తుమ్మితే శుభమా లేక అశుభమా?

P Madhav Kumar

 మనం బయటికి వెళ్లే ముందు, ఎవరైనా తుమ్మితే, ఒక క్షణం ఇంట్లోకి వచ్చి మళ్ళీ కూర్చొని, వెళ్లాలి అని అంటారు కదా, ఇది , నమ్మకమా మూఢ నమ్మకమా, లేక ఏదైనా  శాస్త్రీయ ఆధారం ఉందా❓


 నమ్మకం.. మూఢనమ్మకం.. శాస్త్ర ఆదారం మాత్రం లేదు. చిత్ర మేమిటంటే.. ప్రపంచంలో అన్ని చోట్లా ఈ సాంప్రదాయం లేక ఆచారం ఉంది. కొన్ని చోట్ల శుభం గాను అశుభం గాను భావిస్తున్నారు. ఇది మన హైందవ సంస్కృతిలోనే కాకుండా ముస్లిం, క్రిస్టియన్ లు కూడా పాటిస్తున్నారు. కనుక ఇది ఒక అంతే... మాటలతో చెప్పలేం. శాస్త్ర ప్రమాణం మాత్రం ఎక్కడా కనపడదు.

ఈ విషయం లో అంతర్లీనంగా ఉండే కోణం గురించి చెప్పాలంటే.....    మనం చేయబోయే ప్రయాణం/కార్యం/ లో లాభ నస్టాలు,సుఖ, దుఃఖాలు, ,కష్ట , నష్టాలు,శుభాశుభాలు, ఏ స్థాయిలో ఉన్నాయో, భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనే విషయాన్ని  ముందుగానే ప్రకృతి  అంటే అందులోని పశుపక్ష్యాదులు, జీవులు, మనుష్యులు, వాహనాలు, చెట్లు, చేమలు, జీవులకు సహజంగా కలిగే వాంతులు, విరేచనాలు, తుమ్ములు, దగ్గులు,చీదడాలు,అనవసర కోపాలు, అప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే కలహాలు, ప్రకృతి వైపరీత్యాలు,వాహన ప్రమాదాలు, వాహనం ఆగిపోవడాలు, వెళుతున్న మార్గం లో  (రోడ్,/నీటి,/ఆకాశం) అకస్మాత్తుగా సంభవించే అవాంతరాలు , నిలుపుదల లు  ఇలా ఏదో ఒక విధంగా మనకు తెలియజేస్తుంది. నీవు చేపట్టబోయే కార్యక్రమం/ప్రయాణం నీవు చేయాలనుకున్న ఘడియలలో కొంత అపశృతులు కలిగే అవకాశం ఉంది కాబట్టి నీవు అలాంటివి జరగకుండా ఉండాలంటే ఆ ఘడియలలో కాకుండా ఉండేలా చూసుకో, అంటే కొంత ఆలస్యంగా చేపట్టు, లేదా నిర్లక్ష్యం చేస్తే అనుభవించు, నేనైతే నీకు చెబుతున్నాను అని ప్రకృతి తెలియజేస్తుంది. ఇక అప శకునాలు ఎక్కువ సార్లు సూచిస్తే ఆ ప్రయాణం/కార్యం పూర్తిగా రద్దు చేసుకోవడానికే ఆలోచనలు చేసి అమలు చేయడం శ్రేయస్కరం. అలాగే జరగబోయే కార్యం లో శుభాలు ఎక్కువగా సూచిస్తే శుభ శకునాలు కూడా సూచిస్తాయి.అలాంటప్పుడు పూర్తిగా ఆ కార్యక్రమం రద్దు కు ఆలోచన చేయకుండా అమలుకే ప్రాధాన్యత ఇవ్వాలి అని అర్థం చేసుకోవాలి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat