* ఆచార్య బేతవోలు రామబ్రహ్మం*
*🙏లలితా సహస్రనామ శ్లోకం🙏*
*శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ*
*చిదగ్నికుండసమ్భూతా దేవకార్య సముద్యతా!!*
꧁♾️┉┅━❀🕉️❀┉┅━♾️꧂
✍️ *రచయిత మాట*✍️
*సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితామ్!*
*నమామి హ్రీమ్మయీం దేవీం ధియో నః ప్రచోదయాత్!!*
*ఇది భాగవతం. దేవీభాగవతం. శ్రీమద్దేవీభాగవతం. మహాపురాణం. పరమపావన గ్రంథం. వ్యాసుడి కంఠం నుంచీ గంటం నుంచీ జాలువారిన దేవీభక్తిరసామృతం. సాహితీమకరందం. సూతుడు చెప్పినట్టు పన్నెండు స్కంధాలలో (పద్దెనిమిదివేల శ్లోకాలలో) అందించాడు ఆ మహానుభావుడు. ఇందులో సాక్షాత్తు జగన్మాత ప్రధానపాత్ర. జగన్నాయిక ఇందులో నాయిక,ఇదీ దీని విశిష్టత.*
*అందుకే దీన్ని "పురాణరాజము" అన్నారు. భుక్తిముక్తిదాయకమన్నారు. ఇందులో ధర్మార్ధకామమోక్ష ప్రతిపాదకాలైన మనోహర కథలతో పాటు యోగ తంత్ర మంత్రాది శాస్త్రాలు అనేకం ప్రసక్త్రమయ్యాయి. గ్రంథానికి ఉదాత్తతను సంతరించాయి.*
దీని చారిత్రికత గురించి ఎవరు ఏమి చెప్పినప్పటికి దేవీభాగవతం మన తెలుగు ప్రాంతంలో చాలాకాలం నుంచీ ప్రచారంలోనూ ప్రసిద్ధిలోనూ ఉన్న పురాణం. పారాయణ గ్రంథం. తెలుగు పద్యాల్లో ఉన్నదానిని వచనంలోకి మార్చినవారు కొందరైతే, సంస్కృత మూలగ్రంథాన్ని సంక్షేపించి వచనం చేసినవారు కొందరు. ఏమైనప్పటికీ ఇవన్నీ తెలుగునాట దేవిభాగవతానికి ఉన్న ప్రాచుర్యానికి, ప్రసిద్ధికీ, ఆదరణకూ నిదర్శనాలు. తెలుగుదేశం నట్టింట విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ తెలుగువారికందరికీ ఇలువేలుపేనాయె.
అదీకాక మన ప్రాంతంలో తాంత్రికమార్గానుయాయులసంఖ్య తక్కువేమీ కాదు. ఇప్పటికి గణనీయంగానే ఉండటం విశేషం. అందుచేత చాలా ప్రాచీనకాలంనుంచీ ఇక్కడ దేవీభాగవతం ప్రసిద్ధిలో ఉన్న గ్రంథమే.
*యద్యచ్చరితం శ్రీదేవ్యాస్తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రేమాతుర్యథా తథా!!*
*--శ్రీ బేతవోలు రామబ్రహ్మం.*
🙏🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏 ఈ మాసం 26 నుంచి నవరాత్రుల ప్రారంభ సందర్భంగా
🙏 *దేవీ భాగవత పురాణము, ఒక శాక్తేయ పురాణము.*
ఇదీ, మరియు *మార్కండేయ పురాణములోని దేవీ మహాత్మ్యము,* శక్తి ఆరాధనా సంప్రదాయంలో, విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి.
ఈ గ్రంథాలలో, పరాశక్తియైన శ్రీమాతయే, సకల సృష్టిస్థితిలయకారిణియైన పరబ్రహ్మస్వరూపిణి అని చెప్పబడింది.
7వ స్కంధంలో 33వ అధ్యాయంలో *దేవి విరాట్ స్వరూప వర్ణన* ఉంది.
35, 39 అధ్యాయాలలో *శ్రీమాతను* ధ్యానించే, ఆరాధించే విధములు తెలుపబడినాయి. ఇంకా అనేక పురాణగాథలు, ఆధ్యాత్మిక తత్వాలు, భగవన్మహిమలు ఇందులో నిక్షిప్తం చేయబడినాయి. ఇది త్రిమూర్తులు చేసిన శ్రీదేవీ స్తోత్రాలతో ప్రారంభమౌతుంది.
దీని మూలం *వ్యాసుడు రచించిన దేవీ భాగవతము.* ఇందులో...
*పద్దెనిమిది వేల శ్లోకాలు,*
*పన్నెండు స్కంధాలు,*
*మూడువందల పద్దెనిమిది అధ్యాయాలు* ఉన్నాయి.
*సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము అనే అయిదు లక్షణాలు గల మహా పురాణము.*
*స్కంధాల విభాగం*
*ప్రథమ స్కంధము:* 🌈
ఇందులో దేవీ మహిమ, హయగ్రీవుడు, మథుకైటభులు, పురూరవుడు, ఊర్వశి, శుకుని జననము మరియు సంతతి మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
*ద్వితీయ స్కంధము:* 🌈
ఇందులో మత్స్యగంధి, పరాశరుడు, వ్యాసుడు, శంతనుడు, గాంగేయుడు, సత్యవతి, కర్ణుడు, పాండవుల జననం, పరీక్షిత్తు, ప్రమద్వర కథ, తక్షకుడు, సర్పయాగం, జరత్కారువు మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
*తృతీయ స్కంధము:* 🌈
ఇందులో సత్యవ్రతుని కథ, దేవీ యజ్ఞం, ధ్రువసంధి కథ, భారద్వాజుడు, నవరాత్రి పూజ, రామ కథ మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
*చతుర్థ స్కంధము:* 🌈
ఇందులో నరనారాయణులు, ఊర్వశి, ప్రహ్లాదుడు, భృగు శాపం, జయంతి, శ్రీకృష్ణ చరిత్ర మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
*పంచమ స్కంధము:* 🌈
ఇందులో మహిషుడు, తామ్రభాషణ, చక్షుర తామ్రులు, అసిలోమాదులతో దేవీ యుద్ధం, రక్తబీజుడు, శుంభ నిశుంభులు మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
*షష్ఠ స్కంధము:* 🌈
ఇందులో నహుషుని వృత్తాంతం, అడీ బక యుద్ధం, వశిష్టుని రెండవ జన్మ, నిమి విదేహ కథ, హైహయ వంశం, నారదుడు మొదలైన వాని గురిoచి వివరించబడ్డాయి.
*సప్తమ స్కంధము:* 🌈
ఇందులో బ్రహ్మ సృష్టి, సూర్యవంశ కథ, సుకన్య చ్యవనుల చరిత్ర, రేవతుడు, శశాదుడు, మాంధాత, సత్యవ్రతుడు, త్రిశంకు స్వర్గం, దక్షయజ్ఞం, దేవీ స్థానాలు మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
*అష్టమ స్కంధము:* 🌈
ఇందులో ఆదివరాహం, ప్రియవ్రతుడు, సప్తద్వీపాలు, కులపర్వతాదులు, ద్వీపవృత్తాంతం, సూర్యచంద్రుల స్థితగతులు, శింశిమార చక్రం, అధోలోకాలు, నరకలోక, దేవీపూజ, మధూక పూజావిధి మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
*నవమ స్కంధము:* 🌈
ఇందులో పంచశక్తులు, పంచ ప్రకృత్యాదుల కథ, కృష్ణుని సృష్టి, సరస్వతీ పూజ, కవచం, స్తుతి, కలి లక్షణాలు, గంగోపాఖ్యానం, వేదవతి, తులసి చరిత్ర, స్వాహా, స్వధ, దక్షిణ, షష్ఠీదేవి, సురభి, రాధా స్తోత్రం మొదలైన విషయాలు వివరించబడ్డాయి.
*దశమ స్కంధము:* 🌈
ఇందులో వింధ్య గర్వాపహరణ, మనువులు భ్రామరి గురించి వివరించబడ్డాయి.
*ఏకాదశ స్కంధము:* 🌈
ఇందులో సదాచారం, రుద్రాక్ష కథ, జపమాల, శిరోవ్రతం, సంధ్య, గాయత్రీ ముద్రలు, దేవీ పూజాదులు గురించి వివరించబడ్డాయి.
*ద్వాదశ స్కంధము:* 🌈
ఇందులో గాయత్రీ విచారము, కవచము, హృదయము, స్తోత్రము, సహస్రనామ స్తోత్రము, గాయత్రి దీక్షా లక్షణము, గౌరముని శాపము, మణిద్వీపం, దేవీ భాగవత ప్రశస్తి గురించి వివరించబడ్డాయి.
*... శ్రీదేవీ భాగవతము... సశేషం..*
*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*
🙏 శ్రీ మాత్రే నమః 🙏