అధ్యాత్మ సంకీర్తన. 2720. 3-11-23
రేకు: 95-6. సంపుటము: 1-476
రాగము: ముఖారి. గానం:సాయి చరణ్
దైవము పుట్టించినట్టి తన సహజమే కాక
కోవిదునికైనా జాలిగుణ మేల విడుచు
॥దైవము॥
ఆరయఁ బంచదార నద్దుక తినఁబోతే
చేరరాని ముష్టిగింజ చేఁదేల మాను
సారమైన చదువులు సారె సారెఁ జదివినా
గోరపు దుష్టునికి కోపమేల మాను
॥దైవము॥
నిప్పు దెచ్చి వొడిలోన నియమానఁ బెట్టుకొంటే
యెప్పుడును రాఁజుఁ గాక యిది [1]యేల మాను
ముప్పిరిఁ బాతకుఁడైన మూఢుఁడెన్ని యాచారాలు
తప్ప కెంతసేసినాను దయ [2]యేల కలుగు
॥దైవము॥
యింటిలోనఁ గొక్కు దెచ్చి యిరవుగఁ బెట్టుకొంటే
దంటయై గోడలు వడఁదవ్వ కేల మాను
గొంటరై శ్రీవేంకటేశుఁ గొలువకుండినవాఁడు
తొంటి సంసారవుఁ గాక దొర యేఁటి కౌను
॥దైవము॥
*సేకరణ : సూర్య ప్రకాష్ నిష్టల*
꧁♾️•••••••••┉━❀🕉️❀┉┅•••••••••♾️꧂