పరమపదం అంటే ఏమిటి...??* 🌟

P Madhav Kumar


*పరమపదం*

🌿'శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు!' అనటంలోని ఆంతర్యం - చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుంది.

🌷సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే, శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం.

🌿 *శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం, శివమే అనంతం, శివమే జ్ఞానం, శివమే చైతన్యం, శివమే సర్వజగత్తులకు మూలాధారం.*

🌷అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు.

🌿శివానందలహరిలో ఒక శ్లోకముంది, సారాంశం ఏమిటంటే...

🌷శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని పూజించే చేతులే చేతులు, శివుని సదా స్మరించేవాడే ధన్యుడు.

🌿 *పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు, 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని, మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు.*

🌷'శివసిద్ధి' అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు.

🌿 *పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు, ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.*

🌷శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే, బిల్వార్చన, రుద్రాక్ష ధారణం, విభూతి లేపనం, అభిషేకం వంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు.

🌿జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి.

🌷అప్పుడు మనం సదా శివ సాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat