*శ్రీ హనుమ కధామృతము* 18

P Madhav Kumar

           *******


శ్రీ కైలాస లింగ ప్రతిష్ట

— హనుమ మనసు లో మధన పడుతున్నాడు .తాను ఆలస్యం చేశానేమో నని ,ఇక్కడ జరగ రానిది జరిగిందేమో నని అనుకొంటూ కిందికి దిగాడు .అక్కడదేవతలు ,మునులుయక్ష ,కిన్నెర కింపురుషులు ,గంధర్వాదు లందరూ సంరంభం గా శైకత లింగాన్ని అర్చించటం గమనించి దుఃఖితుడైనాడు .శ్రీ రాముని సమీపించి ”రామా !నా లాంటి కొడుకు ఏ తల్లికి పుట్ట కూడదు .అనుకొన్న పనిని అనుకొన్న సమయం లో చేయ లేక పోయాను .నాకు మరణమే శరణ్యం ;”అన్నాడు .హనుమను ఓదార్చటానికి శ్రీ రాముడు అద్వైత బోధ చేశాడు .


”హనుమా !నేను వేరు ,నీవు వేరు అనుకోవటం వల్ల నీకు ఈ దుఖం వచ్చింది .అద్వైత సిద్ధి కలిగితే ఇది నశిస్తుంది .నువ్వు చిత్ స్వరూపుడవు .శరీరమే నేను అనే అహంకారం పోతేనే తత్వ సిద్ధికి అధికారం కల్గుతుంది .ఆత్మ స్థితి లో నిష్కేలత్వం పొందాలి .మంచి గురువు లభిస్తే నే జ్ఞానం కలుగు తుంది .కోరికల వల్లనే కర్మ ,కర్మను బట్టి సుఖ,దుఖాలు కలుగు తాయి .వివిధ జన్మలకు ఇదే కారణం .ముందుగా ”దేహ-దేహి ”భేదాన్ని తెలుసు కోవాలి .దేహాభిమానం నశించిన తర్వాత అంతాఆనందమే .మాయ వల్ల ఈ జగత్తు వున్నట్లు అనిపిస్తుంది .కాని శాశ్వతమైన ఉనికి దానికి లేదు .పురుష ప్రయత్నం వల్లనే పనులు నెర వేరుతాయి .పరమాత్మ నిత్యం.ప్రపంచం మిధ్య .ప్రపంచం నిజం గా బయట లేదు .మన లోపలే వుంది .పంచ భూతాలకు ,పది ఇంద్రియాలకు ,విషయాలకు ,చిత్తవ్రుత్తులకు తెలియబడ కుండా ,తానే తెలివి యై అన్నిటిని తెలుసుకొంటున్న తెలివి అనేది ఏదైతే వుందో ,దాన్ని తెలుసుకో .లోకం అంతా జ్ఞాత్రు ,జ్ఞేయ ,జ్ఞానం అనే త్రిపుటి మీద ఆధార పడి వుంది .ఈ త్రిపుటి నశిస్తే అసలు జ్ఞానం అఖండమైన అద్వైత చైతన్యమే .త్రిగుణాలను బయటకు నెట్టి ,విశాలబుద్ధి తో ఆలోచిస్తే ”తత్వమసి ”బోధ పడుతుంది .జ్ఞానం తో ఆత్మనే చింతించు .అప్పుడు భవ రోగాలు నశిస్తాయి .”నువ్వు చేసిన పని –నేను చేశిన పని ”అనే భేదభావం వదిలించుకో .ముహూర్తం మించి పోతోందని మహర్షులు హెచ్చరించటం తో సీత సైకత లింగాన్ని చేస్తే దాన్నిప్రతిష్టించాం .నువ్వు తెచ్చిన లింగాన్ని నీ చేతులతో ప్రతిష్ట చెయ్యి. అది నీపేర పిలువబడుతుంది జనం ముందుగా నీవు పతిస్టించిన కైలాస లింగాన్ని పూజించి తరువాతే సైకత లింగాన్ని పూజిస్తారు ,నువ్వు కూడా చాలా మంది బ్రహ్మ రాక్షసులను సంహరించావు కదా .అ పాపం పరిహారం అవుతుంది.అంతే కాదు మేము చేసింది ఇసుక లింగమే కదా .దీనిని తీసేసి నువ్వు తెచ్చిన లింగాన్నే ప్రతిస్తిన్చుదాం అని నీకు అనిపించ వచ్చు .కాని దాన్ని పెకలించటం అసాధ్యం .సైకత లింగం సప్త పాతాళాలను దాటి ఆక్రమించుకొని వుంది .నీకు చేతనైతే పీకేసి నువ్వు తెచ్చిన లింగాన్ని ప్రతిష్టించు ”అని హిత బోధ చేశాడు .

స్వామి అనుజ్న అయింది కదా నన్న సంతోషం తో ,ఇసుక లింగాన్ని తోకతో చుట్టి పీకే ప్రయత్నం చేశాడు హనుమ .రాముడు చెప్పినా హనుమ ఎందుకు ప్రయత్నం చేశాడు/అని మనకు సందేహం వస్తుంది .శ్రీ రామనాదేశ్వర లింగం కేవలం ఇసుక లింగం కాదు .అది పరమాద్భుతమైన ,మహిమాన్వితమైన లింగం అని లోకానికి చాటటమే .రాముని మహిమ అంతటిది అని .తెలియ జేప్పటమే .హనుమ ప్రయత్నం ఫలించలేదు .లక్ష్మణుడు వద్దని వారించాడు .”రామునిబ్రహ్మాస్త్రం కంటే ఈ లింగం చాలా గొప్పది .ప్రయత్నం మానుకో ”అని చెప్పాడు విభీషణుడు .అయినా పెడచెవిని పెట్టి ,తన బల శౌర్య పరాక్రమాలన్నీ ఒడ్డి ప్రయత్నించాడు హనుమ .ఇక శక్తి అంతా ఖర్చు అయిపోగా ,హనుమ మూర్చపోయాడు .సీతా రామ లక్ష్మణులు దుఖించారు .సైన్యం అంతా దుఖసాగ్గరం లో మునిగి పోయింది .కొంతసేపటికి శ్రీ రాముడు హనుమ శరీరాన్ని స్పృశించాడు .అప్పుడు మూర్చనుంచి తేరుకొన్నాడు .తన తప్పు తెలుసుకొని మన్నించమని వేడుకొన్నాడు . సీతా దేవి మారుతి తో ”ఆంజనేయా !రాముడు సకల జ్ఞాన కళా నిధి .ఆయన ఏది చేసినా లోకోపకారానికే .ఒక పరమ ప్రయోజనం కోసమే సైకత లింగాన్ని ప్రతిష్టించారు స్వామి .దాన్ని తేలిగ్గా తీసుకొని భంగ పడ్డావు .ఇలాంటి కాని పనులు ఇక ముందు చేయకు .జరిగింది మర్చి పో .నీ మనస్సుద్ధి దాశారధికి తెలుసు ”అని అనునయించింది .తరువాత హనుమకు సీతాదేవి తన అవతార రహస్యాన్ని బోధించింది .

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat