_*ఆంజనేయ జననం*_
”హనుమాన్ కల్ప వ్రుక్షోమే –హనుమాన్ మామ కామధుక్
చిన్తామనిస్తూ హనుమాన్ –కో విచారః కుతో భయం .”
ఒక సారి రాక్షస బాధలు భరించ లేక దేవతలంతా బ్రహ్మ దేవుని వెంట పెట్టుకొని శివుని దగ్గరకు వెళ్ళారు .అప్పుడ్డు ఆయన వాళ్ళందర్నీ తీసుకొని బదరికా వనం లో వున్న శ్రీ మహా విష్ణు వును దర్శించాడు .రాక్షస బాధలనుంచి రక్షించ మని అందరు వేడుకొన్నారు విష్ణు మూర్తిని ..రాక్షసులు తప్పక నశిస్తారని చెప్పి ,బ్రహ్మ తో సహా అందరి దేవతల తేజస్సును ,తన తేజస్సును కలిపి ముద్దగా చేసి శివునికి ఇచ్చాడు .ఈ తేజస్సు నుంచి బలవంతుడైన వానరుడు పుట్టి ,భయం తీరుస్తాడని అభయం ఇచ్చాడు శ్రీ హరి .
కొంత కాలమ్ తర్వాత పరమేశ్వరుడు ,పార్వతీ దేవి తో కలిసి భూమండలం అంతా పర్యటిస్తూ ,ఆంద్ర దేశం లోని వెంకటాచలం చేరారు .శేష శైలం మీద చిత్ర వనం లో ఆనందం గా విహరిస్తున్నాడు .ఆయనా ,ఆమె కపి రూపం తో విహరించారు .విష్ణువు ఇచ్చిన సకల దేవతా తేజస్సును పార్వతి గర్భం లో నిక్షిప్తం చేశాడు .ఆమె దాన్ని భరించ లేక అగ్ని దేవునికిచ్చింది .ఆయనుకు శక్తి చాలక వాయుదేవునికి అందించాడు .
పూర్వం రాదంతర కల్పం లో కశ్యపుడు అనే వెద వేదాంగ పారీనుడైన బ్రాహ్మణోత్తముడు వుండే వాడు .ఆయన శివుని గురించి పంచాగ్ని మధ్యమం లో తపస్సు చేశాడు .శివుడు మెచ్చి ప్రత్యక్ష మయాడు .కోరిక ఏమిటో చెప్పమన్నాడు .”శివా !నువ్వు నాకు పుత్రుని గా జన్మించాలి ”అని ఆ బ్రాహ్మణుడు కోరాడు .”తధాస్తు ”అన్నాడు పరమేశ్వరుడు .అక్కడే వున్న అగ్ని ,వాయువుదేవులు కూడా తమకు కూడా శివుడు పుత్రుని గా జన్మించాలి అని కోరారు .అలాగే అన్నాడు .ఆ కశ్యపుడే కేసరి అనే వానర శ్రేష్టునిగా జన్మించాడు .ఆయన భార్య మహాసాద్వి అయిన సాధ్య ఈమె గౌతమ మహర్షి భార్య అహల్యకు అంజనా దేవిగా జన్మించింది .ఆమె దేవతల అభీష్టం మేరకు కేసరికి ధర్మ పత్ని అయింది .కేసరి అరవై వేలమంది వానరులకు నాయకుడు .
ఆకాలం లో ”శంబ సాధనుడు ”అనే రాక్షసుడు ,దేవ వానర రుషి గణాలను చిత్ర హింసలు పెట్టె వాడు .వారంతా బ్రహ్మ దగ్గర మొర పెట్టుకొన్నారు .ఆయన కేసరి కి మాత్రమే అతన్ని చంపే శక్తి వుందని ,ఆయన్ను శరణు కోరమని హితవు చెప్పాడు ఆయన దగ్గరకు వెళ్లి రక్షించ మన్నారు .అభయం ఇచ్చాడు కేసరి .శంకసాధనునికి తెలిసి ఆయనపై యుద్ధానికి దిగాడు .అతన్ని సంహరించి వారందరినీకాపాడాడు కేసరి .కేసరి ఆంటే సింహం అని అర్ధం కదా డాని బలం ముందు ఏదీ ఆగలేదు.