*శరణుకోటి దాని విశిష్టత*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
మనిషి శరీరాన్ని పొందింది ధర్మాన్ని ఆచరిస్తూ నలుగురి చేత ఆచరింప చేయటానికి అలాకాకుండా ఈ శరీరంతో పాపపు పనులు చేస్తూ సమాజాన్ని అవినీతిమయం చేయడం ఏ పాటి నీతి ? నైతిక విలువలు దిగజార్చకండి ప్రజల శ్రేయస్సుకోసం పాటుపడండి. మనం నైతికంగా చచ్చిపోయాక భౌతికంగా మిగిలున్నా ఒకటే లేకపోయిన ఒకటే. విచ్చల విడిగా సంచరించే మనస్సును వేర్వేరు దిక్కులకు ఎగబ్రాకే దాని సంచలన ప్రవృత్తులను అదుపు చేసి ఒక కేంద్రస్థానం మీద కేంద్రీకరించడం , వంటి ఒకానొక మానసిక న్యాయమే ప్రార్థన. ప్రార్ధనలో అంతరంగిక ఆలోచనలు , అభిప్రాయాలు , భావాలు , ఈశ్వరోన్ముఖమై సద్భావనపూర్వకమై , సువ్యవస్థితమై ఒకానొక సత్కార్యక్రమ ప్రణాళికను కోరుకుంటాయి. అదే ప్రార్థనయను చర్యలోని అసలు రహస్యము.
సంగతమైన దుష్ప్రభావాలకు తొలగించుకోడానికి ప్రార్థన చేయడమే సర్వశ్రేష్టమైన మార్గం. మనం మన పిల్లలకు చేయవలసిన సత్కర్మలను గురించి మాత్రమే వారికి ఉపదేశించడం. సర్వోత్తమ మైన విధానం అదే విధంగా ఇష్టదైవమును ప్రియమైన వస్తువును మన సమక్షంలో పెట్టుకొంటే , మన మనస్సు కూడా ప్రసన్నమవుతుంది. కాబట్టి మన మనస్సుకు , ప్రార్థన అవసరం. ఆ భగవంతునికి కూడా తన కర్తవ్య నిర్వహణ , సులభమవుతుంది. కాబట్టి మన మనస్సుకు ప్రార్థన సర్వోపకారియే కాని నిర్థకమైంది కాదు. దీనివల్ల మనస్సుకు , అంతరంగికమైన విజ్ఞాన , వివేకాలు , సాష్టవం , దైవశక్తి , భక్తి 5 లభిస్తాయి. ప్రార్థన వల్ల మనస్సు ఈశ్వరోన్ముఖమై , జ్ఞానాన్ని పొందుతుంది. ప్రార్ధన ద్వారా పరమేశ్వరుని పరమాధ్బుత శక్తి మనసుకు , ఆత్మదర్శన , జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి విఘ్నాలు , వ్యాధులు , మానసిక వికారాలు , దోషాలు తొలగిపోతాయి.
మనకు కావలసిన విద్య సాశీల్యాన్ని నేర్పేది మానసిక బలాన్ని పెంపొందించేది బుద్ధిని వికసింప చేసేది తన కాళ్ళమీద తాను నిలిచేటట్లు మనిషిని తీర్చిదిద్దేది అయివుండాలి. నీటివల్ల శరీరం , సత్యంవల్ల మనస్సు , తపస్సువల్ల జీవాత్మ , తత్వవిజ్ఞానం వల్ల బుద్ధి. పరిశుభ్రమవుతాయి. చదువుకున్నవారందరూ జ్ఞానులు కారు , చేసిన వారే జ్ఞానులను బడుదురు. *శబరిమల వెళ్ళువారు అందరూ గురుస్వాములు కారు. స్వామి దీక్ష నియమాలు పాటించువారు మానవత్వం , విజ్ఞానం , సద్గుణం , త్యాగం కలవారే గురు స్వాములుగా కీర్తించ బడుతారు.* మీ మనస్సును ప్రపంచమంత విశాలం చేసుకోండి అప్పుడు మహాశక్తి మీ వెనుక వుంటుంది. ఇతరుల కోసం చేసే చిన్న పని కూడా మీలోని శక్తిని మేల్కోలుపుతుంది.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు🌹🙏