అయ్యప్ప సర్వస్వం - 29

P Madhav Kumar


*గురు అష్టకమ్*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*1.  శరీరం సురూపం తథావాకలత్రం యశశ్చారు చిత్రం ధనంమేరుతల్యం | మనశ్ఛేన్నలగ్నం గురోరంఘ్రపద్మే తతఃకిం తతఃకిం తతఃకింతతః కిమ్ ॥*


మంచి అందముగల దేహము , అటువంటిదేభార్య , మంచికీర్తి , మేరుసమానసంపద - అన్నీఉన్నాయి. కానీ గురుపాదపద్మము లందు లగ్నముకాని మనస్సున్నచో - ఆతర్వాత ఏమి ? ఆతర్వాత ఏమి ? ఆతర్వాత ఏమి ? ఆతర్వాత ఏమి ?


*2.  కలత్రంధనం పుత్రపౌత్రాది సర్వం , గృహం బాంధవాః సర్వమే తడిజాతమ్ | మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రపద్మే తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిమ్ ||*


భార్య , ధనము పుత్రపౌత్రాదులు , ఇల్లు , బంధువులు అన్నీ ఉన్నాయి. కానీ గురుపాద పద్మములందు లగ్నముకాని మనస్సుంటే , వాని గతి తర్వాత ఏమి ? వానిగతి తర్వాత ఏమి ?


*3.  షడంగాది లేదో ముఖేశాస్త్ర విద్యా కవిత్వాదిగద్యం సుపద్యం కరోతి । మనశ్చేన్నలగ్నం గురోరంఘ్రపద్మే తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిమ్ ॥*


షడంగాది వేదములు , శాస్త్రవిద్యలు వచ్చును - గద్యపద్యాలతో కవిత్వం చెప్పగలరు గురుపాద పద్మములందులగ్నము కాని మనస్సుంటే తర్వాతవానిగతేమి ?.. గతేమి ? తర్వాత వానిగతి ఏమి ?... గతి ఏమి


*4.  విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచార వృత్తేషు మత్తోనచాన్యః | మనశ్చేన్నలగ్నం గురోరంఘ్రపద్మే తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిమ్ ॥*


విదేశాలలో సన్మానము , స్వదేశంలో పేరు ప్రతిష్టలు , ఇతరులకంటే సదాచారం కలవాడు కానీ , గురుపాదపద్మములందు లగ్నము కాని మనస్సుంటే తర్వాత వానిగతిఏమి ?... తర్వాత వాగతిఏమి ?... గతిఏమి ?


*5. క్షమామండలే భూపభూపాలబృందై: సదాసేవితం యస్యపాదారవిందమ్ |మనశ్ఛేన్నలగ్నం గురోరంఘ్రపద్మే తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిమ్ ॥*


భూమండలంలోని గొప్ప భూపాలులందరూ అతని పాదార విందాల్ని సేవిస్తారు కాని గురుపాదపద్మములందు లగ్నముకాని మనస్సు గలవానియొక్క తర్వాతిగతి ఏమి ? తర్వాతిగతి ఏమి ?...ఏమి ? 


*6. యశోమేగతిందిక్షుదాన ప్రతాఫా జ్జగద్వస్తుసర్వం కరేయత్ప్ర సాదాత్ |*

*మనశ్ఛేన్నలగ్నం గురోరంఘ్రపద్మే తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిమ్ ॥*


అడవిలోకానీ , స్వంత ఇంటిలోకానీ , ఏదోకార్యమందుకానీ , దేహముపై మనస్సుంచితే వానిగతి ఏమి ? గతి ఏమి ?


*7. నభోగేనయోగేనవా వాజిరాజౌ ! నకాంతాముఖేనైవ విత్తేషు చిత్తమ్ | మనశ్చేన్నలగ్నం గురోరంఘ్రపదే తతఃకిం తతః కిం తతఃకిం తతఃకిమ్ ||*


భోగమందుకానీ , యోగమందు కానీ ఆశ్వశ్రేష్ఠములందుగానీ మనస్సు లేకపోయిననూ గురుపాదపద్మములందు మనస్సులేనివాని గతి ఏమి ?.... గతి ఏమి ?


*8. అరణ్యేనవాస్వస్యగృ హేనకార్యేనృదేహే మనోవర్తతేమే త్వన ర్వే | మనశ్చేన్నలగ్నం గురోరంఘిపద్మే తతఃకీం తతఃకిం తతః కిం తతఃకిమ్ ॥*


అడవిలోకానీ , స్వంత ఇంటిలోకానీ , ఏదోకార్యమందుకానీ , దేహముపై మనస్సుంచితే వానిగతి ఏమి ?.... గతి ఏమి ?


*9. గురోరష్టకం యఃపఠేత్ పుణ్యదేహీయతి ర్భూపతి రహ్మచారీ చగేహి | లభేద్వాంచితార్థం పదం బ్రహ్మసంజ్ఞం గురోరుక్తవాక్యేమనోయస్యలగ్నమ్ ॥*


పుణ్యాత్ముడు , యతి , భూపతి , బ్రహ్మచారీ గృహస్థుడు ఈ అష్టకమును పఠించుచు గురువు బోధించిన వాక్యములను మనస్సు నందులగ్నము చేసినచో వానికి వాంఛి తార్థములు కలుగును తుదకు బ్రహ్మపదమును పొందును - గురువేభగవంతుడు. భగవత్పాదములే గురుపాదములు.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat