Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

శ్రీ వేంకటేశ్వర వైభవం - 13 🌻శ్రీ లక్ష్మీ హరిద్రాభిషేకము🌻


*🌻1.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యారాధనము🌻*


*🌻శ్రీ లక్ష్మీ హరిద్రాభిషేకము🌻*


🍃🌹తిరిగి శ్రీవారికి శుదోదకాభి షేకము జరుగును. అర్చకులు ఆ . అభి షేకములో అనపాయినియై శ్రీవారి వక్షస్థలమునందు వేంచేసియున్న శ్రీలక్ష్మీ అమ్మవారికి హరిద్రాపాత్రమునుండి హరిద్రను తీసి సమర్పించి అభి షేకమును చేయుచుందురు.


🍃🌹ఈ సమయమున శ్రీవారి అభి షేక దర్శన సేవాపరాయణులగు వారలలో కొందరు శ్రీవారి వక్షస్థలమున దేదీప్యమానముగా వేంచేసి యున్న శ్రీలక్ష్మీ అమ్మవారి దర్శనమును కన్నులారచేసి పరమానంద భరితులై యుందురు.


🍃🌹శ్రీస్వామివారు సువర్ణ నాగాభరణములతో యుండిరిగాన రుద్రావతారామా... శుక్రవారము అభిషేకము జరుగును గాన శక్త్య వతారమా పద్మపీఠమునందుండిరి గాన బ్రహ్మావతారమా, లేక కుమారస్వామి అవతారమా, ఇటుల అనేక విధములుగా డోలాయ మానమానసులగు కొందరు తమ హృదయములయందు చాలా కాలమునుంచి పాతుకొనియున్న తీరని సందేహములు గాఢమైన కళంకములు, దృఢమైన అభిమానములు అన్నియు పటాపంచలై శమించి పోవుటచే నందరు పరమ వైష్ణవులగుచుందురు.


🍃🌹శ్రీస్వామివారు గురువారమున జగన్మోహనకరమగు పూలంగితో దర్శనమిచ్చి దర్శన సేవా పరాయణులయొక్క హృదయ భూములయందు భక్తి బీజములను నాటిరి గాన ఈనాడు శుక్రవారమున తమ అభిషేక సమయములో పురుష కారభూతురాలైన శ్రీలక్ష్మీ అమ్మవారితో సహా తమ స్వయం వ్యక్త దివ్య స్వస్వరూప దర్శనమిచ్చి ఆ దర్శన సేవా పరాయణులయొక్క హృదయభూముల యందు నాటిన భక్తి బీజములను తమ దయారసముతో అభిషేకము చేసి క్రమముగా అంకురితములనుగాను పల్లవితములగాను పుష్పితములనుగాను ఫలితములనుగాను చేయుచుందురు. ఇది చేతన జాతము యొక్క మహాదృష్టముగా భావించవలసియున్నది.


   *🙏ఓం నమో వేంకటేశాయ🙏*

📢 Follow