🔔అంబా సముద్రం ముక్కుణ్డ తీర్ధం🔔

P Madhav Kumar

మనదేశంలోని నదీనదాలు, పుణ్యతీర్థాలు , తటాకాలు అన్నీ కూడా

దేవతాస్వరూపంగా పూజించబడుతున్నాయి. అలా పూజింపబడే నదులలో

తామ్రపర్ణి ఒకటి. 

పొదిగై పర్వతం లో ఆవిర్భవించి , దక్షిణ తమిళనాడులో ని చివరి జిల్లాలదాకా సస్యశ్యామలం చేసే

జీవనది తామ్రపర్ణి. 

నదులను దైవంగా భావించే

మన పూర్వీకులు , ఆయా నదుల

గొప్పతనాన్ని  లోకానికి

తెలిసే విధంగా నదీతీరాలలో

అనేక ఉత్సవాలు చేసేవారు.

అలాటి ఉత్సవాలలో ప్రాముఖ్యత వహించేది 12 సం త్సరాలకు ఒకసారి వచ్చే మహాపుష్కరం. 

తామ్రపర్ణి తీరాన ప్రాచీన కాలంలోనే పుష్కర ఉత్సవాలు జరిపేవారు. 


కాని  1874..  తరువాత

ఆ ఉత్సవం ఎందుకో జరుపబడలేదు.  144 సంవత్సరాల తరువాత 

మరల 2018 లో తామ్రపర్ణి

పుష్కరాలు అతి వైభవంగా జరిగాయి. 

యీ నదీతీరాన గల అనేక ఊళ్ళలో

ఈ పుష్కరోత్సవాలను  ఘనంగా

జరిపారు. అలాటి పట్టణాలలో అంబాసముద్రం

ఒకటి. 

ఈ ఊరిలో తీర్ధఘట్టాలు  అనేకం

వున్నాయి. వాటిలో ముఖ్యమైనది

ముక్కుణ్డ తీర్ధం.  50 సంవత్సరాలకు పైగా ఏవిధమైనటువంటి శ్రధ్ధ వహించక  పరిశుభ్రత లేకుండా పోయినది. మహాపుష్కరం జరిగిన

సమయంలో  రాజా అనే

మహానుభావుని కృషిఫలితంగా భక్తుల

సహాయంతో  ఈ నదిని పునరుధ్ధరించాడు. ఆ

పునరుద్ధరణ తో పాటు

ఆ తీర్ధం యొక్క గత చరిత్రను కూడా వెలికితీసే

పనిని మొదలు పెట్టారు.


అంబాసముద్రం యొక్క

స్ధలపురాణాన్ని కవి 

హరిహరభారతి  రసవత్తరంగా

వ్రాశారు.



ఈ తీర్ధ ఘట్టం 

పొంగు తీర్ధం, 

కుట్ట తీర్ధం, అగ్నితీర్ధం అని మూడు భాగాలుగా ఒకే ప్రాంతాన వున్నవి. ఈ మూడు తీర్థాలలోని జలాలు

వేరు వేరు రుచులుగా వుంటాయి.  ఈ జలలాకు రుగ్మతలను గుణపరిచే మహత్తరశక్తి కలవి.


🔯అగ్ని తీర్ధం .. ఈ తీర్ధం లో  విధిగా 41

రోజులు స్నానం చేసి , సమీపాన వున్న ఆలయంలో భగవంతుని

పూజలు చేసిన  ఎటువంటి మనో వ్యాధులైనా గుణమౌతాయి

అని భక్తుల ధృఢ నమ్మకం.


🔯కుట్ట తీర్ధం ..ఈ తీర్ధం వ్యాధులను గుణపరిచే

శక్తి కలది.


🔯పొంగు తీర్ధం.. ఈ తీర్ధం సకల

శుభాలను కలిగించే శక్తి కలది. ఈ తీర్ధం చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్టించబడి వున్నాయి. 

అగస్త్య మహర్షి, నాగులు, 

నటరాజస్వామి, గరుత్మంతుడు,  మొదలైనవారి విగ్రహాలు

తీర్ధఘట్ట బండల మీద చెక్కబడి వున్నాయి. 

ఈ  తీర్ధం లో స్నానం చేస్తే ఆయా దేవతల  అనుగ్రహం 

లభిస్తుంది అని ఐహీకం. 


ఈ తీర్ధఘట్టానికి సమీపాన

అరుళ్మిగ పురుషోత్తమ పెరుమాళ్ ఆలయం వున్నది. 


అతివీరుడనే మహారాజు , 

గంగా తీరాన  పురుషోత్తమునికి ఆలయం

నిర్మించి ఆరాధిస్తూ వచ్చాడు.

ఆయన సకల సంపదలు కలిగి వున్నా 

సంతాన భాగ్యం మాత్రం కలుగలేదు. 

తన తరువాత పురుషోత్తముని ఎవరు పూజిస్తారని చింతిస్తూ

వుండేవాడు ఆ రాజు. 

ఆ రాజు చింతను తీర్చేందుకు శ్రీమన్నారాయణుడు

ఆ రాజు   స్వప్నంలో దర్శనమిచ్చాడు. 

" అతి వీరా ! చింతించకు. 

ఈ ఆలయ  గోపురం  నీడ ఎక్కడ పడుతుందో  అక్కడ గంగా, యమునా, సరస్వతీ

మూడు నదీదేవతలు 

మూడు తీర్ధాలుగా  అనుగ్రహిస్తారు. 

అక్కడే  నాకు ఒక ఆలయం 

నిర్మిస్తే  యుగాల పర్యంతం

నాకు పూజా నివేదనలు జరుగుతూనే వుంటాయి. " 

అని  చెప్పి అంతర్ధానమైనాడు.


పరవశంతో దేహం పులకించగా  రాజు

మేలుకొని  ఆలయగోపుర నీడ

పడే ప్రాంతం కోసం వెతికాడు. 

భగవంతుని లీల ! ఆలయగోపురం నీడ పొడవుగా

సాగుతూనే వున్నది. ఆ నీడ ఆలయం

వున్న ప్రాంతాన్ని దాటి  ఆఖరికి  తామ్రపర్ణి

తీరాన  వున్న అంబాసముద్రానికి చేరాక అక్కడ

ఆలయ గోపుర నీడను చూశాడు. ఆ ప్రాంతంలోనే వున్న

మూడు తీర్ధాలను చూశాడు.

భగవంతుని ఆనతి ప్రకారం ఆలయం నిర్మించాడు.


నిత్యారాధనలకు, పూజా పునస్కారాలకు  సకల ఏర్పాట్లు

చేశాడు.  మానవులే కాకుండా

దేవలోక అప్సర్సలు కూడా ఈ తీర్ధాలలో పుణ్య స్నానాలు చేసి అనుగ్రహం పొందినట్లు

స్ధలపురాణం తెలియచేస్తున్నది. 

యీ తీర్ధాలను క్రమం తప్పక  పునరుధ్ధరిస్తుంటే విరివిగా వర్షాలు కురిసి

పాడిపంటలు సమృద్ధిగా వుంటాయని తెలుపుతున్నది పురాణ కధ. ఈ మహిమలను గ్రహించిన  దాతలు , 

భక్తులు  ఈ తీర్ధాలను పునరుధ్ధరించారు. 

అంబాసముద్రానికి వచ్చే

భక్తులు ముందుగా యీ

ముక్కణ్డ తీర్ధంలో స్నానం చేయాలీ. పిదప  అరుళ్మిగు

కాశ్యపనాధుని ఆలయసమీపాన వున్న

తామ్రపర్ణి తీర్ధాలలో స్నానం చేయాలని అంటారు భక్తులు. 

కశ్యపనాధుడి  ఆలయ సమీపాన గల తామ్రపర్ణి

తీరంలో  దేవీ తీర్ధం, సాలతీర్ధం, దీప తీర్ధం, 

కశ్యపతీర్ధం, పుళుమారి తీర్ధం, కోకిల తీర్ధం అనే ఆరు తీర్ధాలు

వున్నవి. వాటిలో అదితి, సూర్య వంశస్ధులు 

ప్రమోదుడు, శివకర్మా,

కోయిల 

మొదలైనవారు ఆరాధించి

పునీతులైనారు.


ఈ తీర్ధాలలో స్నానం చేసి

అరుళ్మిగు కశ్యపనాధుని

పూజించి , తిరిగి ముక్కుణ్డ

తీర్ధానికి వచ్చి   విష్ణ్వాలయంలోని పురుషోత్తముని  పూజించాలి.

ఇందువలన సకలపాపాలు

తీరి పుణ్యం లభిస్తుంది అని

చెప్తారు.


ముక్కుణ్డ తీర్ధానికి గల

మరొక విశేషం  గురించి ఆ వూరి భక్తులు యిలా వివరించారు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat