*శ్రీ హనుమ కధామృతము* 17

P Madhav Kumar


రామేశ్వర శివ లింగ ప్రతిష్ట

ఒక రోజూ శ్రీ రాముడు తన దగ్గరకు వచ్చిన ముని శ్రేస్తుల తో ”మహాత్ములారా !వేద వేదంగా పారంగతుడు ,పులస్త్య బ్రహ్మ కుమారుడు బ్రాహ్మణుడు అయిన రావణాసురున్ని SAMHARINCHQANU .అది బ్రహ్మ హత్యా పతకం అని నా మనసు చెబుతోంది .నేను ఆ పాపాన్ని నివారించు కోవాలి అంటే ఏమి చెయ్యాలో శెలవివ్వండి ”అని ప్రార్ధించాడు .దానికి ముని సత్తములు అంజలి ఘటించి ”శ్రీ రామా !నువ్వు పరమాత్మవు .నీకు దోషం అంటాడు .లోకాన్ని అనుగ్రహించాతానికే మమల్ని ఈ ప్రశ్న అడిగావు .ఇక్కడే ఈ గంధమాదన పర్వతం దగ్గరే శివ లింగ ప్రతిష్ట చెయ్యి .దోషాలు నివారింప బడుతాయి .కాశీ విశ్వ నాధుని దర్శనం కంటే ఇప్పుడు నీవు చేయ బోయే శివలింగ ప్రతిష్ట అనేక రెట్ల పుణ్య ఫలం లభింప జేసి గొప్ప దివ్య క్షేత్రం గా వర్ధిల్లు తుంది ”అని విన్న వించారు .

అప్పుడు రామ చంద్ర మూర్తి మారుతి వైపు తరిగి ”హనుమా !కైలాస పర్వతం చేరి శివలింగాన్ని ఒక నాలుగు ఘడియలలో తీసుకొని రావాలి తెగలవా ?”అని ప్రశ్నించాడు .దానికి సమీర తనయుడు ”మీరు ఆజ్ఞా పిస్తే అదెంత పనిస్వామీ !”అన్నాడు .అనుజ్న ఇచ్చి పంపాడు రాఘవుడు .ఒక్కసారిగా ఆకాశానికి కుప్పించి ఎగిరాడు .భూమి కంపించింది .కైలాసం చేరాడు .అక్కడి వారంతా భయ కంపితులఎట్లు వుంది అతని రూపం .శివలింగం కోసం వెతికితే ఎక్కడా కనిపించ లేదు .బలం పనికి రాదు .తపస్సు చేతనే లింగ దర్శనం అవుతుందని భావించాడు .కాలి బొటన వ్రేలు మీద మాత్రమే నిలబడి తపస్సు చేశాడు .ఊపిరి బిగ పట్టాడు .సూర్యుని పై చూపు నిలిపాడు .విశ్వాసం అణువణువునా నిండిన మనస్సు తో తీవ్ర తపం సలిపాడు .శివుడు మెచ్చి వెంటనే ప్రత్యక్షమయాడు .కోరిక ఏమిటి అని శంకరుడు ప్రశ్నించాడు ”శంకర ప్రభూ !భూలోకం లో నీ మిత్రుడు ,సోదరుడు శ్రీ రామ చంద్రుడు శివ లింగ ప్రతిష్ట చేసి బ్రహ్మ హత్యా పాతకాన్ని తొలగించుకోవాలని తలచాడు .నన్ను నీ దగ్గరకు పంపి మీ అవ్యయ లింగాన్ని నాలుగు ఘడియల లోపల తెమ్మని ఆజ్ఞా పించాడు ”అని మనవి చేశాడు .పరమశివుడు తక్షణమే రెండు లింగాలను అనుగ్రహించి అంతర్ధానమయాడు .

ఇక్కడ భూలోకం లో మునులందరూ ముహూర్త సమయం దాటి పోతోందని బాధ పడుతున్నారు .రామునితో వాళ్ళందరూ ”శ్రీ రామా ! హనుమ ఆలశ్యంచేశాడు .ముహూర్త సమయం మించి పోకముందే సీతా దేవి తో ఇసుకతో లింగాన్ని చేయించి ముహూర్త సమయానికి ప్రతిష్ట చెయ్యి ”అని సూచించారు .సరే నని తన అంగీకారం తెలిపాడు .సముద్ర స్నానం చేశారు సీతారాములు జ్యేష్ట మాసం లో శుక్ల పక్షం లో దశమి ,బుధవారం నాడు హస్తా నక్షత్ర ములో వ్యతీ పాత యోగం లో ,సూర్యుడు వృషభం లో ,చంద్రుడు కన్య లో వుండగా మహాపుణ్య దశా యోగం లో గంధమాదన పర్వతం వద్ద సేతు మాధ్యమం లో ఆ పుణ్య దంపతులిద్దరూ స్స్సైకత లింగ ప్రతిస్థ చేసి మహర్షుల దివ్య ఆశీర్వాదాలు అందు కొన్నారు .

మహేశ్వర ధ్యానం తో నమక ,చమకాడులతో పురుష సూక్త విధానమగా పంచామృత స్నానం చేయించి సకల పుణ్య నదీ జలాలతో అభిషేకం జరిపి నూతన వస్త్ర ,ఆభారనాదులు సమర్పించి శివ సహస్ర నామాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలను అధిక భక్తి స్శ్రద్ధాల తో చేసి వివిధ స్తోత్రాలతో మహేశ్వరుడిని స్తుతించారు అందులో నాగ బంధం అనే ఛందస్సు లో శ్రీ రాముడు చేసిన శివ స్తోత్రం దివ్య విభూతి కల్గిస్తుంది

”జయ జయ సామ గేయ -హర -సారస గర్భ శిరోహరా పురం జయ -విమలాభిదేయ -మృగ సంగత హస్త – మఖాతిభంగాదా భయ -దాహానాగనేయ -భవ భావజ గర్వభిదా -అమోహ -అవ్యయ మతిదా -శివా -అసుర వారక పుణ్యద -రామలింగమా ”శివుడు పరమానంద భరితుడై ప్రత్యక్షమయాడు .ఈ రామేశ్వర లింగం సకలజన దోష హరమనీ,సకల పుణ్యదము అని చెప్పి శివుడు అంతర్ధామయాడు .రామేశ్వరుని నిత్యాభి శేకానికి శ్రీ రాముడు తన బాణం ములుకు తోఇక్కడ ఒక నుయ్యి త్రావ్వాడు .అదే నేడు ”కోటితీర్ధం”గా పిలువ బడుతోంది .ఆ జలాలలో స్నానం చేస్తే శివ సాయుజ్యం లభిస్తుందని శ్రీ రాముడు అందరికి తెలియ జేశాడు .ఆ కోటి తీర్ధాన్ని దేవతలు ,మహర్షులు,సిద్ధులు ,సాధ్యులు పూజించి ఆ జలం తో రామేశ్వరునికి పుణ్యాభిషేకం చేసి ధన్యులయారు .

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat