గతే రాజని సంధ్యాయాం శివదత్తకుకో బుధః
చరిత్వాకల్కి పురతః స్తుత్వా తం పురతః స్థితః
తం శుకం ప్రాహ కల్కిస్తు సస్మితం స్తుతి పాఠకమ్
స్వాగతం భవతా కస్మొదే రాత్ కిం భాదితం తతః
🌺అర్ధం:
విశాఖయూపరాజు వెడలిన పిమ్మట శివుని భక్తుడు, పండితుడగు శుకము. సంధ్యాసమయమున కల్కి వద్దకు వచ్చి అతనిని స్తుతించెను. కల్కి మందహాసముతో స్తోత్రపాఠకుడగు శుకమునకు స్వాగతము పలికి నీవు ఏదేశమునకేగి ఏ వృత్తాంతమును తీసుకువచ్చితివని అడిగెను.
శుక ఉవాచ...
శృణు నాథ! వచో మహ్యం కౌతూహలసమన్వితమ్
అహం గతశ్చ జలధేర్మధ్యే సింహలసంజ్ఞకే
యథావృత్తం ద్వీపగతం తచ్చిత్రం శ్రవణ ప్రియమ్
బృహద్రథస్య నృపతేః కన్యాయాశ్చరితామృతమ్.
🌺అర్ధం:
శుకము పలికెను. ఓరాజా ! కుతూహలమునుకల్గించు వచనములను మీరు వినుడు, సముద్రమధ్యమున గల సింహలనను ద్వీపమునకు నేను వెళ్ళితిని, సింహలమందలి సమస్తవృత్తము ఆశ్చర్యము గొలుపునది. బృహద్రథరాజ కన్యావరియు వినుట కింపైనది
ధౌముద్యామిహ జాతాయా జగతాం పాపనాశనమ్
చరితం సింహలే ద్వీపే చాతుర్వర్ణ్య జనావృతే.
ప్రాసాదహర్మ్య సదన పురరాజీ విరాజితే
రత్నస్ఫాటికకుడ్యాది స్వర్ణ తాలిర్విభూషితే.
🌺అర్ధం:
కౌముదియను మహారాణికి జన్మించిన రాజపుత్రిక చరితము పాపనాశకము, సింహళ దేశమున బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు నాలుగు వర్ణములవారు గలరు. ఆ నగరము రత్న స్పటిక గోడలతో కూడిన రాజగృహములతో, ధనిక గృహములతో,స్వర్ణతలతో ప్రకాశించుచుండెను.
శ్రీఖిరుత్తమ వేశాభిః పద్మినీధిః సమావృతే
సరోభిః సారసైరంపై రుపకూల జలాకులే.
భృంగరంగ ప్రసంగార్యే పద్మైః కల్హారకుందః
నానాంబుజలలొ జాల వనోపవన మండితే.
🌺అర్ధం:
అచ్చట నల్లని కేశపాశములు గల పద్మిని జాతి స్త్రీలు గలరు. ఔద్గురు పక్షులు, జలచరపక్షులు హంసలతో గూడిన సరస్సులు గలవు. తుమ్మెదల ఝుంకారములచే ఆ ప్రదేశము మనోహరముగ నున్నది. పద్మములు, కలువలు, కుందపుష్పములు, వివిధములగు చిట్టిగన్నేరు పుష్పములు, లతలతో గూడిన వన, ఉపవనములతో సింహళదేశము విభూషిత మైయున్నది.
దేశే బృహద్రథోరాజా మహాబల పరాక్రమః
తస్య పద్మావతీ కన్యా ధన్యా రేజే యశస్వినీ
భువనే దుర్లభా లోకే౬ ప్రతిమా వరవర్ణినీ
కామమోహకరీ చారుచరిత్రా చిత్రనిర్మితా
🌺అర్ధం:
మహాపరాక్రమ వంతుడగు బృహద్రథుడు సింహళదేశమునకు ప్రభువు. బృహద్రథుని కూతురు పద్మావతి. ఆమె యశస్విని. అద్వితీయ సౌందర్యవతి. కామమోహములను కల్గించు రూపము కల్గిన ఆమె చిత్రమందు గీయబడిన యువతి వలె మనోహరముగ నుండును. ఆమె చరితము అత్యంతరమణీయము
🌹 తరువాయి భాగం రేపు చదువుదాం.