శ్రీ రాఘవేంద్ర కల్పవృక్షము 10 వ భాగము

P Madhav Kumar


శ్రీవారు బదరికాశ్రమము నుండి దక్షిణదిక్కుగా ప్రయాణముచేసి అయోధ్య ను చేరి అచ్చోటనుండి బృందావనమును జేరిరి.


శ్రీకృష్ణభగవానుడు  దివ్య లీలలొనరించిన బృందా వనములో శ్రీవారు దివ్య మాధుర్యానుభూతి నొందిరి. బృందావనము నుండి కొల్హాపూరున కేతెంచి శ్రీమహాలక్ష్మి నారాధించి పండరి పురమును జేరిరి. పండరి పురములో పాండురంగ విఠలుని, శ్రీరఖుమాయిని దర్శించి సర్వమును విస్మరించి పరమానంద భరితుడై శ్రీస్వామి అఖండ భక్త్యావేశముతో నృత్య మొనరించిరి. పండరి పురమునుండి తిరుపతి క్షేత్రమునకు బయలుదేరి దారిలో ఆదోని యను గ్రామములో విడిదిచేసిరి.


ఆప్రదేశమును గాంచగనె శ్రీరాఘవేంద్రస్వామి ఒక దివ్యానుభూతిని పొందిరి. ఆయన సర్వజ్ఞుడు కావున ఆప్రదేశము    అత్యంత పవిత్రమనిగ్రహించి తీర్థ యాత్రానంతరము మరల

ఆప్రదేశమునకు రావల యునని నిర్ణయించుకొనిరి.



మోక్ష ప్రదాత:


శ్రీరాఘవేంద్ర స్వామికి వెంకన్నయను పరిచార కుడు కలడు. అతడు శ్రీవారికి మడితో పూజా సామగ్రిని సమకూర్చు చుండెడివాడు. సదా వెంటనుండి గురుదేవుని సేవించుచుండెడి వాడు. అతడు స్వామికి  అనన్య భక్తుడు. వానిపై శ్రీరాఘ వేంద్ర తీర్థస్వామి తన పూర్ణకృపను జూపెను. శ్రీవారికృప వలన వెంకన్న యొక్క సంచితాగామి ప్రారబ్ధకర్మములు నశిం చెను. శ్రీరాఘవేంద్రస్వామి తీర్థయాత్రల నొనరించుచు చిత్రదుర్గ ప్రాంతమునకు చేరెను.


శిష్యునికర్మ నిర్మూలన మైనదని గ్రహించి శ్రీ రాఘవేంద్రతీర్థ స్వామి వరమును కోరవలసినదిగా పలికిరి. అందులకు వెంకన్న జననమరణ చక్రములనుండి విముక్తిని, పరంధామప్రాప్తిని కోరు కొనెను. అపుడు శ్రీవారు ఒక అగ్ని కుండము నిర్మింపవలసినదిగా శిష్యులను ఆజ్ఞాపించిరి. వెంకన్నకు స్వామి మోక్షము నొసంగబోవు చున్నారని తెలిసికొని యీ విచిత్రమును గాంచుటకు చిత్రదుర్గ  వాసులందఱు సమావేశమైరి. ప్రజలoదఱి సమక్షమున అగ్నికుండము ప్రజ్వలింపచేయబడెను. శ్రీవారు వెంకన్నను ఆశీర్వదించి అగ్నిప్రవేశ మొనరింపవలసినదిగా ఆజ్ఞాపించిరి. ఆ అనన్య భక్తుడు కించిన్మాత్రమై నను చలింపక భయము నొందక గురు దేవునకు, అగ్ని గుండమునకు ప్రదక్షిణ మొనరించి ప్రజలందఱు చూచుచుం డగ అగ్ని ప్రవేశము చేసెను.


పాంచభౌతిక శరీరము నశించి వానికి దివ్య దేహము సంప్రాప్తించెను. దివ్యలోకముల నుండి విమానమరుదెంచగా వెంకన్న దానినధిరోహించి శ్రీభగవన్నామ సంకీర్తన మొనరించుచు పరంధా మమునకు వెడలి పోయెను. ఈ యద్భుత మును గాంచి ప్రజలందఱు శ్రీవారిని అనేక.  విధముల

నుతించిరి. శ్రీ రాఘవేంద్ర తీర్థస్వామి ధర్మార్థకామ మోక్ష ప్రదాత యని యందఱు విశ్వసించిరి.


శ్రీరాఘవేంద్రా! సకలజనుల సమక్షములో యోగ్యుడైన భక్తునకు మోక్షము నొసంగితివి. ప్రహ్లాదునకు సహ్లాదుడను సోదరుడు కలడు. అతడు శ్రీజగన్నాథ దాసునిగ జన్మించెను. ఆయన శ్రీ రాఘవేంద్రతీర్థ స్వామికి భక్తుడయ్యెను. ఆమహానుభావుడు శ్రీ రాఘవేంద్రతీర్ధ స్వామి లీలలను కన్నడ భాషలో అనేక విధముల ప్రస్తుతించెను. వెంకన్నకు మోక్షమిచ్చిన సంఘటనను ఆయన వివరము   గా వర్ణించెను.


జల నిర్మాణము:


శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి తీర్థయాత్రల నొనరించుచు మహారాష్ట్ర ప్రాంతములోని పండరీపురమును చేరి శ్రీపాండు రంగని దర్శించిరి. భగవంతుననేక విధముల స్తుతించి ఆరాధించి ఆ ప్రదేశమునుండి ఉత్తరదిశ గా బయలు దేరిరి. మార్గములో ఒక యెడారి ప్రాంతము కలదు. అది గ్రీష్మ ఋతువు. సూర్యుడు చండప్రచండుడై ప్రకాశిం చుచుండెను. కొన్ని యోజనముల పర్యంతము వృక్షములు కాని, జలాశయములు కాని లేవు. శ్రీవారిశిష్యులు  తమవెంట తెచ్చినజలము కూడ పరిసమాప్త మయ్యెను. శ్రీ రాఘ వేంద్ర తీర్థస్వామి పరిచారకులలో పరమభక్తుడగు నొక హరిజనుడు కలడు.


అతడు గర్భవతిగనున్న తనభార్యచే తీర్థయాత్ర లను చేయింపవలె నని యామెను వెంట నిడుకొని వచ్చెను. పూర్ణ గర్భవతి యగు ఆమెకు ఆ యెడారిలో ప్రసవసమయ మాసన్న మయ్యెను. దాపులలో నీడకాని, జలములు కాని లేవు. నొప్పులుపడుచున్న ఆమెకు మరణము తథ్యమని యందఱు తలపోయు చుండిరి.  ఆమెభర్త కల్పవృక్ష స్వరూ పుడగు శ్రీరాఘవేంద్ర స్వామిని తన భార్యను రక్షింప వలసినదిగా ప్రార్థించెను. వెంటనే శ్రీవారు తనదండముతో భూమిపై చక్రాకారముగ రేఖను నిర్మించి మధ్యలో దండముతో మోదిరి. ఆక్షణమందే పాతాళగంగ ఆవిర్భవించి ఒక జలాశయముగ మారెను. ఎట్టి యాధారము లేకయే ఆకాశమందు తన కాషాయ వస్త్రమును నిలిపి ఆస్త్రీకి నీడను కల్పించిరి. గురుదేవుని యనుగ్రహ విశేషముచే ఆ స్త్రీకి సుఖ ప్రసవము కాగా ఆమె చక్కని కుమారుని కనెను. 


పతితోద్ధరణము:


శ్రీ రాఘవేంద్రతీర్థస్వామి తంజావూరు నుండి మఱియొక మారు తీర్థయాత్రలకు బయలు దేరెను. అనేక పుణ్య క్షేత్రములను దర్శించుచు తామ్రపర్ణి  నదీతీరమున నున్న 'కల్లడకురిచి' యను గ్రామమున కేతెంచిరి. ఆ  గ్రామములో ఒక బ్రాహ్మణుడు కలడు.  ఆ  బ్రాహ్మణు డొనరించిన పాపములకు గ్రామ వాసులాతనిని పతితునిగ నిర్ణయించి బహిష్కరించిరి.


దుర్విధి విశేషముచే పాప మొనరించి సంఘబహి ష్కృతు డైన ఆతడు పశ్చాత్తాపమును బొందెను. తానొనరించిన పాపముల నుండి విముక్తి పొంద వలెనని సంకల్పించు కొనెను. పతితపావనుడైన శ్రీ రాఘవేంద్రతీర్థ స్వామి సపరివారముగ తన గ్రామమున కేతెంచెనని తెలియగనే ఆబ్రాహ్మణుడు పరుగుపరుగున పోయి శ్రీవారికి సాష్టాంగ దండ ప్రణామముల నాచరిం చెను. ఆసభలో తానొన రచించిన దుష్కృత్యము లను విన్నవించుకొనెను. పశ్చాత్తాపముతో విషణ్ణ వదనుడై తనను రక్షింపవలసినదిగా శ్రీవారిని శరణువేడెను. నదీజలము లలో స్నానమాచరించి శుద్ధుడవై పూజా సమయ మునకు రావలసినది అని  ఆ పతిత బ్రాహ్మణుని శ్రీవారాదేశించిరి. ఆతడట్లే మరునాడు పూజాసమయ మున కరుదెంచెను.


శ్రీరాఘవేంద్రతీర్థస్వామి వానిపై శంఖ తోయము లను జల్లి మంత్రాక్షతల నొసంగిరి. తనపంక్తిలో భోజన మొసంగి ఆ పతితుని పావనునిగ నొనరించిరి. ఆ బ్రాహ్మణుని పాపములు  అన్నియు నశింపగా ఆతడు  స్వామి యనుగ్రహ.    విశేషముచే

ఉద్ధరింపబడెను. ఈ సంఘటనను గాంచి ఆ గ్రామవాసుల, తుదకు శ్రీవారిశిష్యులు పలువిధ ముల భావింప నారంభిం చిరి. అపరోక్ష జ్ఞానులైన శ్రీరాఘవేంద్రతీర్థ స్వామి వారి మనోభావములను గ్రహించిరి. 


మరునాడు శ్రీవారు ఒక స్వచ్ఛమగు తెల్లని వస్త్రమును తెప్పించి దానిని జీడిమామిడి రసములో నుంచిరి. ఆ వస్త్రము కారు నలుపుగా మారెను. అందరు చూచు చుండగా శ్రీస్వామి దానిపై శంఖోదకమును జల్లగా అది మఱల శుద్ధమై తెల్లగ మారిపోయెను. ఈ లీలను గాంచి శంకించిన వారంద ఱును పరమాశ్చర్య చకితులైరి. శ్రీవారు నిజముగ పతితపావను లని వారు ప్రస్తుతించిరి.


శ్రీరాఘవేంద్రతీర్థ స్వామి ఆప్రదేశములో సమావేశమై యున్న ప్రజలను గాంచి ఇట్లుపలికెను. "ప్రజలారా ప్రతిమానప్పుడు తెలిసి యో తెలికయో పాపముల నొనరించును. మానవు లొనరించు ఈ మహాపాతక ములకు వారిని శిక్షింపవలె నన్నచో భగవంతుడు క్షణమున కొక ప్రళయము ను సృష్టించినను వారి పాపములు నశింపవు. కాని భగవంతుడు దయామయుడు, పతిత పావనుడు. ఆయన శిలగా మారిన అహల్యను ఉద్ధరించెను. పరమ పాపాత్ముడగు అజామీళుని రక్షించెను.


బ్రాహ్మణవంశములో జన్మించి చండాలస్త్రీ మోహమునబడి అనేక దుష్కృత్యము లొనరించి తుదకు పశ్చాత్తప్త చిత్తుడై  వేంకటగిరిని జేరిన మాధవుని అనుగ్రహిం చెను. కావున దేహ ధారు లారా! పశ్చాత్తాపమువలన మానవుడు తానొనరించిన పాపములలో అర్థభాగము ను నశింపజేసికొనగలడు. మిగిలిన పాపములో అర్థభాగము ఇతరులకు జెప్పి తన దోషములను 

అంగీకరించినచో నశిం చును. మిగిలినపాపము సత్పురుషుల కరుణవలన తొలగిపోవును. అతడు పాపరహితుడగును. పశ్చాత్తప్తహృదయుడై తా నొనరించిన దుష్కృత్యము లను అందఱియెదుట అంగీకరించిన వానిని దూషించినచో వాని పాపములు దూషించిన వానిని ఆశ్రయించును. కావున పర దూషణము పాపహేతువని గ్రహించి మెలగుట అత్యుత్తమ ము”. శ్రీవారు పల్కిన అమృతోపమానములైన ఉపదేశముల నాలకించి అందఱు తామొనరించిన దానికి పశ్చాత్తప్తులైరి. తామిక పరదూషణ మొనరింపక సన్మార్గమున చరించెదమని శ్రీరాఘ వేంద్రతీర్థస్వామి సమీక్ష మున బాసచేసి చరితా ర్థులైరి.


