🔱 *కుమారచరిత్ర* -17🔱

P Madhav Kumar


*శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః* 

సూరుడు మరియు పద్ముడు అనే వారు తారకుని సహోదరులు. వారు మహేశ్వరుని మెప్పించి ఒకే శరీర రూపులై వుండేటట్టుగాను , శివ అయోనిజ సంతానం చేతులో తప్ప వేరెవరి చేతులలో మరణం లేకుండా వుండేటట్టు వరం పొందారు .

 

సూరపద్మ సింహముఖ లతో తలపడడానికి దేవగణాలన్నీ స్కందుని నాయకత్వములో కదిలాయి .

 

కార్తికేయుడు ఆరు రణ శిబిరాలు ఏర్పాటు చేసాడు .


 ఈ ఆరు క్షేత్రములు సుబ్రహ్మణ్యుని ఆరు ముఖములుగా పురాణములు చెప్తున్నాయి.


 ఈ ఆరు దివ్యమైన క్షేత్రములను తమిళనాడు లో ఆరుపడై వీడు అంటారు.


 

 ఈ ఆరు క్షేత్రములలో సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రతీ చోటా రాక్షస సంహారం చేసేముందు విడిది చేసిన ప్రదేశములుగా ప్రఖ్యాత తమిళ కవి శ్రీ నక్కీరన్ కీర్తించారు.


 

 ఈ ఆరు క్షేత్రములు వరుసగా

 

1.తిరుచెందూర్ 

 2.తిరుప్పరంకుండ్రం 

 3. పళముదిర్చొళై

 4.పళని

 5. స్వామిమలై

 6.తిరుత్తణి 

                                                                                    

                                         దేవతలందరూ తమ శక్తులన్నింటినీ కుమారస్వామికి ధారపోశారు. 


పార్వతీ పరమేశ్వరులిద్దరూ కలిసి త్రిశూలము, పినాకము, పాశుపతాస్త్రము, గొడ్డలి, శక్తి, శూలములను (శూలము అమ్మవారి శక్తి) ఇచ్చారు. 

జగజ్జనని పార్వతి కుమారునికి ఒక మయూరాన్ని బహుకరించింది . ఆ మయూరం సామాన్యమయినది కాదు .స్వయంగా శివాంశ కల్గినది .

 

పూర్వం ఒకప్పుడు జలప్రళయం సంభవించినది . ఆ విలయం నుండి సృష్టి ని రక్షించడానికి స్వయంగా పరమశివుడు మయూరాకృతిని ధరించాడు.మెరుస్తున్న సువర్ణమయమైన ఈకాలతో నీలివర్ణపు మెడతో ప్రకాశవంతమైన చిన్న కళ్ళతో వున్న ఆ మయూరం పెద్ద శబ్దం చేసుకుంటూ వినువీధిలో విహరిస్తుంటే ఆ ప్రచండ వేగానికి భూమి మీద సముద్రాలన్నీ అల్లకల్లోలమైనాయి .

 

దానితో సముద్రుడు మయూరం దగ్గరకు వచ్చి ' మయూరమా నీ భీకర ధ్వనిని ఉపసంహరించు ఇంత వరకు ప్రళయం లో మరణించిన వారందరిని నీ అమోఘ శక్తీ తో బ్రతికించు ' అని వేడుకొనగా ఆ మయూరం తన వేగాన్ని తగ్గించి రెక్కలును గట్టిగ విదిలించగా సమస్తమైన సృష్టి ఆవిర్భవించింది . ఇలా జరిగిన కల్పం మయూర కల్పం గా ఖ్యాతి పొందింది .

 

ఇంతటి శక్తి వంతమైన నెమలిని జగన్మాత స్కందునకు వాహనంగా బహుకరించింది 

 

కుమారస్వామి  యుధ్ధానికి వెళ్ళేటప్పుడు పార్వతీదేవి, పరమేశ్వరుడు వేలాయుధాన్ని యిచ్చి అశీర్వదించి యుద్ధానికి పంపుతారు  


స్కందుని నాయకత్వములో దేవతా సమూహము దిక్కులదిరేలా రణ నినాదాలు చేస్తూ సూరపద్ముల సేనతో తలబడ్డాయి .


దేవాసుర గణాల మధ్య భీకర సమరం జరిగింది షణ్ముఖ అస్త్రాల ధాటికి రక్షద సేన విలవిలలాడింది ఎటు చూసిన రక్తపుటేరులూ , పీనుగుల కుప్పలు , తెగిన మొండాలతో రణరంగం భయానకంగా మారింది 

 

ఆ యుధ్ధం లో క్షతగాత్రులైన దేవతలకు శివుడు వైద్యునిగా సేవలందిస్తాడు


 

వైధ్యుడుగా దేవతలకు సేవలందిస్తున్న శివునికి ఓషధులు కలిపిన తైలం అందిస్తూ సహాయ సహకారాలను అందిస్తుంది  

పార్వతీ దేవి(అందుకనే శివుని వైదీశ్వరన్ అని పిలుస్తారు. ఇదే రూపంలో ఆయన వైదీశ్వరన్ కోవెల లో భక్తుల వ్యాధుల , వ్యధల ను తీర్చే దేవతగా వెలిశారు)


సూర పద్ముడు శాంభవి విద్యతో దేవతలను చికాకు పరిచాడు .స్కందుడు దానికి ధీటుగా ఆ మాయలన్నిటిని ఛేదించాడు కుమారస్వామి ఆరు రోజుల పాటు యుద్ధం చేసాడు. ఆ యుద్ధం కార్తీక మాస శుక్ల పాడ్యమి రోజున మొదలైంది. యుద్ధంలో ఆరవ రోజు సూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి తలపడ్డాడు.

  

మహావిష్ణువు సూచనతో స్కందుడు శూలాయుధం ప్రయోగించి ఆ పక్షిని రెండుగా ఖండించగా ఒకటి నెమలిగా, రెండవది కోడిపుంజుగా మారి స్వామిని శరణువేడాయి.


 స్వామి కరుణించి నెమలిని వాహనంగా, కోడిని ధ్వజంగా చేసుకున్నారు. 

 

ఆ రోజును సూరసంహారంగా, స్కంద షష్ఠిగా వేడుక జరుపుకుంటారు. 

 

కార్తీక మాసంలో శుక్ల పక్ష షష్ఠిని సూరసంహారం పేరుతో ఆరు రోజుల ఉత్సవంగా జరుపుకుంటారు.


ఓం ఆదిత్యవిష్ణువిఘ్నేశరుద్రబ్రహ్మమరుద్గణాః |

లోకపాలాః సర్వదేవాః చరాచరమిదం జగత్  ౧ 

 

   

  🔱   *ఓం శరవణ భవ* 🔱


శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో  మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏


🌸 *జై శ్రీమన్నారాయణ* 🌸

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat