*పరమేశ్వరుడి ప్రార్థన లోక కల్యాణం కోసమే చేశాడని శ్రీ హరి ఇలా అన్నాడు* 🌷
🌺హే ప్రభో! అగాధమగు జలనిధి వంటి ఈ సంసారాన్ని సురక్షితంగా దాటించి నీ వద్దకు గొని తేగల నావ వంటి మహామంత్రాన్నుపదేశించండి అని ప్రార్ధించాడు శివుడు. జగదానందకారకులలో తనంతటి వాడైన పరమేశ్వరుడి ప్రార్థనను లోక కల్యాణం కోసమే చేశాడని గ్రహించిన మహావిష్ణువు ఆనందంగా ఇలా బోధించసాగాడు
🌺పరమేశా! పరమబ్రహ్మ, పరమాత్మ, నిత్యుడు, పరమేశ్వరుడునైన విష్ణుభగవానుని సహస్రనామాలతో స్తుతిస్తే మానవులు భవసాగరాన్ని దాటగలరు. ఆ పవిత్ర, శ్రేష్ఠ తప, జపయోగ్య, సమస్త పాప వినాశకర మహా స్తోత్రాన్ని వినిపిస్తాను, శ్రద్ధగా వినండి.
వాసుదేవోమహావిష్ణుర్వామనో వాసవో వసుః
బాలచంద్ర నిఖోబాలో బలభద్రో బలాధిపః
బలిబంధన కృద్వేధా వరేణ్యా వేదవిత్ కవిః
వేదకర్తా వేదరూపో వేద్యో వేదపరి ప్లుతః
వేదాంగ వేత్తా వేదేశో బలాధారో బలార్దనః
అవికారో వరేశశ్చ వరుణో వరుణాధిపః
వీరహచ బృహద్వీరో వందితః పరమేశ్వరః
ఆత్మాచ పరమాత్మాచ ప్రత్యగాత్మా వియత్సరః
పద్మనాభః పద్మనిధి:పద్మహస్తో గదాధరః
పరమః పరభూతశ్చ పురుషోత్తమ ఈశ్వరః
పద్మ జంఘః పుందరీకః పద్మమాలాధరః ప్రియః
పద్మాక్షః పద్మగర్భశ్చ పర్జన్యః పద్మసంస్థితః
అపారః పరమార్ధశ్చ పరాణాంచ పరః ప్రభుః
పండితః పండితే ద్యశ్చ పవిత్రః పాపమర్ధకః
శుద్ధః ప్రకాశరూపశ్చ పవిత్రః పరిరక్షకః
పిపాసావర్ణితః పాద్యః పురుషః ప్రకృతి స్తథా
ప్రధానం పృథివీ పద్మం పద్మనాభః ప్రియంవదః
సర్వేశః సర్వగః సర్వః సర్వవిత్ సర్వదః సురః
సర్వస్య జగతోధామ సర్వదర్శీచ సర్వభృత్
సర్వానుగ్రహకృదేవః సర్వభూత హృదిః స్థితః
సర్వ పూజ్యశ్చ సర్వావ్యః సర్వదేవ నమస్కృతః
సర్వస్య జగతో మూలం సకలో నిష్కలో నలః