శ్రీ వేంకటేశ్వర వైభవం - 11 🌻శుక్రవార విశేషము (అభి షేకము)🌻

P Madhav Kumar


*🌻1.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యారాధనము🌻*


*🌻శుక్రవార విశేషము (అభి షేకము)🌻*


🍃🌹సకల చరాచర జగన్నియన్తయై శ్రీ వైకుంఠాద్రియని ప్రఖ్యాతి కాంచిన ఈ తిరుమలయందు లక్ష్మీ సమాశ్లిష్ఠ భుజానరుడై అర్చావతారమున వేంచేసియున్న శ్రీవేంకటేశ్వరస్వామివారికి తద్వక్షస్థల నిత్య నివాస రసికురాలగు శ్రీలక్ష్మీ అమ్మవారికి ప్రతిశుక్రవారము అభిషేకము జరుగును.


🍃🌹శుక్రవారము ఉదయము శ్రీస్వామివారు గురువారమునాడు రాత్రి ధరించిన పూలంగితోనే విశ్వరూపదర్శనము నిచ్చెదరు.


🍃🌹విశ్వరూపదర్శనము పూర్తి అయిన పిమ్మట అర్చకులు అంతర్ద్వారము తలుపులు వేసి ఏకాంతముగా శ్రీవారి పుష్పాలంకారమును సళ్ళింపుచేసి ద్వారము తలుపులు తెరచెదరు.


*🌻శుద్ధి🌻*


పిదప ఆలయశుద్ధి జరిగి, ప్రాతఃకాలారాధనము ప్రారంభమగును


*🌻ప్రాతఃకాలారాధనము🌻*


🍃🌹మామూలు మేరకు తోమాల సేవ, ప్రభుత్వోత్సవము (కొలువు) అర్చనము, ప్రసాదములనివేదనము, శాత్తు మొర ఏకాంతముగా జరుగును.


*🌻అభి షేక పూర్వాంగములు🌻*


🍃🌹ఇటుల శ్రీస్వామివారికి ప్రాతఃకాలారాధనము పూర్తికాగానే అర్చకులు, యవనికను (తెరను) వేసి ఏకాంతముగా శ్రీవారికి శుక్రవార నిమిత్తమగు అభిషేకమునకు సంకల్పమును చేసి ఉచితములైన ఉపచారములు సమర్పించి అష్టోత్తరశతనామార్చనమును చేసెదరు. 


🍃🌹తరువాత అభిషేకమునకు పూర్వాంగముగా శ్రీవారి ఊర్ధ్వపుండ్రములోని అరభాగమున్ను తగ్గించి సూక్ష్మముగా ఊర్ధ్వపుండ్రమునుంచి వస్తోత్తరీయముల తొలగించి స్నానశాటీని లేక స్నానకౌపీనమును ధరింపజేసెదరు. 


🍃🌹ఈ సమయములో పరిచారకులు శ్రీవారి సన్నిధానమున రెండు వెండి గంగాళముల గోక్షీరములను, రెండు వెండి గంగాళముల శ్రీవారి బంగారుబావి శుద్దోదకమును సిద్ధపరచెదరు.


🍃🌹ఈ సమయముననే శ్రీస్వామివారి మహాద్వారమునకు ఇరుపార్శ్వములయందును విచిత్రాలంకార విభూషితములై విష్ణుభక్తులైన గజరాజులోయన ఊర్ధ్వపుండ్రములను ధరించిన శ్రీవారి మత్తగజములు రెండును గజపాలక శాసనములను పరిపాలించుచూ శ్రీవారి అభిషేక దర్శనానంద సమయమును వెల్లడించుచున్నవోయన మహత్తరములైన ఘీంకారములను చేయుచూ భక్తులగు యాత్రికులచే సత్కరింపబడుచూ మహారాజు చిహ్నములై అభిషేకాన్తము వరకు వేచియుండును.


🍃🌹అభిషేక సమయమును పరిపాలించు శ్రీ జియ్యంగార్లు, అధికారులు ఏకాంగులు పరిచారకులు ఆచార్యపురుషులు శ్రీవైష్ణవ స్వాములు శ్రీవారి ప్రథమ ప్రాకారములోని పరిమళం అరకువెళ్ళి అచ్చట ఏర్పాటు చేయబడియున్న రజతపాత్రములలో జియ్యంగార్లు శ్రీవారి ఊర్ధ్వపుండ్రమునకుగాను పచ్చకర్పూరము కస్తూరి కలిగియున్న రజతపాత్రమును (వెండి గిన్నెను), అధికారులు కుంకుమపువ్వుతో తయారుచేయబడిన నలుగుబిళ్ళలు చందనబిళ్ళలు, పసుపు కలిపియున్న రజతపాత్రమును, పరిచారకులు, పచ్చకర్పూరము, కుంకుమపువ్వు, చందనముతో తయారుచేయబడి "పరిమళం" అను పేరుతో వ్యవహరింపబడుచున్న సుగంధ పదార్ధముతో నిండియున్న రజత పాత్రమును, అభిషేక కైంకర్యపరులగు గృహస్థులు వారి వారి భక్తిశక్త్యనుగుణమగు ఆర్జితములననుసరించి కొందరు పూర్ణాభిషేక సేవానుగుణ పదార్ధపాత్రములను, కొందరు గంబూరా (పచ్చకర్పూరం) పాత్రములను, కొందరు జాఫ్రా (కుంకుమపువ్వు) పాత్రములను కొందరు పునుగు పాత్రములను, కొందరు కస్తూరి పాత్రములను భక్తి శ్రద్ధలతో తీసుకుని అందరు మంగళ వాద్యములతోను శ్వేతచ్ఛత్రాది మర్యాదలతోను పరి వారములతోను, ధ్వజదండ ప్రదక్షిణముగా విమాన ప్రదక్షిణము చేయుచూ సువర్ణ ద్వారమునకు వచ్చి, అచ్చటనుంచి అధికారులు, జియ్యంగార్లు, ఏకాంగులు, పరిచారకులు అభిషేక కైంకర్యపరులు ఆలయములో ప్రవేశించి ఆ పాత్రములను శ్రీవారికి సమర్పించెదరు. యవనిక (తెర) తీసివేయబడును.


 *ఓం నమో వేంకటేశాయ* 


   🙏 *ఓం నమో వేంకటేశాయ* 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat