నాలుగవ అధ్యయనం - మొదటి భాగం
సూత ఉవాచ.....
తతః కల్కి : సభామధ్యే రాజమానో రవిర్యథా
ఐభాషే తం నృపం ధర్మమయో ధర్మాన్ ద్విజప్రియాన్.
🌺అర్ధం:
సూతుడు పలికెను. విశాఖయూపుని సభలో సూర్యునివలె ప్రకాశించు కల్కి ద్విజప్రియములగు సాధు ధర్మములను రాజునకు చెప్పెను.
కల్కిరువాచ....
కరేన బ్రహ్మణో నాకే ప్రలయే మయి సంగతాః
అహమేవాసమేవాగ్రే నాన్యత్ కార్యమిదం మమ.
ప్రసుప్తలోకతంత్రస్య ద్వైతహీనస్య చాత్మనః
మహానిశాంతే రంతుం మే సముద్భూతో విరాట్ ప్రభుః
🌺అర్ధం:
కల్కి పలికెను. ప్రళయకాలమున బ్రహ్మాండమున సర్వప్రాణులు నాయందు లీనమగును. సృష్టికి పూర్వము నేనేయుంటిని, మరేమియు లేదు. సృష్టికి కారణము నేనే ప్రళయ కాలమున సర్వప్రాణులు నాయందు లీనమై సుప్తావస్థలో నుండగ నేను తప్ప మరొకటి లేదు. ప్రళయకాలము అంతముకాగా సృష్టిరూప క్రీడ మాయొక్క సర్వశక్తులతో గూడిన విరాణ్మూర్తి ఆవిర్భవించెను.
👉మీరు చేసే వ్యాపారంలో అమ్మకాలు పెరిగి వ్యాపారం వృద్ధి 💎 చెందాలనుకుంటున్నారా...??
👉మీ కుటుంబంలోని కష్టాలు, 🙇♀️ ఋణ సమస్యలు 💰 తొలిగిపోవాలనుకుంటున్నారా...??
👉ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి వీరిని అష్టలక్ష్ములు 💵 అంటారు.
సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్
తదంగఱోల భవద్భహ్మవేదవర్తో మహా ప్రభుః
జీవోసాథేర్మమాంగాచ్చ ప్రకృత్యా మాయయా స్వయా
బ్రహ్మోవాధిః స సర్వజ్ఞో మమ వాగ్వేదశాసితః
ససర్జ జీవజాతాని కాలమాయాంక యోగతః
దేవా మన్వాదయో లోకాః సప్రజాపతయః ప్రభుః
🌺అర్ధం:
విరాట్ పురుషుడు సహస్రశీర్షములు, సహస్రనేత్రములు, సహస్రపాదములు కలవాడు. అతని అవయవములనుండి వేదముఖుడగు బ్రహ్మ ఉద్భవించెను. బ్రహ్మకు ఉపాధి అయిన సర్వజ్ఞుడగు విరాట్ పురుషుడు అంశయగు ప్రకృతి, స్వీయమగు మాయతో సమస్తజీవములను సృజించెను.
ఇచ్చే మన్వాదుల, ప్రజాపతుల సృష్టి జరిగెను (స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షువ ,వైవస్వత, సావర్ణి, దేవసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, పద్రసావర్ణి, దైవసావర్ణి, ఇంద్రసావర్ణి ఆను వారు పదునల్వురు మనువులు, మరీచి, అత్రి, అంగిరసుడు, పులహుడు, క్రతువు, ప్రచేతసుడు, వశిష్ఠుడు, భృగువు, నారదుడు ,దక్షుడు అనువారు పదిమంది ప్రజాపతులు).
గుణిన్యా మాయయాంకా మే నా నోపాదౌ ససరిరే
సోపాధయ ఇమే లోకా దేవాః సస్థాలు జంగమా.
మమాంశా మాయయా సృష్ణాయతో మయ్యావిశన్ లయే
ఏవం విధా బ్రాహ్మణాయే మచ్చ రీరా మదాత్మిక:
🌺అర్ధం:
సత్వరజస్తమోరూపత్రిగుణాత్మకముగు ప్రకృతితో కూడిన మాయచే ఉపాధిభేదమువలన నాఅంశలు దేవ, మానన, స్థావర, జంగమముల సృష్టి జరిగినది. మాయచే మా అంశలు ప్రళయకాలమున నాయందే లీనమగును. ఇట్లు సృజింపబడిన బ్రాహ్మణులు నాయొక్క శరీర, ఆత్మస్వరూపులు.