విజయవాడలో అమ్మవారి అలంకారము* _*శ్రీ అన్నపూర్ణా దేవి*_

P Madhav Kumar


*అన్నం పరబ్రహ్మ స్వరూపం*. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది. 


అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్సుద్ది,  భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచిన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం.


అమ్మవారిని తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. " హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.


అమ్మవారికి కొబ్బరి అన్నం,అల్లం గారెలు నైవేద్యంగా సమర్పించాలి.


*_శ్రీ అన్నపూర్ణా దేవి    స్తోత్రము!_*


నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ

నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ |

ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ  1 


నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ

ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ |

కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ  2 


యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ

చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ |

సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ  3 


కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ 

కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ |

మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ 

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ  4 


దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ 

లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విఙ్ఞాన-దీపాంకురీ |

శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ 

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ  5 


ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ 

వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ |

సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ 

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ  6 


ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ 

కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ |

స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ 

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ  7 


దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ 

వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |

భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ 

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ  8 


చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ 

చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ 

మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ 

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ  9 


క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ 

సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ |

దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ 

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ  10 


అన్నపూర్ణే సదాపూర్ణే


ే శంకర-ప్రాణవల్లభే |

ఙ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్షామ్ దేహి చ పార్వతీ  11


మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః |

బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్  12 


సర్వ-మంగళ-మాంగల్యే శివే సర్వార్థ-సాధికే |

శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమో‌உస్తు తే  13

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat