*20.భాగం*
సూతు - తరువాత నారాక్షసులు వజ్రదంష్ట్రునియాజ్ఞవలన దమపట్టణము నుండి బయలుదేఱిరి. రాక్షసరాజగు వజ్రదంష్ట్రుడును. జతురంగబలముతో గూడి
యుద్ధము చేయుటకు గృతనిశ్చయుడై బయలుదేలెను. తరువాతను వానితమ్ములిద్దఱును సైన్యముతో గూడి బయలుదేటిరి. సూర్యకోపుడు, అగ్నికోపుడునను
వజ్రదంష్ట్రుని కుమారు లిద్దఱును వలసినంత సైన్యముతో గూడి తండ్రిని వెంటనంటి పోయిరి. వాని మేనల్లుళ్ళిద్దఱు ధూమ్రనేత్ర ఖడ్గజిహ్వులనువారును బెక్కుమంది రాక్షసులతో గూడి మేనమామకు సాయము వెళ్ళిరి. వారు బయలుదేఱునపుడు
మిక్కిలిగా భేరులు మ్రోగింపబడినవి. ఇట్లు యావద్రాక్షసులును యుద్ధశ్రద్ధ గలిగి ధనుష్టంకారములు చేయుచు సింహనాదములు చేయుచుస్వర్గమునకు బోయి
ద్వారములరికట్టిరి. రాక్షసులిట్లు యుద్ధమునకు వచ్చిరని విని దేవతలును
యుద్ధసన్నద్ధులైరి. యుద్ధములో జాలమంది రాక్షసులను గొట్టిరి. రథములను జూర్ణము చేసిరి. ఏనుగులను, గుఱ్ఱములను కాలుబలమును ధ్వంసము చేసిరి.మఱియు దేవతలు కాలదండములతో సమానములగు బాణములను బ్రయోగించియనేకులను జంపిరి. కొందఱు మావంటివాండ్రు గజములతోడను, మణికొందఱు
గుఱ్ఱములతోడను జచ్చి నేలగూలిరి. ఇట్లు చాలమంది చచ్చినతోడనే మిగిలిన
రాక్షసులు కోపించినవారై యేమియు జేయజాలక స్వర్గద్వారములను విడిచి
పాటిపోమొదలిడిరి. స్థానభ్రష్టులయి పాఱిపోవుచున్న రాక్షసులవెంట గొట్టుచు
దేవతలు పరుగులెత్తిరి. ఇట్లు దెబ్బలకు దాళజాలక సైన్యము నాలుగవైపులకును
బాటిపోవుచుండుట చూచి వజ్రదంష్ట్రుడు పాఱిపోకుండ నిలువ బెట్టుచుండెను.
ఇట్లు వజ్రదంష్ట్రుని చేతను బ్రేరేపింపబడినవారై మహాబలవంతులగు రాక్షసులు
యుద్ధాత్సుకు దేవతలమీదికి వచ్చిరి. అపుడు వజ్రదంష్ట్రుడు తమ్ములతోడను
కొడుకులతోడను మేనల్లుళ్ళతోడను గూడి దేవతలతో యుద్ధము చేయుట
కుపక్రమించెను. తరువాతను రాక్షసులకును దేవతలకును ఘోరముగా యుద్ధము
జరిగినది. ఒకరి నొకరు జయింపవలెనను తెంపు గలిగి యుండిరి. రథములతో
రధములు గుఱ్ఱములతో గుఱ్ఱములు, ఏనుగులతో నేనుగులు కాలుబలముతో
గాల్బలము పోరదొడగెను. ఇట్లు నానావిధములయిన యాయుధములతోడను
యుద్ధము చేయుచుండగా రధములచప్పుడు, ఏనుగులఘీంకారములు, గుఱ్ఱముల సకిలింపులు : పదాతుల సింహగర్జనములు బాహువుల నప్పళించినచప్పుడు
ధనస్సులటంకారములు భేరీశంభాదులచప్పుడు మిగిలినవాద్యములచప్పుడు కాహళులు తూర్యములు మొదలగువానిచప్పుడు కలిసి మూడులోకములను
జెవుడెత్తింప మొదలిడెను. సముద్రములు కలగిపోయినవి. కులపర్వతములు భ్రాంతిని బొందినవి. తరువాతను ఘోరముగా జీకటి వ్యాపించినది. అపుడు
రాక్షసుల తమయాయుధముల వెల్తురు చేజూచి దేవతలను గొట్టుచుండిరి.మటి కొందఱు కిరీటములకాంతులచే జూచి కొట్టుచుండిరి. తరువాతను
మహాబలవంతులగు రాక్షసులచే గొట్టబడి దేవతలందఱును బరాజ్ములు లయిరి.ఇట్లు పాఱిపోయి భయపడుచు దేవతలు స్వర్గములో బ్రవేశించిరి. ఘోరవిక్రములగు
రాక్షసుల దేవతలనందఱను జయించి నేటికి యుద్ధము చాలునని తలంచి
సంతుష్టులైమముగా వీరమాహేంద్రపట్టణములో బ్రవేశించిరి.తరువాత రాక్షసులచే బాగుగా దెబ్బలుతిన్న యాదేవతలందఱును
దేవేంద్రునితో గూడి శంకరుని శరణుజొచ్చుటకై బయలుదేటి కైలాసపర్వతము
పైనున్న శివుని జూచి యనేకవిధములుగా స్తుతి చేసిరి. వారు చేసినస్తుతులకు
సంతోషించి శివుడిట్లనియె. దేవతలారా !మీకుగుశలమేకదా ! ఇంద్రా ! నీకు క్షేమముగదా ! నీవజ్రము రాక్షసులగర్వము నణచుచున్నదిగదా ! అని యిట్లు శివుడడుగగా దేవతలాయనతో నిట్లనిరి. ప్రభూ ! తమదయవలన మా కందఱకును క్షేమమే. కాని వజ్రదంష్ట్రుడను రాక్షసుడు మమ్ములను బాధించుచున్నాడు. నిన్నటి
దినము వానితో యుద్ధము చేసి చాల బీడింపబడితిమి. అరాక్షసుడు బహురాక్షసు
లతో గూడి వచ్చి స్వర్గద్వారములను నిరోధించెను. కరుణానిధీ ! తమ్మును శరణుచొచ్చితిమి. మమ్ములను గాపాడవలయును. శంకరా ! మే మారాక్షసులతో యుద్ధము
చేయజాలము. ఆరాక్షసులవధోపాయము సెలవీయవలయును. ఇక వానితమ్ములిద్దఱున్నారు. వారు మఱియు దుర్మార్గులు. యుద్ధభూమిలోనికి వచ్చియున్న
వ్యాఘ్రవక్రునితోడను సర్పజిహ్వునితోడను యుద్ధము చేయుటకెవరికి శక్తి
యుండును ? మఱియు నావజ్రదంష్ట్రునికుమారులు కాలాంతకసములు,
సూర్యకోపుడు, అగ్నికోపుదుననువారున్నారు. వారిని సహింపమావశము గాదు.ఆరాక్షసునిమేనల్లుళ్ళు ధూమ్రనేత్ర ఖడ్గజిహ్వుల సంగతి చెప్పనే యక్కఱలేదు.
మహామతీ ! ఆరాక్షసు లందఱును జచ్చునుపాయ మాలోచించి మాకు సెలవీయ
వలయును. రాక్షసులను నశింపజేసి మమ్ముల నెట్లయినను గాపాడవల యును.భక్తవత్సలా ! దిక్కులేక నిన్నే శరణు చొచ్చితిమి. అని యిట్లు దేవతలు చెప్పుకోగా
శివుడు శిరస్సును కంపించి క్షణకాల మాలోచించి “మంచిది" అని చెప్పి
దేవాంగునివంక జూచి యిట్లనియె. దేవాంగా ! నీవు పోయి యింద్రాదులకు సాయపడుము. రాక్షసులను జయించుము.
*సశేషం.......*