సిరంగి దేశాయి:
శ్రీ రాఘవేంద్రతీర్థస్వామి వేదధర్మములను ప్రచార మొనరించుచు నాస్తికు లను పరాజయమొన రించుచు దేశమంతయు భగవద్భక్తిని ప్రచార మొన రించుచుండెను. ధార్వాడ్ ప్రాంతములో సిరంగి యనుగ్రామము కలదు. ఆగ్రామములో దేశాయి యను మహాపండితుడు కలడు. అతడు నాస్తికుడు.
దైవమునందు, వేదము లందు విశ్వాసము లేని వాడు. అతడు వేదములు అసత్యములని, మంత్ర ములు, ఆరాధనలు, పూజలు ఉదరపోషణా ర్థమై అగ్రకులములవారు సృష్టించి అమాయకులను మోసముచేయుచున్నారని ప్రచార మొనరింపసాగెను. మహాత్ములొనరించు అద్భుతములగు లీలలను గారడివాని విద్యలని అవహేళనమొనరించు చుండెను. వాని దుష్ప్రచా రమునకు కొందఱు మూర్ఖులు బాసటగా నిలచి సజ్జనులగు ధార్మికులను అవమానింపదొడంగిరి.
దేశాయి తన్నెదిరించు వారందఱిని వేదమంత్ర శక్తితో రోకలి బండను చిగురింపచేసినచో, నేను వేదమంత్రములను, భగ వంతుని విశ్వసించెదనని, అట్లొనరింప లేనివారు నాస్తికులు కావలయునని సవాలు చేయుచుండెను. తన గృహ ప్రాంగణములో ఒకరోకలి బండనుపాతెను. ఎందఱో ఆస్తికులు రోకలి బండను చిగురింపజేయు టకు ప్రయత్నించి విఫలులైరి. సమాజము నకు ఈ విషయము అవమానకర మయ్యెను.
ఈ పనిచేయగల సమర్థు డెవ్వరని చర్చించుకొని వారు శ్రీరాఘవేంద్రతీర్థ స్వామి నాశ్రయించిరి. వేదమంత్రముల యొక్క మహిమను ప్రకటించి ప్రజలయుదు దైవముపై విశ్వాసమును పెంచవల యునని దేశాయిని ఉద్ధరిం చుటకు శ్రీవారు సంక ల్పించెను.
శ్రీ రాఘవేంద్రతీర్థస్వామి భక్తజనులు వెంటరాగా సిరంగిలో దేశాయి యేర్పాటుచేసిన రోకలి కడకేతెంచిరి. దివ్య వేద మంత్రములు నుచ్ఛరించు చు తన కమండలములోని మంత్ర జలములను రోకలిపై చల్లగా అది ఆ క్షణమందే చిగురించెను. ఈయద్భుతమును గాంచి ప్రజలందఱు శ్రీవారి మహిమలను అనేక విధముల ప్రస్తుతించిరి. నాస్తికుడైన దేశాయి తన యధర్మప్రవర్తనమునకు పశ్చాత్తప్త హృదయుడై శ్రీవారి చరణారవిందముల నాశ్రయించెను. దేశాయి యనుచరులైన నాస్తికులు అందఱు ఆస్తికులుగ మారిపోయిరి. శ్రీవారు దేశాయిని తనశిష్యునిగ అనుగ్రహించిరి.
శ్రీ వారి తీర్థయాత్రలు:
శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి తన మఠపరివారముతో గూడి కుంభకోణము నుండి బయలుదేరి భారత దేశములో గల పవిత్ర తీర్థములను దర్శించి హిమాలయములనుండి కన్యాకుమారివఱకు గల పుణ్యనదీజలములలో స్నానమాచరించిరి. వారే ప్రదేశమున విడిది చేసినను అచట సభల నేర్పరచి ప్రజలకు వారి ద్వైత సిద్ధాంతమును ప్రబోధించుచుండిరి. శ్రీవారి పాండిత్యమమోఘము, తత్వనిరూపణ మత్యంత మనోహరము. వారి సభ లకు వేలకొలదిగ భక్తులు ఏతెంచి ద్వైత సిద్ధాంతము యొక్క ఉత్కృష్టతను శ్రీవారి ఉపన్యాసముల ద్వారమున దెలిసికొని పరమానంద భరితుల య్యెడివారు. శ్రీవారి యమృత వచనముల నాలకించినవారు ఏ సిద్ధాంతము వారైనను ద్వైతసిద్ధాంతమును మనః పూర్వకముగ యథార్థ మని అంగీకరించెడివారు.
శ్రీరాఘవేంద్ర స్వామి ఆశ్రమములోనున్నను, తీర్థయాత్రల యందున్నను విధిగా సన్న్యాసాశ్రమ ధర్మముల నన్నింటినీ ఆచరించెడివారు. ప్రతి దినము కొంత కాలమును తపమునకు, మఱికొంత కాలము సన్న్యాసాశ్రమ విధులకు, మిగిలిన కాలమునంతటిని ద్వైత సిద్ధాంత గ్రంథముల రచనలో శ్రీవారు గడిపెడి వారు. శ్రీవారు ఏబది యేడు సంవత్సరములు సర్వజ్ఞ పీఠాధిపతిగా విరాజిల్లిరి. వారు ఆ కాలములో అసంఖ్యాక ముగ ద్వైతసిద్ధాంత ప్రబోధకములైన గ్రంథము లను నిర్మించిరి. వానిలో కొన్ని గ్రంథములు మాత్రమే నేడు లభ్యమగుచున్నవి. శ్రీ రాఘవేంద్రతీర్థ స్వామి తమ ఆధ్యాత్మికశక్తితో ఆశీర్వాదబలముతో తన్ను దర్శించినవారి హృదయ ములను జయించెడివారు. శ్రీవారిని దర్శించినంత మాత్రముననే ప్రజలు ఆయనకు భక్తులయ్యెడి వారు, పరమ శాంతిని పొంది బ్రహ్మానందమును పొందెడి వారు.
ఎందరో శాసకులు జాగీరు లను, ధనవంతులు ధన కనకవస్తు వాహనములను శ్రీవారికర్పించిరి. కాని ఆ విరాగి వాటిని అన్నింటిని స్వీకరింపక మఠమునకు సంక్రమింపజేసిరి. ఒక మాఱు శ్రీస్వామివారు తీర్థయాత్రా సమయమున భిల్లపురి యను గ్రామము లో విడిది చేసిరి. ఆగ్రామ ములోనే నివసించుచున్న భైరవభట్టు, వీరభద్రభట్టు అను ఇరువురు ఉద్దండ పండితులు స్వామిని శాస్త్రార్థమై ఆహ్వానించిరి. ఓడినవారు విజయులకు తమ సర్వస్వమును అర్పించి శిష్యులు కావలయునని షరతు విధించిరి. శ్రీరాఘవేంద్ర స్వామి చిరునవ్వుతో వారికోరిక నంగీకరించి శాస్త్రచర్చార్థమై వారేర్పర చిన సభను ప్రవేశించిరి.
ఆసభలో సుదూరగ్రామము లనుండి అసంఖ్యాకముగ జనులు వచ్చిరి. వారిలో పండితులు, ధనాఢ్యులు, రాజ్యాధికారులు కూడ కలరు. పీఠాధిపతి యైన పిదప శ్రీవారికి యెదురైన మొదటి శాస్త్రార్థచర్చ యిది. ఆ ఇరువురు పండితులు ఉద్దండులు. వారిని జయించుట యెవరికైనను అత్యంత కష్టమే. ఇరుపక్షముల వారికి అనేక దినముల పర్యంతము వాగ్వివాదము జరిగెను. ఎవరికివారు తమ సిద్ధాంతములను అత్యంత దృఢముగ ప్రతిపాదించిరి. ఎట్ట కేలకు ఆయిర్వురు పండితులు ద్వైతసిద్ధాంతమే సరియైన దని అంగీకరించి తమ జాగీరులను, ధనమును శ్రీవారికర్పించి శిష్యులైరి.
నాటినుండి భిల్లపురి జాగీరు సర్వజ్ఞ పీఠమునకు జెందెను. శ్రీరాఘవేంద్ర స్వామి దివ్యత్వము దేశమంతట ప్రచారమగు టకు ఈవిజయము దోహదమొనరించినది.
భిల్లపురి నుండి శ్రీరాఘ వేంద్ర తీర్థస్వామి తనపరి వారముతో అరుణా చలము, మథుర, వేదాచలము, శ్రీరంగము మొదలగు పుణ్యక్షేత్రము లను దర్శించుచు కన్యాకుమారిని చేరెను. ఆ పవిత్ర ప్రదేశములో శ్రీస్వామి కొంత కాలము కఠోర తపమాచరించిరి. కన్యాకుమారినుండి పశ్చిమసముద్ర తీర మార్గమున పయనించుచు శ్రీ రాఘవేంద్రతీర్థస్వామి శ్రీమధ్వాచార్యుల జన్మస్థల మైన ఉడిపి క్షేత్రమును జేరిరి. ఆ దివ్య క్షేత్రములో స్వామి ఒకసంవత్సరము నివసించి శ్రీకృష్ణుని నవవిధభక్తుల ద్వారమున ఆరాధించిరి. ప్రతిదినము శ్రీవారు ఉదయమున మధ్వ సరోవరములో స్నానమాచరించి శ్రీకృష్ణుని దర్శించి హరినామ సంకీ ర్తనము నొనరించి అనంతేశ్వరాలయమున కేతెంచెడినారు.
శ్రీమధ్వాచార్యులవారు ప్రతిదినము అనంతేశ్వరా లయము లోనే తమ ప్రసంగములను నిర్వహిం చెడివారు. ఆ జగద్గురువు ప్రవచనములను నిర్వహిం చిన ప్రదేశమున కెదురుగా నున్న ప్రదేశములోనే శ్రీరాఘవేంద్ర స్వామి మధ్వ సిద్ధాంతమును ప్రవచించెడి వారు. ఆసభ కొన్ని గంటల కాలము కొనసాగెడిది. అసంఖ్యాకముగ ప్రజలు ఆ సభకు విచ్చేసి శ్రీవారి యుపన్యాసామృతము నాస్వాదించెడినారు.
శ్రీస్వామి ఉడిపిక్షేత్రములో నివసించినపుడు అచ్చోట ఒక ఆశ్రమము నిర్వ హించిరి. శ్రీమధ్వాచార్యుల వారు నిర్మించిన అష్ట మఠముల పీఠాధీశ్వరులు శ్రీరాఘవేంద్ర స్వామిని పరమభాగవతోత్తమునిగ గుర్తించి గౌరవించిరి. శ్రీస్వామి నిజమైనసన్యాసి యని, శ్రీవాదిరాజస్వామి తదనంతరము అంతటి వాడులేడనియు, జప తపాదులలో అద్వితీయు డనియు, సతతము భగవదారాధనా రక్తుడని యు దివ్యపురుషుడనియు సార్థక జన్ముడనియు, దివ్యశక్తి సమన్వితు డనియు, ద్వైతసిద్ధాంత ప్రచారకులలో అగ్రగణ్యుడు అనియు వేనోళ్ళ కీర్తించిరి. శ్రీవారు తమగ్రంథములలో ద్వైత సిద్ధాంతమే అత్యుత్తమమని ప్రతిపా దించిరి. వారి గ్రంథము లను పఠించినంత మాత్రముననే దేహధారు లు 'ద్వైత సిద్ధాంతాను యాయులయ్యెదరు
శ్రీ రాఘవేంద్రతీర్థస్వామికి ప్రతిదినము శ్రీమధ్వాచార్య నిర్మితములైన అష్టమఠ ములలో ఆయన మంత్రముతో నేటికిని వందనసమర్పణ మాచరిం చుచుందురు. శ్రీవారి మంత్రోచ్ఛారణము ద్వైత సిద్ధాంతాను యాయులకు పరమ కర్తవ్యమయ్యెను.
ప్రతినిత్యము వారు శ్రీవారి ని ఈశ్లోకముతో ప్రార్థించు చుందురు.
శ్లో॥ పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ |
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ॥
తా॥ పూజింప దగిన వాడును, సత్య ధర్మముల యందాసక్తి గలవాడును, భక్తితో సేవించువారికి కల్పవృక్షము వంటి వాడును ప్రపత్తితో నమస్కరించువారికి కామధేనువువంటి వాడునునగు శ్రీరాఘవేంద్ర స్వామికి నమస్కారము.
పై శ్లోకమును పఠించు నాచారము శ్రీమధ్వాశ్రమ ములలో నేటికిని విధిగా పాటింపబడుచున్నది. తన దివ్యశక్తిచే సర్వుల హృదయములను జయించినవాడు శ్రీరాఘవేంద్ర యతీంద్రుడు.
శ్రీవారు ఉడిపి క్షేత్రము నుండి బయలు దేరి మైసూరు రాజ్యమున ప్రవేశించిరి. ఆరాజ్యములో గల. పుణ్యక్షేత్రముల
నన్నింటిని దర్శించుచు, పవిత్రతీర్థస్నానము ఆచ రించుచు శ్రీవారు శ్రీహరి హరేశ్వరుడు విరాజిల్లి యున్న హరిహర క్షేత్రమునుజేరిరి. తన మనో వాక్కాయకర్మలచే శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి హరిహరేశ్వరు నారాధించి శ్రీజయతీర్థ స్వాముల వారి బృందావన ప్రదేశమును జేరిరి. ఈస్వామియే శ్రీ టీకాచార్యునిగ ప్రసిద్ధి గాంచిన పరమభాగవతో త్తముడు. వీరి బృందా వనము మళఖేడ (మాన్యకటకము) యను గ్రామములో నున్నది. ఈ గ్రామము గుల్బర్గానగర మునకు చేరువలో నున్నది. ఆపవిత్ర ప్రదేశములో శ్రీతీర్థులవారు కొన్నిదినములు ఆగి అనుభాష్యమునకు భాష్యమును రచించిరి. దక్షిణాపథములో తీర్థ యాత్రను ముగించుకొని శ్రీవారు ఉత్తరదేశయాత్రను ప్రారంభించిరి. మొదట కాశీ విశ్వేశ్వరుని దర్శించి గయాప్రయాగతీర్థ సందర్శ నము చేసి శ్రీవారు నేరుగా బదరికాశ్రమము నకు జేరిరి.
ఈ పవిత్ర క్షేత్రములో శ్రీరాఘవేంద్రతీర్థ స్వామి శ్రీమధ్వాచార్యుని, శ్రీ వేద వ్యాసుని సాక్షాత్తుగా దర్శించిరి.
మహాపురుషు లిర్వురు శ్రీస్వామికి తమదివ్య దర్శనమును ప్రసాదించి ఆయన పూజలనొంది అనేకవరముల నొసంగి ఆశీర్వదించి అదృశ్యులైరి.
శ్రీ గురు రాఘవేంద్ర
*****
శ్రీ రాఘవేంద్ర
కల్పవృక్షము
9 వ భాగము
సమాప్తము.**
💥💥