దసర పండుగ రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు..? విజయాలకు జమ్మిచెట్టుకు ఉన్న సంబంధమేంటి…?

P Madhav Kumar


చెడుపై మంచి సాధించిన విజయం విజయదశమి పండుగ. లోకకంఠకులైన రాక్షసులను సంహరించిన అమ్మవారిని వివిధ రూపాల్లో కొలిచే పండుగ విజయదశమి. అటువంటి దసర పండుగ రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు..? విజయాలకు జమ్మిచెట్టుకు ఉన్న సంబంధమేంటి...?


Jammi chettu : చెడుపై మంచి సాధించిన విజయం విజయదశమి పండుగ. లోకకంఠకులైన రాక్షసులను సంహరించిన అమ్మవారిని వివిధ రూపాల్లో కొలిచే పండుగ విజయదశమి. పాండవులు,శ్రీరాముడు ఇలా యుగాలు ఏమైనా విజయాలు సిద్ధించిన రోజు జరుపుకునే పండుగ విజయ దశమి పండుగ. అటువంటి విజయ దశమి పండుగ రోజున దేవతా వృక్షమైన జమ్మిచెట్టును పూజించటం సంప్రదాయంగా వస్తోంది. జమ్మి చెట్టును ‘శమీ వృక్షం’అని అంటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు మరి ముఖ్యంగా వివాహాలు జరిగితే జమ్మిచెట్టుకు పానకాలు పోస్తారు. ‘చలిమిడి పానకాలు’పోస్తారు. అలాగే మొక్కులు చెల్లించుకోవటానికి కూడా జమ్మిచెట్టుకు చలిమిడి పానకాలు పోస్తారు.

హిందు సంప్రదాయంలోను జమ్మిచెట్టుకు విశిష్టత ఉంది. విజయదశమి పండుగ రోజున జమ్మిచెట్టును పూజించటం సాంప్రదాయంగా వస్తుంది. పురాణాల్లోను జమ్మిచెట్టుకు సంబంధమైనా చాలా కథలున్నాయి. కౌరవులతో పాచికలు ఆడి రాజ్యంతో పాటు అన్ని కోల్పోయి పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్ళే సమయంలో పాండవులు వారి ఆయుధాలను, వస్త్రాలను జమ్మిచెట్టు మీద దాచి పెట్టారని కథనం ఉంది. అలాగే అజ్ఞాతవాసం పూర్తి అవగానే ఆయుధాలను, వస్త్రాలను క్రిందికి దించి శమీవృక్షంగా పిలిచే జమ్మిచెట్టును అపరాజిత దేవి రూపంగా పూజించి ఆశీస్సులు పొంది కౌరవులపై వాటితో విజయం సాధించారట.

దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆవిర్భవించిన దేవతా వృక్షాల్లో శమీవృక్షము కూడా ఉందని పురాణ కథల్లో ఉంది. అంతేకాదు త్రేతాయుగాన వనవాససమయంలో శ్రీరాముడు కుటీరాన్ని జమ్మి చెట్టు కలపతోనే నిర్మించకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. విజయదశమి నాడు ప్రజలచే పూలజందుకుంటున్న మహిమాన్వతిమైన వృక్షంగా జమ్మిచెట్టు పూజలందుకుంటోంది.

రుగ్వేదకాలం నుంచే జమ్మిచెట్టు ప్రస్తావన కనిపిస్తుంది. జమ్మిచెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారని చెబుతారు. ఈ చెట్టు నీరు లేని ప్రాంతాల్లో కూడా ఏపుగా పెరిగే జాతికి చెందినది. అతి త్వరగా పెరిగే మొక్క. అంతేకాదు నీరు సమృద్ధిగా లేకపోయాన సుదీర్ఘకాలం జీవించే చెట్టు ఇది. జమ్మిచెట్టు ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగిఉంది. జమ్మి ఆకులు, బెరడు, విత్తనాలు, పువ్వులు, అతిసార, గర్భకోశ, కురుపులు, పుండ్లు వంటి వ్యాధుల నివారణకు ఉపకరిస్తాయిన ఆయుర్వేద నిపుణలు చెబుతుంటారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat