🔱 కుమారచరిత్ర* -18 🔱

P Madhav Kumar


శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః 

యుద్ధానంతరం సూరపద్ములు ఆక్రమించిన అమర సింహసనాన్ని తిరిగి దేవేంద్రుడికి అప్పగించి త్రిలోకాధిపత్యము కట్టపెట్టాడు .


 

 అనంతరం కార్తికేయుడు తిరుప్పగుండ్రం ప్రదేశములో విశ్రమించగా మహేంద్రుడు దేవసేనను అక్కడకు తీసుకు వచ్చి  

" కుమారా! ఈ కన్యను బ్రహ్మదేవుడు నీ కొరకే సృష్టించాడు ఈమెను చేపట్టవలదినిదిగా ప్రార్ధించగా " కుమారస్వామి అందుకు అంగీకరించి దేవసేనను వివాహమాడాడు. అమర వైభవంతో దేవ గణాలన్నీ వారి వివాహాన్ని జరిపాయి . రంగ రంగ వైభవం తో దేవసేన సుబ్రమణ్యుల వివాహం జరిగింది 

 

అల్లునికి కానుకగా ఐరవాత సమేతంగా అమూల్య వస్తువులను ఇంద్రుడు బహూకరించాడు .  

మహా విష్ణువు తన మేనల్లుడు / అల్లుడుకు అపూర్వ యశస్సును ప్రసాదించాడు . 

సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహా విష్ణువు చెల్లెలైన పార్వతీ దేవి కుమారుడు కాబట్టి.  

శ్రీ మహా విష్ణువుకు మేనల్లుడు అవుతాడు కాబట్టి ‘మేల్ - మురుగన్’ అని ప్రఖ్యాతి. 

‘మరుమగన్’ అంటే అల్లుడు.


 పూర్వజన్మలో వల్లి మరియు దేవసేన విష్ణువు కుమార్తెలు. అందుకే మహావిష్ణువు సుబ్రహ్మణ్యుడికి మామ అవుతారు. ఆయన శివునికి పుత్రుడు, విష్ణువుకి అల్లుడు. అందుకే  సుబ్రహ్మణ్యుణ్ణి ‘మరుగోనె’ అని అంటారు.

 మహేశ్వరుడు కుమారస్వామి ని కుజగ్రహాని కి అధిదేవత గా చేసారు 

 

(అప్పటినుండి జాతకం లో కుజదోషం కల్గి వెతలు అనుభవించే వారందరు కార్తికేయుని పూజించి ఆయన కరుణతో దోష నివారణ పొంది సుఖ సంతోషాలతో జీవించారు) .

 

 లోకమాత తన అపూర్వ శక్తులను కుమారునికి ప్రసాదించి దేవసేనను సంతానాధి దేవత ( షష్ఠి దేవత గా ) చేసింది . ముల్లోకాలు ఆ కల్యాణ వైభోగాలతో తరించారు .  

 

షష్టీ దేవి ఉపాఖ్యానం :

 

ఈ దేవి కధ చాలా మహిమ గలది. ప్రకృతి దేవి యొక్క షష్టా౦శ (ఆరవ కళ) వల్ల అవతరించినది గనుక ఆమెకు షష్టీ దేవి అని పేరు వచ్చినది.

 

ఈ దేవి పేరు దేవ సేన. ఈమె కుమార స్వామికి ప్రియురాలు. శిశు రక్షకి. బాలారిష్టముల నుంచి శిశువులను కాపాడుతుంది.  

శిశువుల ప్రక్కనే వుండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది. శిశువుల పాలిట ఈ దేవి దివ్య మాత. ఈమెకు సంబంధించిన కధ వ్రాసినా, వినినా, చదివినా సుఖ సంపదలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యముగా గర్భముతో వున్నవాళ్ళు తప్పక రోజూ చదవ వలసిన మహా మంత్రము, స్తోత్రము ,కధ ఇది. 

 

స్వాయంభువ మనువు కొడుకు ప్రియవ్రతుడు, సార్ధక నామధేయుడు, సంసార సంబంధము బంధకారణమని పెండ్లి మాని తపస్సు చేస్తూ వుండగా బ్రహ్మ వచ్చి, సంసారం సక్రమముగా చేసి పుత్రుని గని వానికి రాజ్యం అప్పగించి తపస్సు 

చేయడం రాజ ధర్మం, అని చెప్పగా, ప్రియ వ్రతుడు మాలతి అనే క్షత్రియ కన్యను పరిణయమాడి, దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వచ్చారు.  

ఎంతకాలమైనా సంతతి కలుగలేదు. కశ్యప మహాముని ప్రోత్సాహాముతో పుత్ర కామేష్టి చేసినారు. తత్ఫలితముగా రాజ పత్ని గర్భవతి అయినది. ఆ గర్భం చాలా దుర్భరముగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత శిశువును కన్నది. కన్నతల్లి కడుపు భాధ చెప్ప శక్యం కాదు. ఏడిచి ఏడిచి సొమ్మసిల్లి పడిపోయినది. 

ప్రియవ్రతుడు లోలోపల క్రుంగి కొంతసేపటికి తేరుకొని, రాతి గుండెతో శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్లి  

అక్కడ క్రింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చున్నాడు.


అంతలో అక్కడకు ఒక దివ్య విమానములో ఒక దేవత వచ్చినది. 

ఆ దేవతకు ప్రియవ్రతుడు అభివాదము చేసి “ అమ్మా ఎవరు మీరు? మీ తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు ఇక్కడకు దయచేసినారు? అని సవినయముగా అడిగాడు.“రాజా! నేను ప్రకృతి షష్టా౦శ వల్ల బ్రహ్మ మానస సృష్టిగా అవతరించినాను. స్కందుని పత్నిని.  

నా పేరు దేవసేన. షష్టి దేవి అని నన్ను స్మరిస్తారు. .అని అన్నది. 

 

ప్రియవ్రతుడి ప్రార్ధనతో కనికరించి పిల్లవానిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతుడికి ఇస్తూ “వీని పేరు సువ్రతుడు, అప్రమేయమైన బల పరాక్రమాలతో ఈ భూమిని ఏకచ్చత్రంగా పాలిస్తాడు, నూరు యజ్ఞాలు చేస్తాడు. అని అన్నది.   

వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ, నీ ప్రజల చేత కూడా ఆరాధింప చేస్తూ వుండు. నీకు అంతా మంచి జరుగుతుంది అని దీవించి అంతర్దానమైనది.


 ప్రియవ్రతుడు పరమానందముతో ఇంటికి వచ్చి షష్టీ దేవి యొక్క కధ చెప్పి, తన భార్య తో కలిసి వేదోక్త విధానముగా ఆ దేవిని ఆరాధించి, ప్రజల చేత కూడా షష్టీ దేవి యొక్క పూజలు చేయించినాడు.


పురుటింట ఆరవనాడు షష్టీ పూజ చేస్తే పురుటితల్లికి,

పుట్టిన శిశువుకు క్షేమం. 

అలాగే పురిటి శుద్దినాడు కూడా చేయించడం చాలా మంచిది. అన్న ప్రాశన సమయములో కూడా చేయడం వలన పురిటి దోషాలు, బాలారిష్ట దోషములు తొలగి శిశువు పూర్ణాయుర్దాయము కలిగి ఉండును. 

సంతానం లేని వారు, కొడుకును కోరి షష్టీ దేవిని పూజించి యీ స్తోత్రముతో శ్రద్దా భక్తులతో పఠిస్తూ వుంటే శుభలక్షణ లక్షితుడు, దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు.


బాల బాలికలు భయపడి ఏడుస్తూవున్నప్పుడు, పురిటి ఇంట ఈ స్తోత్రం పఠిస్తే అన్ని భాధలు పోయి, పిల్లలు సుఖముగా,సురక్షితముగా వుంటారు. షష్టీ దేవి అనుగ్రహము వలన అన్ని రకములైన బాల గ్రహ పీడలు తొలగి పోతాయి.  

ఇది షష్టీ దేవి కధ.


🍁🍁🍁🍁🍁🍁

     


  🔱   *ఓం శరవణ భవ* 🔱


శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో  మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏


🌸 *జై శ్రీమన్నారాయణ* 🌸

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat