*శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః*
స్నాన సంధ్యాదులు, గాయత్రీ సహిత శివ పూజా జప తపాదులు సాకల్యంగా నిర్వర్తించుకొని నైమిశారణ్య మునిశ్రేష్ఠులందరూ ప్రభాతవేళ యధావిధిగా సూత పౌరాణికుని పరివేష్ఠించారు.
పార్వతీ కల్యాణ ఘట్టము జరిగిన తదుపరి కథాంశం విన కుతూహలం పడుతూన్న మునివరేణ్యులను దయా ధృక్కులతో
చూసిన రోమహర్ష్ణణ మహర్షి, వారందరి కోరిక మేరకు 'కుమార ఖండము'ను ప్రారంభించాడు.
"...ఆ ప్రకారంగా కైలాసంలో ఉంటూన్న పార్వతీపరమేశ్వరులు తమదైన లోకం లోనికి వెళ్లిపోయారు.లోకరీతి ననుసరించి, పార్వతీదేవి గర్భందాల్చే స్థితి కలగాలంటే - సురతకేళి అవసరం గనుక వారిరువురూ సమాయత్తమైనారు. కాని, లేకుంటే శివుని అంశన - ఏ అవయవం నుంచి అయినా...చివరికి జటాజూట చాలనం వల్లనైనా సంతానం కలగడం అతి మామూలు విషయం.
అదీగాక - తారకాసురుడు కోరిన ప్రకారం, తనను సంహరించు అతడు శివవీర్య సంజాతుడై ఉండాలి!
అయితే, ఎంతకాలం సురత క్రీడ సాగుతున్నప్పటికీ - అటువంటి దాఖలాలు ఏవీ కనబడడం లేదు. పార్వతీదేవి గర్భధారణ జరగడం లేదు.
ఈలోపున తారకాసురుడి పీడ తారాస్థాయిని ఇంకా మించిపోతోంది. లోకాల హాహాకారం గగన తలాన్ని తాకి ప్రతిధ్వనిస్తోంది. లోకాల మనుగడకు ముఖ్య ఆధారమైన ప్రాణవాయువు సైతం స్తంభించి పోగల దుర్ద్హశ దాపురించింది.
అంతలో విష్ణుమూర్తి చెంత చేరారు మళ్లీ సుదర్శనుడితో సహా ఎవరికీ దిక్కుతోచలేదు.
"మనం చేయగలిగినదంతా చేశాం! ఇకపై చేయగలిగింది, ఆ పరమశివుడి దయపై ఆధారపడి మాత్రమే ఉన్నది. ఆయననే శరణు వేడడం ఉత్తమం" అంటూ సురసమితిని యావత్తూ వెంటబెట్టుకొని సుదర్శనుడు కైలాసదర్శనానికి బయల్దేరాడు.
అంతఃపురంలో...లోపలెక్కడో పార్వతీదేవి తోకూడియున్నాడు పరమేశ్వరుడు.
దేవతలందరు శ్రీ మహావిష్ణువును తోడ్కొని కైలాసానికి అరుదెంచారు .
ముఖద్వారం దగ్గరే అందరూ మోకరిల్లి పెద్దపెట్టున "నమః పార్వతీ పతయే! నమః శంకర మహాదేవాయ నమః ఆశ్రితవరదాయ! నమోనమః" అంటూ ఎలుగెత్తి మొరలారంభించారు దేవగణాలు.
వారిని గనిన నందీశ్వరుడు ఆనందంతో వారికీ సముచిత మర్యాదలు చేసి విషయం తెలుసుకుని వారితో ఈ విధంగా విన్నవించాడు .
మహానుభావులారా ఎవ్వరిని అనుమతించ వద్దని సాక్షాత్తు ఆ పరమశివుడే ఆఙ్ఞాపించాడు . మీకు అనుమతి ఇవ్వటానికి నేను అశక్తుడను అని పలుకగా
శ్రీ మహా విష్ణువు దేవతలందరితో ఈ విధంగా సెలవిచ్చాడు .
అది శంకరుడు భక్త సులభుడు మనమందరమూ ఒక పార్ధీవ లింగాన్ని చేసి దానికి పూజలు నిర్వహిస్తే
ఆ గరళ కంఠుని కృపకు పాత్రులు కాగలమని చెప్పగా సత్వరమే దేటవతలందరు ఒక పార్థివ లింగాన్ని ఏర్పరచి దానికి శాస్త్రోక్తంగా పూజలు , క్రతువులులు జరుపగా ఆ భక్త సులభుడు దేవతల మొరవిని
బైటికొచ్చాడు
.దేవతలంతా ఆయన ఎదుట సాష్టాంగపడ్డారు.
హారాదిరత్నమణియుక్తకిరీటహార,
కేయూరకుండలలసత్కవచాభిరామ |
హే వీర తారక
జయాzమరబృందవంద్య,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 6 ‖
🔱*ఓం శరవణ భవ*🔱
శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...
🙏 ఓం సరవన భవ🙏