అమ్మవారి చేతిలో దేవతలు వరంగా ఇచ్చిన ఆయుధాలు కనిపిస్తాయి. అయితే ఈ ఆయుధాలు వేటికి సంకేతమో తెలుసా?
బ్రహ్మదేవుడి నుంచి వరం పొందిన మహిషాసురుడు దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపడతాడు. దిక్కులేని పరిస్థితుల్లో దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకుంటాడు. మహిషునిపై వారిలో కలిగిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజస్సుగా మారింది. త్రిమూర్తులు కలిసి స్త్రీ రూపంగా జన్మించింది. శివుని తేజస్సు ముఖంగా, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజస్సు పాదాలుగా అమ్మవారు 18 చేతులతో అవతరించింది. శివుడి శూలం, విష్ణువు చక్రం, ఇంద్రుడు వజ్రాయుధం, వరుణుడు పాశం, బ్రహ్మ అక్షమాల, కమండలం, హిమవంతుడు సింహాన్ని ఇచ్చారు. ఇలా సకల దేవతలు ఇచ్చిన ఆయుధాలు అమ్మవారి చేతిలో కనిపిస్తాయి.
శంఖం: శంఖం ఓంకారానికి ప్రతీక. ఈ శబ్ద రూపంలో అమ్మవారు కొలువై ఉందని సూచిస్తుంది.
ధనుర్భాణాలు: ఇవి శక్తి ని సూచిస్తాయి. ధనుర్భాణాలని ఒక చేతిలో ధరించిన దుర్గా మాత తాను స్థితి గతి శక్తులు రెండింటి మీదా అధికారం కలిగియున్నానని చెబుతుంది.
ఈటె: అగ్ని దేవుడు దుర్గామాతకు ఇచ్చిన ఆయుధం ఈటె. శక్తికి, శుభానికి దీనిని చిహ్నంగా భావిస్తారు. చెడు, మంచి వ్యక్తుల మధ్య బేధానికి ఇది ప్రతీక.