🙏 *శైలపుత్రీ దయ ఉంటే దాపత్య సమస్యలన్నీ బలాదూర్♪.*
🪷 నవరాత్రి ఉత్సవాలు దేశంలోని అన్ని చోట్ల రంగరంగ వైభోగంగా మొదలయ్యాయి♪. ఈ తొమ్మిది రోజులు ఆ ఆదిపరాశక్తిని మనం వివిధ రూపాల్లో పూజిస్తాం♪. ముఖ్యంగా నవదుర్గలను ఒక్కొక్క రోజు పూజిస్తే ఒక్కక్క ఫలితం ఉంటుందని చెబుతారు♪.
🪷 ఈ నేపథ్యంలో నవదుర్గలో మొదటి అమ్మవారైన *శైలపుత్రి అమ్మవారి దేవాలయం* గురించిన వివరాలు మీ కోసం...
🪷 శైలపుత్రి దేవాలయం ఒక ప్రాచీన దేవాలయం♪. భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందినది♪. ఇక్కడికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు♪. ఈ దేవతను ఒక్కసారి దర్శనం చేసుకొంటే మనోవాంఛలన్నీ తీరిపోతాయని చెబుతారు♪.
✳️ _*ఎక్కడ ఉంది:*_ 💐
🪷 ఈ శైలపుత్రి దేవాలయం ఉత్తరప్రదేశ్ వారణాసి ఏ-40/11, మర్హియ ఘాట్ వద్ద ఉంది♪. ఉత్తర భారత దేశంలో నవరాత్రి ఉత్సవాలను తిలకించాలనుకొనే పర్యాటకులకు ఈ దేవాలయం దర్శనానికి ఈ సమయం అత్యంత అనుకూలమైనది♪.
🪷 శైలపుత్రి పర్వత రాజు కుమార్తె♪. ఈమె రూపంలో దుర్గాదేవిని పోలి ఉంటుంది♪. భవాని, హేమావతి అని కూడా పిలుస్తారు♪. ప్రకృతిలోని అణువణువు ఆమెలో దాగి ఉంటుందని నమ్ముతారు♪. అందువల్లే శైలపుత్రి ఆరాధనకు నవరాత్రి దినోత్సవాల్లో అంతటి ప్రాధాన్యత♪.
🪷 నవరాత్రి తొమ్మిది రోజుల్లో ఏ రోజైనా అమ్మవారిని దర్శించి పూజలు జరిపితే కోరిన కోర్కెలన్నీ తీరుతాయని భక్తులు నమ్ముతారు♪. ముఖ్యంగా వైవాహిక సమస్యలన్నీ తీరిపోతాయని నమ్ముతారు♪. అందువల్లే నవరాత్రి రోజుల్లో ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో ఉంటారు♪. ఈ దేవాలయాల్లో మంత్ర, తంత్రాలనూ నేర్చుకోవచ్చు♪.
✳️ _*పురాణ కథనం.*_ 💐
🪷 హిమాలయాలతో పాటు ఈ జగత్తున ఉన్న అన్ని పర్వతాలకు రాజైన పర్వత రాజు లేదా శైలరాజు కుమార్తెగా పార్వతీ జన్మిస్తుంది♪. ఒకానొక సమయంలో ఆ శివుడి పై కోపగించుకొని ఆమె కాశీకి వస్తుంది♪. అలా కాశీకి చేరుకొన్న ఆమెకు ఆ పరిసర ప్రాంతాలు బాగా నచ్చుతాయి♪. భార్యను వెదుక్కొంటూ శివుడు కూడా కాశీకి చేరుకుంటాడు♪. అయితే, పార్వతీ దేవి తనకు ఈ ప్రాంతం బాగా నచ్చిందని తాను ఈ ప్రాంతం వదలి రానని కరాఖండిగా చెబుతుంది♪. దీంతో శివుడు కూడా కాశీలోనే ఉండటానికి సమాయత్తమవుతాడు♪. ఈ ఘటన జరిగింది నవరాత్రి సమయంలో కాబట్టి ఆ ఆదిదంపతులను జంటగా దర్శనం చేసుకోవడం వల్ల ఆలుమగల మధ్య ఉన్న అలకలు దూరమవుతాయని నమ్ముతారు♪.
✳️ _*మూడుసార్లు పూజ:*_ 💐
🪷 వారణాసిలోని శైలపుత్రి దేవాలయంలో రోజుకు మూడుసార్లు ప్రత్యేక పూజలు చేస్తారు♪. ఈ దేవికి కొబ్బరి నీరుతో పాటు ముత్తైదు సామానులను పూజ కోసం అందజేస్తారు♪.
🪷 శైలపుత్రి వాహనం వృషభం♪. కుడిచేతిలో త్రిశూలం. ఎడమచేతిలో తామర ఉంటుంది♪.
🪷 ఈ శైలపుత్రి పర్వత రాజు కుమార్తెగా జన్మించడానికి ముందు దక్షప్రజాపతి కుమార్తెగా జన్మించింది•. అప్పుడు ఆమె పేరు సతీదేవి♪. ఈ సతీదేవి శివుడిని వివాహం చేసుకొన్న విషయం తెలిసిందే♪.
❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు*
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*🙏