మూకం కరోతివాచాలం:


ఎవరికృపా ప్రభావముచే బాలుడైనను అబోధవ్యక్తి యైనను నానావిధమత మతాంతరములనెడు గ్రహముల (తిమింగల ముల)తో నిండియున్న సిద్ధాంతరూప సముద్రము ను అవలీలగా తరింపగలడో, అట్టి శ్రీ రాఘవేంద్రతీర్థస్వామికి నమస్కరించెదను.


ఎవనికృపచే శాస్త్రజ్ఞాన విహీనుడైన మూర్ఖుడు కూడ ఆయన తత్వమును నిర్ణయింపగలడో, ఆ అద్భుతకర్ముడైన  శ్రీ రాఘ వేంద్రతీర్థ స్వామికి నమస్కరించెదను.


తం శ్రీగురురాఘవేంద్ర దేవం వన్దే జగద్గురుమ్ |

యస్యానుకమ్పయా శ్వాప  మహాబ్ధిం సంతరేత్ సుఖమ్I


ఎవనికృపచే క్షుద్రశ్వానము (కుక్క)కూడ అనాయాస ముగ మహాసముద్రమును తరింపగలదో, అట్టి శ్రీ రాఘవేంద్రతీర్థ స్వామికి నేను నమస్కరించెదను.


అనగా క్షుద్ర దేహధారి యైనను శ్రీవారియనుగ్రహ మునకు పాత్రుడైన మహాసాగర సదృశమైన యీసంసారము నవలీలగ తరింపగలడని భావము.


ఆదోని చెంత కందనాతి యను ఒక కుగ్రామము కలదు. ఆ గ్రామములో వెంకన్న యను ఒక అనాథ బాలకుడు తనమేనమామ ఆశ్రయములో నివసించు చుండెను. ఆ మేన మామ వ్యవసాయదారుడు కావున వానిచెంత పశు సంపద కలదు. అతడు వెంకన్నను పశువుల కాపరిగా నియమించి అందులకు ప్రతిఫలముగ ఆహారము, వస్త్రములు, నివసించుటకు ప్రదేశము వానికి యిచ్చెను. జన్మచేత  బ్రాహ్మణుడైనను వెంకన్న విద్యాభ్యాసమునకు నోచు కొనక పశువుల కాపరిగా జీవించుచుండెను.


ప్రతిదినము ఉదయమున పశువులనులు తోలుకొని తోటి పశువుల కాపరులతో గలసి అరణ్యమునకుజని సాయంసమయము వరకు పశువులను సంరక్షించి గ్రామమునకు తిరిగి వచ్చుట వెంకన్న దినచర్య అయ్యెను. పశువుల కాపరులలో వెంకన్న యొక్కడే బ్రాహ్మణుడు. తనకు ఉపనయన సంస్కారము జరిగినను విద్యనభ్యసింప లేక పోయితినని ఆ బాలకుడు ఎంతయో చింతించి, గురుకులమునకు బోవు టకు తనకు అనుజ్ఞ  నీయ వలసినదిగ మేనమామ నర్ధించెను. కానీ ఆ స్వార్ధపరుడు  బాలకుని జిజ్ఞాసను గ్రహింపక అనేక విధములు నిందించి పశువులకాపరిగనే శేష జీవితము గడుపుమని నిర్దేశించెను. తన దౌర్భాగ్య మునకు అనేకవిధముల దుఃఖించి మనస్సును రాయి చేసికొని ఆ బాలుడు తన విధులను నిర్వర్తింప దొడగెను.


ఒకదినమున వెంకన్న గోగణములను ఆహారము నకై అరణ్యములో విడిచి తనతోటి గోపబాలకులతో గలసి అనేక క్రీడల నొనరించి, చల్దుల నారగించి అపరాహ్నము కాగా ఒక విశాలమైన వటవృక్షచ్ఛాయలో మైమరచి నిదురించెను. సూర్యుడు అస్తాచలము వైపు పయనించు చుండగ బాలకునిపైగల వృక్ష చ్ఛాయ తొలగిపోయెను. ఆ వట వృక్షము యొక్క తొఱ్ఱలో ఒక మహాసర్పము నివసించు చుండెను. ఆసర్పరాజు తనబిలము ను విడచి వెంకన్న చెంత కఱుదెంచి యతనికి భానుని కిరణములు సోకకుండ తన విశాల ఫణమును విప్పిపట్టెను.  గోపబాలకులు  ఆ విచిత్ర మును గాంచి పరమాశ్చర్య చకితులై పరుగుపరుగున గ్రామమున కఱుదెంచి జరిగిన యద్భుత విషయమును గ్రామస్థుల కు దెలియబఱచిరి. వెంకన్న మేనమామ, తదితర గ్రామస్థులందరు అరణ్యమున కఱుదెంచి సర్పము వెంకన్న శిరము చెంత ఫణమునువిప్పి యాడుట గాంచి అచ్చెరువందిరి. 


నాటినుండి మేనమామ, ఇతరగ్రామస్థులు వెంకన్న సామాన్యుడు కాడని, మహోన్నతపదవి నొందగల డని గ్రహించి ప్రేమించి, వానిని ఆదరింప నారంభించిరి.


ఆదోనిలో శ్రీరాఘవేంద్రతీర్థ స్వామియను యతీంద్రులు వేంచేసి యున్నారని, ఆయన ఘటనాఘటన సమర్థుడని, దివ్యశక్తి సమన్వితుడని తెలిసికొని వెంకన్న శ్రీవారి దర్శనార్థమై పరుగు పరుగున ఆదోని చేరెను. ఆ బాలకుడు  స్వామి వారి విడిదిని ప్రవేశించి శ్రీవారికి అనన్య భక్తిశ్రద్ధలతో సాష్టాంగ దండ ప్రణామ మాచరించెను. శ్రీ రాఘవేంద్రతీర్థ స్వామి తన పాదముల నాశ్రయించిన బాలకునిలేవనెత్తి ముఖావ లోకన మాత్రముననే యితడు ఉత్కృష్ట భవిష్యత్తు గల బాలకుడని భావించి ‘నాయనా! నీ మనోవాంఛితమును దెల్పు' మని పల్కెను. అందుల కాబాలకుడు 'పూజ్యగురు దేవా! నేను విద్యాగంధము లేని పశులకాపరిని. తల్లిదండ్రు లు లేని అనాథను. ఉపనయనసంస్కారమును పొందియు విద్యాభ్యాస మునకు నోచుకొనని అభాగ్యుడను. విద్యల నభ్యసింప వలయునను ప్రగాఢకాంక్ష నాకు కలదు. మహానుభావా! నాకు విద్యాభిక్ష నొసంగి నన్ననుగ్రహింపు' డని ప్రార్థించెను. బాలకుని వినయమునకు భక్తికి శ్రీవారు   అత్యంత ప్రసన్నుడై శ్రీకృష్ణార్పిత మంత్రాక్షతలను వెంకన్న శిరముపై నుంచి ‘వత్సా! నిన్నాశీర్వదించుచున్నాను. నాయనుగ్రహమున నీవు ఏకసంధాగ్రాహివై అవలీలగ విద్యలనభ్యసింపగలవు. నీకే కష్టములు సంభవిం చినను నన్ను స్మరింపుము, శ్రీకృష్ణ భగవానుని స్మరింపు" మని అనుగ్రహించెను. 


మహాత్ముని యనుగ్రహము నకు పాత్రుడై అత్యంత సంతుష్టుడై వెంకన్న తిరిగి స్వగ్రామమునకు వెడలెను.


శ్రీ గురు రాఘవేంద్ర

*****

శ్రీ రాఘవేంద్ర 

కల్పవృక్షము

10 వ భాగము  

సమాప్తము.** 

💥💥💥💥💥💥

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat