శ్రీ వేంకటేశ్వర లీలలు* 🐚☀️ *పార్ట్ - 56*

P Madhav Kumar

 

#శ్రీ వేంకటేశ్వర లీలలు

🐚☀️ *

🌸 *ఫల్గుణి తీర్థము:*

పూర్వము సనకనందనాదులు, సప్త ఋషులు యీ తీర్థమున నివసించుచుండిరి. ఈ తీర్థము చాలా పవిత్రమైనది. పల్గుని తీర్థమందు నివసించి అరుంధతిదేవి మహాలక్ష్మీని గూర్చి భక్తితో తపస్సు చేసెను.

అరుంధతిదేవి తపస్సునకు మెచ్చి శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమయ్యేను. ఆ దినము ఫాల్గుణ శుక్ల పౌర్ణమరోజు. ఫల్గుణి నక్షత్రము ఉన్నప్పుడు యీ తీర్థమున స్నానమొనర్చిన వారికి సమస్త కోరికలు ఇత్తునని లక్ష్మీదేవి అనుగ్రహించెను. అట్టి భక్తుల ఇంట తాను నివసింతుననేను.

ఆ తీర్థ సమీపమున అగస్త్య మహాముని పూలతోట నిర్మించి ఆ తోటలోని పూలతో శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యమూ పూజించుచుండును. ఆ తీర్థము చాలా మహిమ గలది.

🌸 *సనకసనందన తీర్థము:*

మహాయోగులు యోగసిద్ధి కొరకు యీ తీర్థమున మునుగుదురు. ఈ తీర్థము పాపనాశమునకు ఒక మైలు దూరమున నున్నది.

ఈ తీర్థము ఆశ్రయించి అందరూ మార్గశిర త్రయోదశి దినమున ఈ సనకసనందన తీర్థములో స్నానమాడి భక్తితో శ్రీ వేంకటేశ్వర స్వామి అష్టాక్షరీని జపించిన మంత్రసిద్ధి గలిగి మోక్షము లభించును. ఇచ్చటనూ అనేక మంది మహామునులు తపస్సు చేసి సిద్ధిబొందిరి.

🌸 *దేవ తీర్థము:*

తిరుమలలో శ్రీవారి ఆలయానికి వాయువ్య దిశలో ఉంది ఈ దేవతీర్థము.

పుష్యమీ నక్షత్రం కలిసిన గురువారం కానీ శ్రవణా నక్షత్రయుక్తమైన సోమవారం నాడు కానీ ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు నశించి, దీర్ఘాయువు వరమై, ఆ తర్వాత మొక్షసిద్ది కలుగుతుందని ప్రతీతి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat