🔰 *శ్రీ గణేశ పురాణం*🔰 20వ భాగం

P Madhav Kumar


 *20.భాగం* 


*ఉపాసనా ఖండము*

*మొదటి భాగము*

*దక్షి స్తుతి*


బ్రహ్మ ఇలా చెప్పసాగాడు ఓ వ్యాస మునీంద్ర అలా సకల వైకల్యాలతోనూ జన్మించిన కుమారుడికి జాతకర్మను నిర్వర్తించి జ్యోతిష్యవేత్తలను వేద వేదాంగ పారంగతులైన సబ్ బ్రాహ్మణులను ఆహ్వానించి వారిని యధావిధిగా పూజించి తగు విధములైన అమూల్య రత్నరాసులతోనూ ధనధాన్యాధికములతోనూ సత్కరించాడు భీముడనే ఆ మహారాజు వేదవిధులైన వారి అనుమతితో తమకుమారుడికి దక్షుడు అన్న నామకరణం వైభవోపేతంగా చేశాడు ఆ తరువాత తన కుమారుడు యొక్క రోగనివృత్తి నిమిత్తమై జప మంత్ర ప్రయోగాలను ఔషధీ హోమాలను ఔషధ సేవను చేయించి బాధా నివారణకై తానే స్వయంగా 12 సంవత్సరాలు దీక్ష వహించి కఠినమైన తపస్సు ఆచరించాడు...



అయినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో విరక్తి చెందాడు చివరికి అతనికి భార్య పుత్రులపైన ఎనలేని క్రోధం కలిగింది భార్యాబిడ్డలను తన భవనం నుండి నీ ముఖం నాకు చూపించకండి అంటూ వెళ్లగొట్టాడు అలా భర్త చేత తిరస్కరించబడిన కమల అన్న ఆ రాజపత్ని వేరే గత్యంతరం లేక తన కుమారునితో కలిసి అరణ్యానికి వెళ్లిపోవడానికి ప్రయాణమైంది తన కుమారుడ్ని వీపుకు కట్టుకొని ఎంతో దుఃఖపడుతూ వెంట తీసుకొని వెళ్ళ సాగింది ఆకలి దప్పులకు కృషించి ఒక గ్రామాన్ని మరో గ్రామానికి బిక్షిస్తూ పోసాగింది మార్గమధ్యంలో ఆమె వద్దనున్న విలువైన ఆభరణాలను చీనీ చీనాంబరాలను కూడా దొంగలు అపహరించారు...



ప్రతి గ్రామంలోనూ తన కుమారుడ్ని ఒక ఆలయంలో ఉంచి తాను మట్టుకు బిక్ష చేసి తీసుకువచ్చేది ఒక్కోసారి తన కుమారుడ్ని కూడా తన వెంటే బిక్షకు తీసుకెళ్లేది ఇలా తన కుమారుడితో భిక్షాటనం కోసం తిరుగుతూ ఉండగా ఒకనాడు ఒకానొక గ్రామంలో ఒక గజానన భక్తుడైన శ్రోతియ బ్రాహ్మణుడు తటస్థ పడతాడు అతి పవిత్రుడు భగవత్ అనుగ్రహాన్ని పూర్తిగా సిద్ధించుకున్న ఆ బ్రాహ్మణోత్తముని మీద నుండి వీచిన గాలి సోకగానే ఆ రాజపత్ని వెంటనే దక్షుడికి కన్నులకు దృష్టి చెవులకు శబ్ద గ్రహకత్వము కలిగి మాట కూడా వచ్చింది అతని శరీరానికి సైతం స్వస్థత కలిగి దివ్య సుందరమైన దేహం కలవాడైనాడు...



అలా స్వస్థుడైన తన కుమారుడు మృదు మధురంగా మాట్లాడడం ఆరంభించడం చూసిన ఆమె సంతోషానికి నేర లేకుండా పోయింది ఎంతగానో ఎదురుచూసిన శుభ ఘడియ అలా ఎదురవటం ఆమెకు ఊహించని వరమే అయింది మణి మంత్ర ఔషధాల వల్ల జపహోమాది కాలవల్ల సిద్ధించని ఆరోగ్యం కేవలం ఏ బ్రాహ్మణుడి శరీరం పైనుండి వీచిన గాలి సృష్టించడం వల్లనే సిద్ధించింది కదా ఇట్టి తీవ్ర దుష్కర్మను నశింపజేసిన ఆ మహనీయుని మహత్తును నేనేమని పొగడగలను అనుకుంటూ తన తనయుడిని అక్కున చేర్చుకొని తనివి తీరా ముద్దాడి ఎంతో ఆనంద భరితురాలు అయింది.....



ఆ మర్నాడు రోజు లాగానే భిక్షాటనకని వెళ్లిన కమల అన్న ఆ రాజ పత్నికి ఎంతో సాధారణమైన ఆహ్వానంతో పాటు షడ్రసోపేతమైన విందు భోజనం కూడా ఒకరింట లభించింది అది మొదలు ప్రతిరోజు అలాగే నానారకములైన పిండివంటలతో ఆ తల్లి కొడుకులకు ఆ ఊరిలో వారు సాధారణ పూర్వకంగా ఆహారము నిచ్చేవారు ఇలా కొన్నాళ్లు గడిచాక ఒక పురజనుడు దక్షుడు యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి ప్రశ్నించాడు ఆ బాలకుడు ఇంటికి వచ్చి తన తల్లిని అడిగి తన తండ్రి నగరము మొదలైన వివరాలన్నీ తెలుసుకొని వెళ్లి తిరిగి పురజనులతో ఇలా అన్నాడు.....



కర్ణాటక దేశంలోని భాను నగరానికి రాజైన వల్లభుడు అనే వాడు నాకు తండ్రి క్షత్రియులము మేము మహాబల పరాక్రమొపేతుడు కీర్తిమంతుడు కూడా కమల అన్న పేరుగల ఈమె నన్ను కన్న తల్లి నా పేరు దక్షుడు నేను పుట్టుకతోనే మూగ చెవిటి అంధత్వం మొదలైన వికారాలతో జన్మించాను ఇక నా ఈ శరీరం యావత్తు వ్రాణాల తాలూకు రసి ఓడుతూ చీమొనెత్తురులు కారుతూ దుర్గంధ పూరితంగా ఉండేది నా తల్లి నన్ను పుట్టగానే ఏవగించుకున్న తండ్రి ఆమెకు నచ్చజెప్పి తాను 12 సంవత్సరాల కాలం నా ఆరోగ్యం నిమిత్తం శతవిధాలా ప్రయత్నించి విఫలుడై చివరికి ఆగ్రోదగ్రుడై మమ్మల్ని ఇద్దరినీ ముఖము చూపించవద్దంటూ పురం నుండి వెళ్లగొట్టాడు....



అరణ్యాలలోనూ గ్రామాలలోనూ అలుమటిస్తూ మాకు ఉన్న సంపద యావత్తు పోగొట్టుకొని ఈ ఊరు చేరుకున్నాము ఇక్కడికి రాగానే ఒకానొక మహాపురుషుని శరీరం పైనుండి వీచిన గాలి సోకటం వల్ల నేను పరిపూర్ణ ఆరోగ్యవంతుడినైనాను ఇలా ఈ దివ్య దేహం పొంది విరాజిల్లా సాగాను ఈ విధంగా దక్షిణ నోట ఆశ్చర్యకరమైన అతని యావత్ వృత్తాంత మోవిని తమ ఇళ్లకు వెళ్లిపోయారు ఆ తరువాత ఆ తల్లి కొడుకులిద్దరూ ఆ మహిమ పేతుడైన బ్రాహ్మణోత్తముని ఆశ్రయించి శ్రీ గణేశ ఆరాధన విధానమును ఉపదేశంగా పొందారు అత్యంత శ్రద్ధ భక్తులతో వారిద్దరూ నిరాహారులై గణేశ అష్టాక్షరి మంత్రాన్ని తదేక దీక్షతో అణుష్టించారు శరీరం శల్య వశిష్టమైన ఏమాత్రం సంశయం లేకుండా పాదన ఖాంగుష్టమై జపించిన వారి భక్తికి సంతుష్టుడైన గజాననుడు అనుగ్రహించి వారికి సాక్షాత్కరించాడు.....



*కమలదక్షులకు గజాననుడు సాక్షాత్కరించుట*


ఆ గజాననుని మూర్తి దివ్యమంగళ స్వరూపుడై పెద్ద శరీరము తోను ఏనుగు ముఖాన్ని ధరించి కోటి సూర్యులతో సమానమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఎర్రటి వస్త్రమును దాల్చి ఉన్నాడు బంగారు భుజకీర్తులను బాహుపురులు ధరించి శిరస్సుపై రత్న మణికచితమైన కిరీటం ధగధగాయమానంగా అలంకరించగా తన ఒక పాదం సింహాసనం క్రింద ఉన్న పాదపీఠంపై జాపి మరో పాదాన్ని మోకాలుకు తాకించి ఏకదంతాముతో బంగారు మొలత్రాటితోను శేషుని తన ఉదరమునకు చుట్టుకొని వేళ్ళకు ఉంగరాలతో కరుణావృష్టిని కురిపించే నేత్రాలతో ప్రసన్నుడై దర్శనం ఇచ్చాడు.....



మళ్లీ అంతలోనే తిరిగి బ్రాహ్మణ రూపంలోనూ కనబడ్డాడు అప్పుడు ఆ బ్రాహ్మణ శ్రేష్టుడు ఆ తల్లి కొడుకులను ఉద్దేశించి ఇలా పలికాడు మీ తపోనిష్టకు సంతసించాను మీ మనోభీష్టం నెరవేర్చదలచాను మీకు కావలసిన వరాలను నిస్సంకోచంగా కోరుకోండి అప్పుడు విశ్వామిత్రుడు తిరిగి ఇలా చెప్పసాగాడు ఓ భీమరాజ అలా ప్రత్యక్షమైన గజాననుని చరణాలకు సాష్టాంగ నమస్కారం చేసి తల్లి తనయులిద్దరూ ఇలా స్తుతించారు దక్షుడిలా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తమా మా పూర్వ పుణ్యము ఈనాటికీ ఫలించింది రెండు రకాలుగా గల నీ మహత్తర స్వరూపాన్ని వైనాయకమును బ్రాహ్మణ రూపాన్ని చూడటం చేత నా జన్మ సఫలం అయింది ఓ దేవా నీవు కారణములకే కారణమైన వాడివి వేదాలకు సైతం కారణభూతుడివైన వాడివి. సర్వయోగి శ్రేష్టులకు జ్ఞానంతో చేరవలసిన గమ్యమే నీవు అంతర్ బహిర్విశ్వం యావత్తుకు సాక్షిభూతుడవు సాకారము నిరాకారము నీ రెండు రూపాలే త్రిమూర్త్యాత్మకుడవు సృష్టికర్త బ్రహ్మవు పాలన చేసే విష్ణుస్వరూపుడవు ప్రళయ సంహారకుడవైన రుద్రమూర్తివి నీవే....



పంచభూతాలైన భూమి జలము అగ్ని వాయువు ఆకాశము ఈ ఐదు నీలోనివే సూర్యచంద్రులు నీ స్వరూపమే జ్ఞాన విజ్ఞాన సంపన్నుడవు కాలస్వరూపుడవు ఇంద్రియ అధిష్టాన దేవతలంతా నీ అంశలే సకల శాస్త్రములు వేదములు పురాణములు సారము నీవే చతుషష్టి కళలూ నీరూపమే సకల లోకాలోనూ నీవు కానిదేదీ లేదు అన్ని పుణ్యక్షేత్రాలలో తీర్థయాత్ర ఫలమెంతటిదో నీ పాదముల యందు భక్తి చేయడం అటువంటి దివ్యఫలాన్నిస్తుంది అనాదివి విభజించబడని వాడి ప్రమాణాలన్నింటికీ అతీతుడవు కేవలం జ్ఞానం వల్లనే గోచరమయ్యే వాడివి నీవే చతుర్విధ జీవరాసులు గాను ఉన్నది నీవే జీవులలో హరిషడ్వర్గాల ద్వారా బద్ధులను చేసేది నీవే నీ అనుగ్రహానికి ప్రాప్యులైన వారికి ఇక అసాధ్యం ఏది లేదు అంటూ తనను స్తుతించిన ఆ దక్షుడితో వినాయకుడిలా అన్నాడు....



ఓ బాలకా నీ ఈ స్తుతికి ఎంతో ప్రసన్నుడనైనాను నీ కోరిక ఎట్టిదైన సరే తీర్చగలను అయినా నీకు ఇప్పుడు వరం మాత్రం నేను ఇవ్వను నీకు అలా వరాన్నిస్తే నా భక్తుని నీకు ఈ రూపం ఎవరి స్పర్శ వల్ల లభించిందో చిన్న గుచ్చుకున్నట్లు అవుతుంది ఆమె నా ప్రియ భక్తుని పేరు ముద్గలుడు నీవు అతని స్మరించిన వెంటనే నీ ఎదుట నిలచి నీ కోరికలన్నీ నెరవేర్చగలడు నీకు శుభమవుగాక అంటూ అంతర్ధానం చెందాడు పేద కు దొరికిన పెన్నిధిలా క్షణంలో సాక్షాత్కరించి మరుక్షణమే అంతర్ధానమైన తన తపఃఫలం కన్నులకు దూరమవుటంతో నిర్గాంత పోయిన ఆ దక్షుడు మూర్చలాడు ఆ తర్వాత కొంతసేపటికి తేరుకొని వినాయకుడు ఎటుపోయాడా అంటూ పరి పరి విధాలా చింతించసాగాడు....



ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసన ఖండంలోని 

'దక్ష స్తుతి' అనే  అధ్యాయం సంపూర్ణం...


 *సశేషం......*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat