*శ్రీ హనుమ కధామృతము* 19

P Madhav Kumar

          *******


తన అవతార తత్వాన్ని సీతా దేవి హనుమకు వివరించటం

— హనుమకు సీతా సాధ్వి తన అవతార రహస్యాన్ని వివరిస్తోంది ”హనుమా !నా యదార్ధ స్వరూపాని వివరిస్తాను విను .ఈ సృష్టికి కారణమైన ఒక మహాశక్తి విశ్వ వ్యాపితం అయి వుంది .అదే చిత్ శక్తి .అది అనాది .స్వతంత్ర మైంది .అది నేనే .మొదట పురుషుని ఉత్పత్తికి కారణం ఆ శక్తే .ఆ మహాపురుషుని లో పుట్టిన సృష్టి చేయాలి అని పించింది ఆ మహా శక్తి ఏ .అదే తపశ్శక్తి .ఆయనకూ ,ఆతపశ్శక్తి కీ తేడా లేదు .ఆయన్నే సదాశివుడని ,ఆ తపస్ష్క్తికే హైమవతి అనీ పేర్లు .లోకానుగ్రహం కోసం వారు శివ పార్వతులుగా లీలా రూపాలను ధరించారు .అదే ఆది దైవిక రూపం .ఆ శివ ,శక్తి స్వరూపాలు రెండు ,మానవ శరీరం లో కుండలినీ శక్తి రూపం లో వుండి జీవ వ్యాపారానికి ఆధారం గా వున్నాయి .అదే ఆధ్యాత్మ రూపం .


ఈ విశ్వానికి కేంద్రం ఆ సత్య పురుషుడే .ఆయన చుట్టూ ఆయన తపశ్శక్తి వ్యాపించి వుంటుంది .అదే తపోలోకం .ఈ రెండిటిని శివ ,శక్తి అంటారు .ఈ రెండిటికి భేదం లేదు .ఆ మహాపురుషుని శక్తి ఆవరణం నుంచి ,ఇంకొక శక్తి ఆవరణం ఏర్పడింది .అదే జనోలోకం .ఈ మూడింటినీ సత్ ,చిత్ ,ఆనందం అంటారు .ఈ జనోలోకానికి వ్యోమము ,అంతరిక్షము ,గగనముఅని పేర్లు .ఈశ్వరుని కళా రూపమైన ఆ తపశ్శక్తికే దాక్షాయణి ,సతి ,హైమవతి ,శివా ,భవాని ,ఉమా ,కామేశ్వరి ,శివకామిని ,గిరిజ ,పార్వతి ,అనే నామాలున్నాయి .ఆ మాశాక్తికి ఆశ్రయభూతుడు ”సత్”అయితే ఆమె ”సతి ”అవుతుంది .ఆయన భవుడు అయితే ఆమె భవాని .ఆమెనే ప్రాణము అనీ పిలుస్తారు .ప్రమోద ,కళావాదులు ”ఆనంద రూపిణి ”అంటారు .వీరినే రసవాదులు అంటారు వీరికి వేదం లోని ”రాషోవై సహ ”అనేది ప్రమాణం .

ప్రాచీనులైన పూర్వ మీమాంసా వాదులుమంత్రాలతో అగ్ని హోత్రం లో ఆహుతులను సమర్పించి ఆ శక్తిని ఉపాశిస్తున్నారు .తాంత్రికులు శ్రీ విద్యోపాసన తో ఆరాధిస్తున్నారు .దేవాలయాలలో అర్చ్చనా మూర్తులను పూజించటం ఇందులోని భాగమే .యోగులు కుండలినీ శక్తి ఉల్లాసాన్ని పొంది అమృత సిద్ధి పొందుతున్నారు .ఇంకా సంగీత ,సాహిత్య ,నాట్యాల తో రస వాదులు ”నాద రూపిణి ”గా ఆరాధిస్తారు .ఇన్ని భేదాలతో ఆరాధించినా వారంతా ఆరాదించేది ఒకే శక్తినే అని మరువ రాదు .ఆంజనేయా !నువ్వు నీ తనువు ,మనసు ప్రాణాలతో మా ఇద్దరినీ కోలుస్తున్నావు .శ్రీరామ చంద్రుడు అంటే ,ఆ సత్యపురుషుని అవతారమే .ఆయనే ఈ సృష్టికి కేంద్రం .ఆయనే సదా శివుడు .సర్వరాసాశ్రయుడు ఆయనే ధార్మికుడు .ఆయన శక్తి నేనే .మా ఇద్దరికీ అభేదమే .నేను చిన్మయ రూపిణిని .నేనే సావిత్రి ,గాయిత్రి ,నేనే సతిని .సతీత్వం అంటే పురుషునితో నిరంతర సహచర్యమే నయ్యా .ఈ శక్తినే ”సంహిత ”అంటారు .సీతా రాములు గా పిలువబడే మేమే ”సంహితా స్వరూపులం ”.నేను వెద మాతను .సరస్వతిని .నేనే ”శ్రీ ”ని అందరికీ నయనానందాన్నిచ్చే సూర్య ,చంద్ర ,విద్యుత్ ,అగ్ని ,పుష్ప ,పాలవ ,మణి ,మౌక్తిక ,సువర్నాదుల కాంతినే ”శ్రీ ”అంటారు నాయనా !.ఆ శోభను నేనే .మేమిద్దరం అవతార మూర్తులం అన్న రహస్యం తెలుసుకో ”అని సీతా మాత మారుతి కి ఎరుక కలిగించింది .ఆ తరువాత అవతారం అంటే ఏమిటో వివ రించింది .

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat