🔰 *దేవాంగ పురాణము* 🔰 24 వ భాగం

P Madhav Kumar


 *24.భాగం* 


సూతు - తరువాతను రాక్షసరాజగు వజ్రదంష్ట్రుడు చచ్చిన వారిందలచుకొని యేడిచి యేడిచి తుదకు దుఃఖ మాపుకోజాలక కోపము దెచ్చుకొని తనకు

బావమఱదియగు విద్యుత్కేశునియింటికి బోయెను. ఇంటికి వచ్చినబావనుజూచి

విద్యుత్కేశు డత్యంతమును గౌరవించి విషాదమునకు గారణమేమని యడుగగా

నావజ్రదంష్ట్రు డిట్లనియె. ప్రియసఖా ! రాక్షసశ్రేష్ఠ ! మహాబలా ! విద్యుత్కేశా !

నాకొక కార్యము చేయవలసియున్నది. అని చెప్పగానే వాడు వినయముతో గూడియేమిచేయుమన్నను నీయాజ్ఞను శిరసావహించి చేయుదు ననెను. ఆమాట వినగానే వజ్రదంష్ట్రుడు సంతోషించి వానితో నిట్లనియె.

ఓయీ ! నే నిపు డొకటి చెప్పెదవినుము. పూర్వము దేవాంగుడు చేసినసంగతి యెఱిగియే యుందువు. నావారందఱును యుద్ధములో మృతినొందిరి.ఇదంతయు వానివలననే సంభవించినది. ముఖ్యులందఱును జచ్చిపోయిరి.

ఆచచ్చినవారి నందఱను దలంచుకొన్న కొలందిని దుఃఖమే హెచ్చయిపోవుచున్నది.

నేను విరథుడ నైపోతిని. గట్టిగా దెబ్బలు తింటిని. వేయేల ? దేవతలయెదుట నన్ను

వాడు పలువిధములుగా నవ్వి వేళాకోళములు చేసెను. నేను బన్నినమాయలన్నియు

బోయినవి.నాబలమెందులకును బనికి వచ్చినదే కాదు. అది యెక్కడనుండి

తెచ్చినవాడో కాని వృషభధ్వజమును బ్రయోగించెను. అది మహోత్పాతమును

గలిగించినది. సింహమునకు భయపడిన లేడి పిల్లవలె యుద్ధములో నిలువజాలక

పాటిపోతిని. ఇంద్రుడు దేవాంగుని సాయమున జయమును బొంది గర్వించి

సంతోషించుచు దేవతలతో గూడ స్వర్గమునకు బోయెను. సగరేశ్వరుడగు

దేవాంగునిసహాయముననే యింద్రుడంత గొప్పవాడయిపోయినాడు. ఇంతకును దైవయత్న మెవరికిని దప్పింప వీలుగానిది గదా ! ఇంద్రునకు జయము, నాకు పరాజయము గలుగునని యెన్నడుయినను తలంపవచ్చునా ? నే నారెండుసంగతులకే మిక్కిలి విచారించుచున్నాను. పౌరుష మెందులకును బనికి రాదనియు దైవమే

ప్రబలమనియు దేటపడినది. నాతమ్ముడు వ్యాఘ్రవక్రుడు త్రిలోకములను

జయించినవాడు గదా ! అట్టివానిని దేవాంగుడు యుద్ధములో బడగొట్టినాడు

ఇందుల కేదియైనను బ్రతిక్రియలున్నచో జేసి నాదుఃఖమును బోగొట్టుదు

వనునభిప్రాయముచే నీయొద్దకు వచ్చితిని. నాయింతటి దుఃఖమునకును మూలకారణము దేవాంగుడేయయినాడు. వానిని జయించునుపాయ మాలోచింపుము.మనము కపటోపాయమును బన్నిననే కాని వానిని జయింపజాలము. వాని కాధ్వజముండుటబట్టి యసాధ్యుడుగా నున్నాడు. శంభుదత్తమయిన యాధ్వజప్రభావమిట్టిదని చెప్పుటకు సాధ్యము గాదు. కావున నెట్లయినను నీవు మాయోపాయముచే

నాధ్వజమును హరించితివేని యాదేవలుడు మనకు లొంగును. నీవావిషయమున

సాయపడుము. ఆమాత్రపుపని చేసితివేని మనపను లన్నియు నెఱవేఱుట

కెంతమాత్రమును నభ్యంతరము లేదు అని చెప్పగానే విద్యుత్కేశు డంగీకరించి ధ్వజము నపహరించు తలంపుతో నామోదపట్టణమునకు బోయి దేవలునితో నిట్లనియె. ఓయీ ! దేవలా ! రాజశ్రేషా ! దయాళూ ! అమిత విక్రమా ! నేను దేవేంద్రునిదూతను. నమస్కరించుచున్నాను. ఆయనయాజ్ఞచే నీయొద్దకు వచ్చితిని.ఇపుడు మరల పజ్రదంష్ట్రుడు లెక్కలేని రాక్షసులతో వచ్చి నిర్భయముగా యుద్ధము

చేయుచున్నాడు. నిన్నటిదినము నీవు రాక్షసులతో ఘోరముగా యుద్ధము చేసియలసి

యున్నావని యెఱింగి నీకు శ్రమ కలుగజేయ గూడ దనుతలంపుతో నింద్రుడు తానే దేవతా సైన్యమును వెంటబెట్టుకొని యుద్ధమునకు బోయి వజ్రదంష్ట్రాదులగు

రాక్షసులతో యుద్ధము చేయుచు “ఓయీ దూతా ! దేవాంగమహారాజు దగ్గలు

శత్రుసంహారిక మగువృషభధ్వజ మున్నదిగదా ! అతని నడిగి యది తీసికొని రమ్ము"

అని నన్ను బంపియున్నవాడు. మహారాజా ! శీఘ్రముగా నాధ్వజ మిమ్ము. దానితో

యుద్ధదుర్మదులగు రాక్షసులు ధ్వంసము చేయబడుదురు. నిన్నటి యుద్ధములో

నాధ్వజ ప్రభావమువలన బెక్కురు రక్కసులుక్కుదక్కిరి గదా ! చావగా మిగిలిన

రాక్షసులు వజ్రదంష్ట్రుని పురస్కరించుకొని మరల వచ్చి యుద్ధము చేయుచున్నారు.

అందఱను జంపగల ధ్వజము దెచ్చి వేగముగా నాకిమ్ము. అని యిట్లు కుటిలుడై

వచ్చిన యాదూత మాటలు విని నిజమే యనుకొని దైవవశమున దేవేంద్రునికి మేలు చేయుతలంపుతో నాధ్వజమును వానిచేతి కిచ్చెను. ఆరాక్షసుడు సంతోషించుచు

నద్దానిని గైకొని తిన్నగా వీరమా

హేంద్రపట్టణము ప్రవేశించి వజ్రదంష్ట్రుని

సందర్శించెను. వాడు వానిని జాలగౌరవించి వెంటనే ముఖ్యులగు రాక్షసులను

బిలిచి మీరు యుద్ధసన్నద్ధులయి రండు వేగముగా స్వర్గమును ముట్టడింతము. అని

వారిని సిద్ధపణి చెను. రాక్షసులరాక తెలిసికొని దేవేంద్రుడు కోపించి దేవసైన్యముతో

గూడి రాక్షసులతో యుద్ధము చేయబో వుచు దేవలునిరాకను గోరి యామోద

పట్టణమునకు దూతనుబంపగా వాడు వేగముగ బోయి యింద్రునియానతి

విన్నవించెను. దేవదూత మాటలు విని యాశ్చర్యపడి యిది యేమిసంగతి

చెప్పుమా? ముందు వచ్చి దేవరాజు పంపెనని యొకడు ధ్వజము తీసికొని

 పోయెనుగదా ! ఇప్పుడు మడొకడు వచ్చి మరల బిలుచుచున్నాడు. ఆధ్వజము యొక్క మహిమగానీ, యుద్ధమునందు దగ్గిపోయినదా ? లేక అది నాది గనుక నింద్రునకు పనికిరాక పోయేనదా?


   *సశేషం.......*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat