జ్ఞానమార్గంలో ఉన్నవారు క్షేత్ర తీర్థయాత్రలు చేయాలా?

P Madhav Kumar


 *జ:* 'మార్గం'లో ఉన్నారు కనుక, గమ్యాన్ని చేరడానికి తీర్థక్షేత్రయాత్రలు సహకరిస్తాయి. చిత్తశుద్ధి కలిగితే కానీ జ్ఞానం లభించదు. చిత్తశుద్ధికి తోడ్పడే నిత్యనైమిత్తికాది కర్మలతోపాటు, తీర్థక్షేత్ర యాత్రలు కూడా ప్రాముఖ్యాన్ని వహిస్తున్నాయి.

అంతేకాదు జ్ఞానసిద్ధిని పొందిన తరువాత కూడా జీవన్ముక్తులు పవిత్రభూముల్లో సంచరిస్తుంటారు. వారివలన తీర్థాలకు మరింత శక్తి కలుగుతుంది. జ్ఞాన, ధ్యాన, భక్తి సాధనల్లో దేనికైనా తీర్థక్షేత్రయాత్రలు సహకరిస్తాయి. పవిత్రక్షేత్రాదులలో సహజంగా ఉండేశక్తి, శీఘ్రంగా పాపక్షయం చేసి, సాధనను త్వరగా, పూర్ణంగా ఫలింపజేస్తుంది.

జ్ఞానమార్గగాములు, జ్ఞానసిద్ధిని పొందిన వారు మహాత్ములు శ్రీరమణమహర్షి అరుణాచల క్షేత్రానికి చేరడం, అక్కడే జ్ఞానసిద్ధినీ, నిర్యాణాన్నీ కూడా పొందడం- ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. యుగాలనుండి వివిధ ఆధ్యాత్మిక మార్గాల్లో సాధన చేసినవారు, సిద్ధి పొందినవారు - ఎందరో యోగులు, మహర్షులు, తపస్సులు తీర్థ క్షేత్రాలనుఆశ్రయించిన పురాణగాథలు ఎన్నో ఉన్నాయి. చారిత్రకంగా నేటికీ అందుకు తార్కాణాలున్నాయి. ఏ విధమైన ఆధ్యాత్మిక సాధనకైనా పుణ్యక్షేత్ర, తీర్థ యాత్రలు బలాన్నిస్తాయి, ఫలాన్నిస్తాయి అనడంలో సందేహం లేదు. దీనికి శాస్త్ర ప్రమాణమూ, మహాత్ముల అనుభవ ప్రమాణమూ ఉన్నాయి.


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat