అయ్యప్ప షట్ చక్రాలు (11)

P Madhav Kumar


ఆజ్ఞ చక్రం జ్ఞానం పొందడానికి మూలం. సూక్ష్మపరిశీలనకు అది ఉన్నతమైన స్థాయి. ఎలాగైతే తెల్లని కాంతి మౌలికంగా సప్త వర్ణముల మిశ్రమమో, ఇది కూడా అంతే.  ఒకవేళ కాంతికి ఒకే ఒక రంగు ఉంటే – అంటే అది ఊదా రంగు అనుకుందాం – అది ఒక ప్రత్యేక ప్రయోజనానికే పనికి వస్తుంది, అయితే రంగు లేని కాంతి అన్నిటికీ పనికివస్తుంది. మనం సాధారణంగా దానిని తెలుపు రంగు అని అంటాము కానీ అసలైతే అది ఏ రంగూ లేనిది – మీరు దానిని చూడరు. మీరు కాంతికి మూలాన్ని చూడగలరు, ఇంకా కాంతిని పరావర్తనం చేసే వస్తువును చూడగలరు, కాని ఆ కాంతిని మాత్రం చూడలేరు. కాంతిని ఏదైనా ఆపినపుడు మాత్రమే దానిని చూడగలరు. నిజానికి కాంతి రంగు లేనిది. ఈ వర్ణ రహితమైన కాంతిని సప్తవర్ణములుగా వక్రీభవనం చెందించవచ్చు. ఆజ్ఞ చక్రం వర్ణ రహితమైనది. ఇందువలననే ఆజ్ఞ చక్రం వైరాగ్యానికి సంబంధించినది, వర్ణ రహితమైన స్థితి లేదా వర్ణాతీతమైనది, మీపై ఒక్క ఆనవాలు వదలకుండా ఏ రంగునైనా గ్రహించే అనుకూలత కలిగిస్తుంది. ఒకవేళ మనం ఎరుపు, నీలం లేదా పసుపు కాంతిని ప్రసరింపజేస్తే – ప్రతీది వైవిధ్యంగా కనిపిస్తుంది. రంగులేని కాంతి ప్రతీదానిని యథాతథంగా స్పష్టంగా చూసే అనుకూలత కలిగిస్తుంది. అదేవిధంగా మీరు ఆజ్ఞ చక్రము చేరితే మీరు ప్రతీదానిని యదాతథంగా స్పష్టంగా చూస్తారు.


అంతఃస్వేచ్ఛ

బాహ్యపరమైనవేవీ మీలో ఏమి జరుగుతోందో నిర్ణయించలేనప్పుడు, ఆజ్ఞ చక్రం ఇచ్చే స్వేచ్ఛా స్థాయి అద్బుతమైనది, ఇంకా మీలో మీకు ఆవశ్యకత అనిపించే విషయాల మీద మీరు వెచ్చించే శక్తి చాలా అసాధారణంగా ఉంటుంది. బాహ్య విషయాలు మీకు లెక్కలోనికి రావు, ఎందుకంటే మీరు అవి ఎలా ఉన్నాయో అలాగే చూస్తారు. మీరు ఒక పురుషుడిలోనో, స్త్రీలోనో వారి శరీరంలోని పేగులు, కాలేయం వంటి అన్ని అవయవాలను చూసినట్లు ఊహించుకోండి. శరీర నిర్మాణ శాస్త్రం ఇంకా శరీర విచ్ఛేదనం మీద అధ్యయనం చేసాక చాలామంది తమకు పెళ్లి చేసుకోవాలనే కోరిక లేదని నాతో అన్నారు. వారు దేహంలోపల అన్నీ చూసేశారు కనుక వారు ఎవరి శరీరంతోనూ ఏమీ చేయాలని కోరుకోవడంలేదు. కనీసం మొదట్లో అలా అనుకున్నా, ఆ తరువాతైనా, వారు వారి శారీరక వాంఛలకు లోబడి పోయారు.


మీరు కనుక అవగాహనలో సాధారణమైన పరిమితికి అతీతంగా వెడితే, మీరు ప్రతీది యథాతథంగా చూడడం ఆరంభిస్తారు, ఈ స్పష్టతకు భావావేశపు మాధుర్యంతో సమతుల్యత లేకపోతే మీరు ఈ ప్రపంచంలో మెలగాలని కోరుకోరు. మీరు ప్రతీదీ యథాతథంగా చూస్తే మీకు ప్రతీదాని పైన ఆసక్తి పోతుంది. మీరు ప్రతీది కేవలం చూస్తారు కానీ ఏదీ అర్థవంతంగా అనిపించదు. వైరాగ్యం అంటే ఎందులోనూ ప్రమేయము లేకపోవడం అని భావించడం పొరపాటు. ప్రమేయము లేకపోవడం అనేది, ఎలాంటి మధురమైన భావావేశం లేకుండా ప్రతీదానిని యథాతథంగా చూసేటప్పుడు కలిగే భావన. అప్పుడు మీరు చిరాకుతోను, నిరాశతోనూ లేదా విడిగా – కలవకుండా ఉంటారు. పారవశ్యం లేకుండా స్వచ్ఛమైన వివేచన కలిగితే మీరు జీవితంలో నిమగ్నం కాలేరు. యథాతథంగా విషయాలను తీయని భావావేశముతో చూడడం చాలా ముఖ్యము. మీరు ఆజ్ఞ చక్రం స్పృశించాలంటే ఈ స్పష్టత ఇంకా మధురమైన భావావేశముల మధ్య సమతుల్యత అవసరము

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat