అగ్ని తెలుసుకోలేకపోయాడు.
పార్వతి జరిగిన దాంతా చూశాక, దేవతలందరూ స్వార్ధ ప్రయోజనం కోసమే శివారాధన చేశారనీ; అందువల్ల నాశనమైనది తన సుఖమేననీ అర్ధమైంది. వారివల్లనే తాను సంతానవతి అయ్యే అవకాశాన్ని కొద్దిలో కోల్పోయిందని బాధపడి్ పోయిన పార్వతీదేవి,
అపత్యం స్వేషు దారేషు న ఉత్పదయితుం అర్హథ |
అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నయః ||
ఏవం ఉక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీం అపి |
అవనే న ఏక రూపా త్వం బహు భార్యా భవిష్యసి ||
న చ పుత్ర కృతాం ప్రీతిం మత్ క్రోధ కలుషీకృతా |
ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రం అనిచ్ఛతీ ||
తన ఉసురు కొట్టిన పాపానికి దేవతలందరికీ కూడా వారి వారి భార్యల యందు సంతానం కలుగకూడదని శాపం ఇచ్చింది.
ఇచ్చా పూర్వకంగా అగ్ని శివరేతాన్ని పుచ్చుకున్నందున, అతడ్ని సర్వభక్షకుడిగా నిత్యం కష్టాలపాలయ్యేలా శపించింది.
అగ్నిదేవుడా శివవీర్య తాపాన్ని తట్టుకోలేక అగ్ని ఆ మహా శివుని ప్రార్ధించగా తొందరలో నీకు ఉపశమనం లభిస్తుందని వరమియ్యగా తన స్వస్థానికి బయలుదేరినాడు .
శివుడు పశ్చిమ దిశగా హిమవత్పర్వత ప్రాంత శృంగము మీదికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనను అనుగామించి అమ్మవారు వెళ్ళిపోయింది.
పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 7 ‖
🔱 *ఓం శరవణ భవ* 🔱
శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏
🌸 *జై శ్రీమన్నారాయణ* 🌸
🙏 ఓం శరవణ భవ 🙏