మట్టి గణపతులనే తయారు చేయడం వెనక ముఖ్యమైన రహస్యాలెన్నో ఉన్నాయి!

P Madhav Kumar

 


*మట్టి వినాయకులనే 🙏🙏ఎందుకు పూజించాలి అంటే..

*మట్టిగణపతులనే* తయారుచేయడం వెనక ముఖ్యమైన రహస్యాలెన్నో  ఉన్నాయి.
1.  శ్రావణమాసం వర్షారంభకాలం కాలం కాబట్టి అంతకు ముందే చెరువులు, కాలవలు, కుంటలలోని మట్టిని తీసినందువల్ల పూడికతీత అంటూ వేరేగా చేయనవసరం లేదు. చక్కగా అవి బాగుపడి వర్షం పడ్డప్పుడు చక్కగా నీరు అందులో సమృద్ధిగా చేరుతుంది. నీటి కొరత రాకుండా ఉంటుంది.

2. వినాయకుడాని తయారుచేసి, ఆ మట్టి విగ్రహాన్నే మరల ఆయా నీటిప్రాంతాలలో కలిపితే ఆ మట్టి తిరిగి అక్కడికే చేరి, ఊబులవంటివి ఏర్పడకుండా బాగుంటాయి.

3. వినాయకుడికి అనేక రకములైన ఔషధీ మొక్కల పత్రాలతో(ఆకులతో) పూజచేస్తాం కాబట్టి అవి అన్నీ ఈ వర్షాకాలాలలో వచ్చే క్రిమకీటకాదులని చంపేసి; ఆ నీరు ప్రజలకి శుద్ధం గా అందించడానికి ఉపయోగపడతాయి అందులోనే నిమజ్జనం చేయడం వల్ల.

4.  మనం అంతా ఇపుడు water pollution అదీ ఇదీ అని అనుకుంటున్నాము. వేల సం. క్రితం ద్వాపర యుగం లోనే *కృష్ణ పరమాత్మ* water pollution ని ఖండించి నిర్మూలించాడు. కాళీయుడు తన ప్రాణ రక్షణకై కాళింది మడుగున దాగి, ఆపై అచటికి వచ్చే అన్ని ప్రాణులనీ హింసించాడు. అందుకే శిక్షగా ఆ మడుగునే ఖాళీచేసి ఎక్కడో గల సముద్రం లోని రమణక ద్వీపానికి పంపేశాడు. అదే ఇపుడు ఫిజీ ఐలెండ్

5. అంటే మన ఎవ్వరికీ *భగవత్ప్రసాదితం* అయిన నీటిని కాలుష్యం చేసే హక్కులేదు అని చాటిచెప్పాడు.

6. పంచభూతాలలో  ఒకటిగా చెప్పబడుతున్న నీరు ని శుద్ధి చేసే కార్యక్రమం ఆనాటినుండీ ఉంది.

7. మట్టి వినాయకుని తయారు చేయడం లో ఆంతర్యం ఇదే.

8. భగవంతుడు ఆడంబరాలకి, ఆర్భాటాలకీ అందడు. కేవలం మట్టి, పత్రి మున్నగు వాటితోనే ఆనందపడే అల్పసంతోషి. నీ శ్రద్ధ, భక్తే ముఖ్యం అని చెప్పకనే చెపుతాడు.

9. చెట్లనుండీ అనేకమైన పత్రాలను, కొమ్మలనూ తుంచడం ద్వారా తిరిగి అవి చక్కగా చిగురించి , చెట్లు హాయిగా , గబగబా పెరుగుతాయి అని కూడా అనుకోవచ్చు. ఓ విధమైన వృక్ష సంరక్షణే ఇలా పూజలో వాడటం అంటే.

10. నీటికీ, భూమికీ కూడా కలిపి పూజ చేయడమే ఇది. ఎందుకంటే జీవకోటి బ్రతకాలంటే ఇవి కూడా ముఖ్యమైన పంచభూతాలలో ఒకటి కదా. ముఖ్యంగా మట్టికి ప్రాణశక్తిని త్వరగా ఆవహించుకోగలగడం చాలా ఎక్కువ అట. గణపతి పృధ్వితత్వం కాబట్టి మనలో గల ప్రాణశక్తినే అక్కడ ఆవాహన రూపంలో స్వామిని ప్రతిష్టించి, మరల ఉద్వాసనద్వారా ఆ పరంజ్యోతిని మనలో సుస్థిర పరచుకోగలగడం. ఇవన్ని ఉపాసనా రహస్యాలు అని పెద్దలు, ముఖ్యంగా గణపతి పురాణంలో మనకి కనిపిస్తుంది. వ్యాసభగవానుడు రచించిన ఉప పురాణమైన గణేశ ఉపాసనా ఖండాన్ని తెలుగులో అత్యద్భుతంగా వివరించి, తెనుగించిన కీ.శే. శ్రీ పూడిపెద్ది లక్ష్మణమూర్తి గారి గణేశ పురాణంలో మనకి అనేక వివవరణలో తెలుస్తాయి.  

11. అగ్ని ఉందంటే దాన్ని శుద్ధి ఎలా మనం చేయగలం? చేయలేమే.

12. అదే వాయువు దగ్గరకి వచ్చేటప్పటికి భూమి, నీరు శుభ్రపడి, చెట్లు, చేమలు బాగుంటే ప్రత్యేకంగా ఏదీ చేయకుండగ్నే శుద్ధి చేయబడుతుంది.

13. ఇక ఆకాశం దగ్గరకి వచ్చినా ఇవన్ని దానికి వర్తంచి ఆకాశం స్వచ్ఛంగా ఉంటుంది.

14. ఇలా పంచభూతాలు చక్కగా ఉంటే *మానవుని* జీవకోటి అంతా *స్వచ్ఛంగా, సంతోషంగా బ్రతుకుతారు.

15. ఓ పండగ సాధారణంగా ఇంటిలో చేసుకుంటాం. లేదా బంధువులతో కలిపి చేస్తాం సంక్రాంతి లాంటిది మనం , మన కుటుంబ సభ్యులం అన్నంతవరకే పరిమితం.

16. అదే *వినాయకచవితి* అనేది ఎక్కువగా పందిళ్ళల్లో చేస్తారు. ఎందుకు అంటే మనలో సమైక్య భావం పెరగాలి అని.   తరతమభేదాలు మరచి, ఓ కార్యక్రమం  జరగాలి అంటే సమాజంలోని అన్ని వర్గాలవారు కలిసి నడిస్తేనే సాధ్యం. పందిళ్ళు వేయడం, తవ్వడం, ఏర్పాట్లు చేయడం, పూజలు చేయడం , పూలు, పత్రి తేవడం, సాంస్కృతిక కార్యక్రమాలద్వారా వారికీ ఉపాధి కల్పించడం, కష్టించిన మనసుకి భగవద్భక్తితో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించడం. చివరగా ప్రసాదాలు పంచడం ద్వారా  కొద్దిమేర అన్నార్తులని ఆదుకోవడం చేయగలం.  ఆపై ఆనందంగా, సంతోషంగా ఆడుతూ , పాడుతూ వినాయకుని తిరిగి ఆ ఊరిలోని నీటి వసతులలో నిమజ్జనం చేసి, మరల వినాయకచవితి దాకా ఈ ముచ్చట్లు చెప్పుకుంటూ జరిగిన లోపాలని సవరించుకుంటూ సమాజం పట్ల మనకి గల బాధ్యతని నెరవేర్చడం. అందరిని సమాదరించడం.
అందుకు మన పెద్దలు ఇవన్నీ ఆలోచించి మట్టివినాయకుడిని చేసి పూజలు చేయండి అని చాలా తేలికలో ఇన్ని గొప్పగొప్ప మాటలు మనకి అందించారు, ఆచరించి, మనల్నీ ఆచరించి భవిష్యత్తులో తరతరాలకీ అందించమన్నారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. ఇది నాకు తెలిసిన విషయం. నమస్సులతో, వినాయక చవితి శుభాకాంక్షలు ....

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat