మఱునాడు శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి తన పరివార ముతో బయలు దేరి తిరుపతి నగరమును జేరిరి. పాదచారులై ఏడుకొండలు నధిగమించి తిరుమలచేరి శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహమును కన్నులకరవుదీర దర్శించి పరమానంద భరితులైరి. కొంతకాలము ఆ పవిత్ర ప్రదేశములోనే నివసించి శ్రీవారు తనివి దీర శ్రీ వేంకటేశ్వరు నారాధించిరి. తిరుపతిలో ఒకయాశ్రమ మును నిర్మించి శ్రీవారు కాళహస్తి, కంచి మొదలగు దివ్యక్షేత్రముల నన్నింటిని దర్శించిరి. తదనంతరము కుంభకోణమునకు మరలి వచ్చి కొన్ని సంవత్సర ములు ఆశ్రమములోనే నివసించిరి. వారు ఒక చోటనే చాలకాలముండు టకు గల పరమార్థ మేమనగా శ్రీవారి వాయు
తత్వ నిరూపకమైన ద్వైత మహాగ్రంథ నిర్మాణమే. శ్రీవారు అసంఖ్యాకముగ దివ్యగ్రంథములను రచించిరి. మనకు నలుబది యెనిమిది (48) గ్రంథములు మాత్రమే ఉపలబ్ధములైనవి. కొన్ని మాత్రమే ముద్రితములు కాగా పెక్కు గ్రంథములు అముద్రితములుగ మిగిలి పోయినవి.
పశువులకాపరి అమాత్యు డైన విధము:
శ్రీరాఘవేంద్రతీర్థస్వామి కొన్ని సంవత్సరములు కుంభకోణమున గల ఆశ్రమములో నుండి అనేక గ్రంథములను రచించిరి. ఆకాలములోనే తంజా వూరు ప్రభువైన శ్రీ రఘు నాథరాయలు మరణిం చెను. ఆయనపుత్రుడు పరిపాలనాదక్షుడు కాక పోవుటయేకాక అత్యంత బలహీనుడునై యుండెను. హిందువులకు, మహమ్మదీ యులకు తరచుయుద్ధము లు సంభవించుచుండెడివి. అంతియేగాక ఉత్తరదేశ ప్రభువులు కూడ అకాలములో దిగ్విజయ మును గాంక్షించి దక్షిణ దేశముపై దండయాత్రలను జరుపు చుండెడివారు. మహమ్మదీయుల ప్రాబల్యము అంతకంతకు అభివృద్ధి చెంది హిందూ మఠములు అత్యంత ప్రమాదమునకు లోనైనవి. కావున శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి కుంభకోణము ను వీడి దూరముగ పోవలయునని సంకల్పిం చిరి. వారి మనములో ఆదోని, దాని పరిసర ప్రాంతములు ఆశ్రమము నకు అనువగు స్థలము లని సంకల్పము కలిగెను.
ఇది యిట్లుండగా విజయ నగర సామ్రాజ్య పతనా నంతరము బహమనీ సుల్తానులు ఐదుగురు పరస్పరము కలహించు కొనెడి వారు. ఆ ప్రాంతములో ఆదోని, రాయచూరు, ముగ్దల్ నగరములలోని కోటలు అత్యంత కీలక స్థానము లు. ఆమూడు కోటలు బీజాపూరు నవాబు రాజ్యపరిధిలో నుండెను. మిగిలిన నల్గురు బహమనీ సుల్తానులు అత్యంతకీలక ప్రదేశము లైన యీకోటలను జయింపవలెనని బల ప్రయోగములు చూపు చుండెడివారు. ఈ మూడు కోటలు అహ్మద్ నగర రాజ్యమునకు చేరువలో నున్నవి కావున ఆరాజు వానిని కబళింపవలెనని ప్రయత్నించుచుండెను.
ఈ ప్రాంతమును రక్షించు టకు బీజాపూర్ నవాబు అసదుల్లాఖాన్ అను సైన్యాధిపతిని నియమిం చెను. అసదుల్లాఖాన్ మహాబలవంతుడు, రణ విద్యలో మిగుల నేర్పరి, ఆ ప్రదేశమునకు వాస్తవముగ అసదుల్లానే నవాబు. బీజాపూర్ నవాబు నామ మాత్రప్రభువే యని గ్రహింపవలెను.
ఆసమయములో అహ్మద్ నగర సైన్యములు ఆ ప్రదేశమునుముట్టడించెను. అసదుల్లాఖాన్ తన సైన్యములను రాజ్యరక్షణా ర్థమై సరిహద్దులకు బంపి తానే స్వయముగ బయలు దేరెను. ఆయన గ్రామ
గ్రామము దిరుగుచు యుద్ధ నిర్వహణకు ధనమును, యువకులను సంగ్రహింప నారంభించెను. అతడు ఏనుగుపై నెక్కి అశేష పరివారముతో ప్రభువువలె బయలు దేరి ప్రతి గ్రామమును, నగరమును దర్శింప నారంభించెను. ఆయనకు
స్వాగతమీయుటకు నజరానాలను సమర్పిం చుటకు ప్రతి గ్రామము లోని జనులొకచోట సమావేశ మయ్యెడివారు. యువకులు తమంతట తామే సైన్యములో జేరుటకు తమ సంసిద్ధత ను వెల్లడించెడివారు.
అసదుల్లాఖాన్ ఆదోని నుండి బయలుదేరి కందనాతి గ్రామముగుండా పయనించుచుండగ ఆ గ్రామస్తులందఱు స్వాగత మిచ్చుటకై సమావేశమైరి. ఆ సమయముననే సరిహద్దునందు గల యుద్ధ శిబిరమునుండి ఒక రౌతు అసదుల్లాఖాన్ కడకు వచ్చి సలాము చేసి సీలు వేసియున్న ఒకపత్రమును సమర్పించెను. గజము నధిరోహించియున్న ఖాను అదియొక ముఖ్యమైన యుద్ధవార్త యనిగ్రహించి దాని నందుకొని తనకు స్వాగతము బల్కుటకై సమావేశమైన ప్రజలను జూచెను. వారిలో నిలువ బడియున్న, ఆజాను బాహువైన ఒక యువకు డు అసదుల్లాఖాన్ దృష్టి నాకర్షించెను. ఆ యువకు నిలో ప్రకాశించుచున్న అద్భుతతేజమును గాంచి ఖాను పరమాశ్చర్యచకితు డయ్యెను. ఆయువకుని తనవద్ద కాహ్వానించి తనసరసన కూర్చుండ బెట్టుకొనెను. ఆయువకుడే శ్రీరాఘవేంద్ర తీర్థ స్వామిచే ఆదోనిలో ఆశీర్వదింప బడిన పశుల కాపరియైన బ్రాహ్మణుడు. అసదుల్లా ఖాన్ తన హస్తములో నున్న పత్రమును ఆబ్రాహ్మణ బాలకున కిచ్చి చదువవలసినదిగా ఆజ్ఞా పించెను. తనజీవితములో విద్యాభ్యాసమే ఎఱుగని వెంకన్న శ్రీరాఘవేంద్రతీర్థ స్వామి యాశీర్వచనముపై అఖండ విశ్వాసము గల్గినవాడై మనస్సులో గురు దేవునిదివ్యనామము ను జపించి రక్షింపుమని ష్ట్రార్థించి ఆపత్రమును విప్పెను.
ఆసమయమున వెంకన్నకు సకల విద్యా జ్ఞానము క్షణములో స్ఫురింపగా పర్షియా భాషలోనున్న ఆయుత్తరమును జదివి అసదుల్లాఖాన్ కు వినిపిం చెను. యుద్ధములో అఖండ విజయము కల్గినదని, అహమ్మద్ నగర సైన్యములు పలాయ నము చిత్తగించినవని, మఱియెట్టి సహాయము అవసరము లేదనీ ఆ లేఖ సారాంశము. ఆ విజయ వార్తను విన్న అసదుల్లా ఖాన్ అత్యంతానందము నొంది ఇదియంతయు ఈ బాలకుని దర్శనమువలన కల్గినయదృష్టమే యని భావించెను. వెంకన్నను తనతో తోడ్కొని ఆదోనిచేరి తనదర్బారులో ముఖ్య అధికారిగా నియమించెను.
వెంకన్న శ్రీరాఘవేంద్రతీర్థ స్వామి యాశీర్వాద బలమువలన రాజకీయ ములలో చతురుడై అనతి కాలములోనే అసదుల్లా ఖాన్ కు కుడిభుజ మయ్యెను. అసదుల్లాఖాన్ వెంకన్నను తనరాజ్యమున కు అమాత్యునిగా నియమించెను. నాటి నుండి వెంకన్న దివాను వెంకన్నగా విఖ్యాతుడై రాజ్యములోగల అత్యున్న త పదవి నలంకరించి రాజ్య సుఖములను బడసెను. మహాత్ముల నాశ్రయించినవారు పశుల కాపరియైన నేమి? నిశ్చయముగ అత్యున్న తులు అమాత్యులు కాగలరు.
శ్రీ వాదిరాజ తీర్థస్వామి:
సాధువులు, భక్తులు, యతీశ్వరులు, ప్రజల నాకర్షించుటకు, వారిని తమశిష్యులుగ నొనర్చు కొనుటకు అద్భుతములను ప్రదర్శించుట పరిపాటియే. వారుమహిమ లెన్నియో చిత్రవిచిత్రముగ ప్రదర్శించి దుఃఖితుల దుఃఖములను బాపెదరు. ఆశ్రితులకు వారి వాంఛితములను దీర్చెదరు. మహాత్ముల మనుకొనెడి కొందఱు కుద్రవిద్యలను ప్రదర్శించి స్వార్థ ప్రయోజనములను సాధించుకొందురు. కాని సత్యమార్గావలంబులైన మహాత్ములు మాత్రము దేహధారుల నుద్ధరించి వారికి భగవంతుని భక్త్యా రాథనలను ప్రబోధించుటకే మహత్తులను ప్రదర్శిం చెదరు.
ఇట్టి మహాత్ములు అసమాన తపోశక్తి సమన్వితులై, తపస్సు ద్వారమున అఖండమైన యనిష్టమైన పుణ్యమును సముపార్జించి ఆ పుణ్య మును మానవుల తాపత్రయములను తొల గించుటకై నుపయోగించె దరు. వీరు ప్రతిఫలముగ దేనిని గూడ అభిలషింపక కేవలము పారమార్థిక మార్గమునే పురోగమిం చెదరు. ఇట్టి నిస్వార్థ భక్తులలో వరేణ్యుడైన వాడే నేటికిని మంత్రాల య బృందావనములో విరాజిల్లియున్న శ్రీ రాఘ వేంద్రతీర్థ యతీంద్రులు. ఈమహాత్ముడు అఖండ దైవ శక్తిని సముపార్జించి తన్నాశ్రయించిన భక్తుల తాపత్రయములను హరించుచున్నాడు. ఆయన బృందావనమును ప్రవేశింపక మునుపు ప్రత్యక్షముగ ప్రజల నడుమ తిరుగుచు వారి యాపదలను బారద్రోలి వారిని భగవద్భక్తి మార్గాను గాములుగ నొనరించెను. వర్తమాన కాలములోకూడ శ్రీవారు మంత్రాలయాంత ర్గత బృందావనములో విరాజిల్లుచు నిత్యము తన్నాశ్రయించు చున్న అసంఖ్యాక భక్తులను రక్షించుచున్నారు. భవిష్యత్కాలములో వారు ఎందరి నుద్ధరించెదరో
ఎవరికి తెలియును?
ప్రపంచ చరిత్రలో సజీవముగ బృందావన మును ప్రవేశించి వందల కొలది సంవత్సరముల పర్యంతము సజీవులై విరా జిల్లుచు భక్తుల ననుగ్రహిం చుచున్న మహాత్ములను వ్రేళ్ళపై లెక్కింపవచ్చును. వారిలో నిరువురు అత్యంత ప్రసిద్ధులు. ఒకరు సోదెమఠాధిపతు లైన శ్రీ వాదిరాజ తీర్థులు, ఉడిపిలో శ్రీమధ్యాచార్య నిర్మితములైన అష్టమఠ ములలో నిదియొకటి. వీరి బృందావనము ధార్వార్ జిల్లాలో సిర్సీ తాలుకాలో సోందాయను గ్రామమున కలదు.
శ్రీ వాదిరాజతీర్థ స్వామి సంస్కృతములో మహా పండితుడు. కన్నడకవి. ఈ మహానుభావుడు సంస్కృ తములో అనేక గ్రంథము లను రచించి వేలకొలదిగ కన్నడగీతములను ప్రవచిం చెను.
ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమఏవ చ
పూర్ణప్రజ్ఞః తృతీయస్తు చతుర్ధో వాదిరాజవై |
మూలవాయు దేవుని ప్రథమావతారమే శ్రీరామ చంద్ర దివ్య పాదారవింద మకరందామృతా స్వాది యైన శ్రీహనుమంతుడు. రెండవయవతారమే నాగా యుత బలసంపన్నుడైన భీమ సేనుడు, మూడవ అవతారమే పూర్ణ ప్రజ్ఞుడు జగద్గురువునగు శ్రీ మధ్వా చార్యులు. నాల్గవయవ తారమే నేటికిని బృందావనములో సజీవ ముగనున్న శ్రీవాదిరాజతీర్థ స్వామి. ద్వాపర యుగము లో రుక్మిణీ దేవినుండి అభ్యర్ధనా పత్రమును దోడ్కొని క్షణములో కుండినపురము నుండి ద్వారకకు జేరిన బ్రాహ్మణ
దైవమే శ్రీవాదిరాజస్వామి.
శ్రీవాదిరాజతీర్థ స్వామి బృందావనమును ప్రవే శించి యనేక సంవత్సర ములు గతించెను. నేటి వరకు ఆయన రెండు పర్యాయములు తన భక్తులకు ప్రత్యక్ష దర్శనము నొసంగెను. శ్రీస్వామి బృందావనములో సదా విరాజిల్లుచు వర్తమాన కాలములోగూడ ఆశ్రిత భక్తులను అనుగ్రహించు చున్నారు. శ్రీవాదిరాజతీర్థ స్వామి శ్రీహయగ్రీవదేవుని అనన్యభక్తితో ఆరాధిం చెను. శ్రీవాదిరాజతీర్థ స్వామి నిత్యము ప్రసాద మునొక పళ్ళెరములో నుంచి శ్రీహయగ్రీవునకు అర్పించెడివారు, శ్రీహయ గ్రీవుడు హయరూపమున నరుదెంచి ఆ ప్రసాదమును స్వయముగ స్వీకరించి భక్తునకై భుక్త శేషమును మిగిల్చెడివాడు. ఆ ప్రసాద మునుమాత్రమే ఆరగించి శ్రీవాదిరాజతీర్థ స్వామి జీవనమును సాగించెడి వారు.
కొందఱు దుర్మార్గులు శ్రీ స్వామివారిని సంహరించు టకు ప్రసాదములో కాలకూట విషమును కలిపిరి. ప్రసాదములో విషముమిళితమై యున్న దనిదెలియక శ్రీతీర్థులు ఆ ప్రసాదమునే స్వామికి అర్పించెను. శ్రీహయగ్రీవ స్వామి హయరూపమున
నరుదెంచి ఆప్రసాదమును స్వీకరింపక నేలపై బడవైచి భంగమొనరించెను.
భక్తునకునెదుట సాక్షాత్క రించి జరిగిన విషయము తెలిపి దుష్టులను శిక్షిం చెను. శ్రీవాదిరాజతీర్థ స్వామి ననుగ్రహించి అంతర్హితుడయ్యెను. శ్రీహయగ్రీవ దేవుని సాక్షాత్కరింప జేసికొన్న శ్రీవాదిరాజతీర్థ స్వామి భావికల్పములో వాయు దేవునిగా ఆవిర్భవింప గలడని అపరోక్ష జ్ఞానులు నొక్కి వక్కాణించు చున్నారు.
రెండవమహాత్ముడే శ్రీ రాఘవేంద్రతీర్థస్వామి. ఈ మహాపురుషుడు మంత్రా లయాంతర్గత బృందావన ములో విరాజిల్లుచు తన్నాశ్రయించిన భక్తుల తాపత్రయములను బాపు చున్నారు. శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి శ్రీకృష్ణ భగవానునకు అనన్య భక్తులు, అఖండ శ్రీ మూల రామారాధకులు. తన వివిధావతారములలో సముపార్జించిన అఖండ ము, అనిష్టము నగు పుణ్యమును ఆశ్రితభక్తుల కొసంగి పుణ్యక్షయ మొనరించుకొని పరంధామ మునకు మఱలిపోవుటకే శ్రీవారు మంత్రాలయాంత ర్గత బృందావనములో వేంచేసియున్నారు. అవిచ్ఛిన్నముగ దాన మొనరించిన ఆపరమ భాగవతోత్తముని యనిష్ట పుణ్యరాశి ఏడువందల సంవత్సరములకు గాని తరుగదు. కావున శ్రీరాఘవేంద్రతీర్థ స్వామి నేటికిని బృందావనముననే యుండి పుణ్యదానము చేయుచు, పుణ్యక్షయా నంతరము దివ్యపరంధా మతమునకు వెడలి పోగలరు.
శ్రీ గురు రాఘవేంద్ర
*****
శ్రీ రాఘవేంద్ర
కల్పవృక్షము
11 వ భాగము
సమాప్తము. **